మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ మారె ఫీల్డ్‌లోనూ లేదు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. దేశానికీ పని చేయడం మాత్రమే కాకుండా, జాబ్ షూరిటీతో, ఎలాంటి చింతా లేని జీవితాన్ని జీవించగలం అనే అభిప్రాయం ప్రభుత్వ ఉద్యోగాలను ఆకాశానికి ఎత్తేసింది.
కానీ లాభాలతో పాటు, ప్రభుత్వ ఉద్యోగాలను పొందడానికి పడే శ్రమ కూడా అదే విధంగా ఉంటుంది. అన్ని కష్టమైన పరీక్షలను దాటుకుంటూ, పోటీని గెలిచిన వారికీ మాత్రమే ఆ కష్టానికి తగిన ఫలాలు అందుతాయి.
మరి ఎలాంటి ప్రతిష్టాత్మక పదవులు, ఉద్యోగాలలో ఉండే వారు, తమ విరామ సమయాల్లో, లేదా వ్యక్తిగత జీవితాలలో తమకంటూ సంపాదనకు మరొక అవకాశాన్ని ఏర్పరచుకోవడం ఎంతవరకు సాధ్యం?
సింపుల్‌గా చెప్పాలంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం చేస్తుండగా సొంత వ్యాపారాలు నడిపించుకోవచ్చా?
అది తెలుసుకోవడానికి ముందు, అసలు ప్రభుత్వ ఉద్యోగి అంటే ఏమిటో చూద్దాం!
ముందుగా, ప్రభుత్వ ఉద్యోగి అనే వ్యక్తి ఎలాంటి క్యాటగిరిలో పడతారో తెలుసుకుందాం.
CCS (CAA), అంటే సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అని అర్ధం, రూల్ 2(h) ప్రకారం, క్రింది వారిని ప్రభుత్వ ఉద్యోగి అనొచ్చు -
- ప్రభుత్వ యూనియన్, సర్వీసులో పోస్టును కలిగిన వ్యక్తి అయి ఉండి, ప్రస్తుతం కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వం క్రింద విధులు నిర్వహించే వ్యక్తి
- రాష్ట్ర ప్రభుత్వ సేవలలో భాగమై, తాత్కాలికంగా కేంద్ర ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ, సివిల్ సర్వీసు పదవిని కలిగిన వ్యక్తి
- కేంద్ర ప్రభుత్వానికి పని చేస్తున్న లోకల్ అధికారం క్రింద తాత్కాలిక సర్వీసులో ఉన్న ఉద్యోగి
దీనిని బట్టి చూస్తే, రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ డిపార్టుమెట్లలో విధులు నిర్వహించే వారందరిని మనం ప్రభుత్వ ఉద్యోగులు అనొచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులపై పరిమితులు ఎందుకు ఉంటాయి?
ఈ విషయాన్ని అర్ధం చేసుకోవడానికి, ముందుగా మనం ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి పొజిషన్లో పని చేస్తారు, అలాగే వారి విధులు ఎంత ప్రాముఖ్యమైనవనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే, కీలకమైన సమస్యలు ఎదురైతేనే తప్ప, పరిమితులు, నిబంధనలను సాధారణంగా పెట్టరు.
ఏ ప్రభుత్వమైనా, అది రాష్ట్ర ప్రభుత్వమైనా లేదా కేంద్ర ప్రభుత్వమైనా, దేశంలో ఉన్న పరిపాలన, శాసనాలా రూపకల్పన మరియు కార్యనిర్వాహక విధులను చేపట్టడానికి గాను, ప్రజల చేత ఎన్నుకోబడినదే. మన దేశం ప్రజాస్వామ్యం, కాబట్టి ప్రభుత్వాలను ప్రజలే ఎన్నుకొని, వారు చెల్లించే పన్నుల ద్వారా ప్రభుత్వనికి నిధులు అందజేసి, నడిపించుకుంటారు. ఈ ఆదాయం ముఖ్యంగా డైరెక్ట్ మరియు ఇన్-డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో వస్తుంది.
అదే సమయంలో దేశంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరియు ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడానికి అలాగే సామజిక సంక్షేమానికి గాను ప్రభుత్వం రకరకాల బాండ్‌లను అమ్మి నిధులను సేకరిస్తుంది.
మరి అలాంటప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల కార్యకలాపాలను ఎందుకు పరిమితం చేయడం?
ప్రభుత్వానికి అందే ప్రతీ రూపాయి ప్రజల సొమ్మే. కాబట్టి ప్రతీ రూపాయికి లెక్క అప్పజెప్పవలసి ఉంటుంది. అందుకే బడ్జెట్ సమావేశాలు పెడుతుంటారు. అందులో ప్రభుత్వానికి అయిన ఖర్చు మరియు ఆదాయం గురించి తెలుస్తుంది.
అయినప్పటికీ ప్రభుత్వ లక్ష్యాలను సాదించేందుకు ఉద్యోగులకు అందించే ట్రైనింగ్, వారికీ తెలిపే సమాచారం మరియు డబ్బుపై కఠినమైన నిభందనలు, పరిమితులు పెట్టడం చాలా ముఖ్యం. అందుకు మూడు కారణాలు ఉన్నాయి.
- జవాబుదారీతనం - ప్రభుత్వానికి, తమ పెట్టుబడులు మరియు పన్ను రూపంలో డబ్బు చెల్లించే ప్రతీ పౌరునికి ఆ డబ్బు ఎలా ఖర్చు చేయబడుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. అలాగే, ప్రభుత్వానికి కూడా, వారు చేసే ఖర్చులపై ప్రజలకు నివేదిక సమర్పించవలసిన బాధ్యత ఉంటుంది. ఈ కారణంగా, ఆర్థిక శాఖ క్రింద పనిచేసే పబ్లిక్ అకౌంటెంట్లు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు, నిరంతరం పనిచేస్తూ ఉంటారు.
- దేశ భద్రత సమస్యలు - దేశ భద్రతకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకుందాం. ఎయిర్ ఫోర్స్, నావికా దళం, లేదా ఆర్మీలలో పనిచేసే ఉద్యోగులకు, చాలా ముఖ్యమైన సమాచారం మీద శిక్షణ ఇవ్వబడుతుంది. కాబట్టి దేశ భద్రతా దృష్ట్యా, ఆ సమాచారం ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళడానికి వీలు లేదు.
- గోప్యత - అదే విధంగా, శాస్త్రీయ పరిశోధన, ఆర్థిక వ్యవహారాలు, విద్య రంగం, క్రీడా రంగ, అకౌంటింగ్, మెడికల్ ఇంజనీరింగ్ అంటూ అన్ని రంగాలలో మన దేశం వీడకూడని ఎంతో సమాచారం ప్రభుత్వ ఉద్యోగులకు తెలుస్తుంది. కాబట్టి దానిని సురక్షితంగా ఉంచే బాధ్యత వారిదే. అలాంటి సున్నితమైన సమాచారం బయట పబ్లిక్‌కి ఎట్టి పరిస్థితుల్లో తెలియడానికి వీలు లేదు.
మనం పనిచేసే సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని మనం మన స్నేహితులకు, కుటుంబీకులకు చెప్పము. కారణం అది విలువైన సమాచారం. అంతెందుకు, మన ఫోన్లు, సోషల్ మీడియాలలో ఉండే సమాచారాన్నే మనం బయటకు రానివ్వం. మరి అలాంటప్పుడు, దేశ క్షేమం, అభివృద్ధికి సంబంధించిన సమాచారం బయటకి పోకుండా కాపాడుకోవడం ఎంతైనా ముఖ్యం కదా. అలాంటప్పుడు, ఆ సమాచారాన్ని కలిగి ఉండే ప్రభుత్వ ఉద్యోగులు మరొక చోట విధి నిర్వహణలు చేస్తే, ఆ యాజమాన్యానికి తెలియకుండా ఎంతవరకు ఆగుతుంది?
ప్రభుత్వం తన ఉద్యోగులపై ఎందుకు ఆంక్షలు పెడుతుందో తెలుసుకున్నాం కాబట్టి, ఇప్పుడు మిగతా విషయాన్నీ చూద్దాం!
ప్రభుత్వ ఉద్యోగులు మరొక చోట ఉద్యోగం పొందవచ్చా?
ప్రభుత్వ ఉద్యోగులు తమకు కావాలనుకుంటే, తప్పక మరొక చోట ఉద్యోగానికి అప్లై చేయవచ్చు. కాకపోతే, అప్లికేషన్ ప్రక్రియలో ముందుకు వెళ్ళడానికి ప్రభుత్వం ముందుగా తాము పనిచేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేయమని నిర్దేశించవచ్చు.
ఈ విషయం, ప్రభుతం ఆ ఉద్యోగి ట్రైనింగ్, వారి ఉద్యోగ ప్రాముఖ్యత, వారి పదవి మరియు వారికీ అందుబాటులో ఉన్న సమాచారంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా, వారు వెనుకబడిన కులాలకు లేదా అంగవైకల్యం ఉన్నవారు లేదా అని కూడా చూస్తారు.
ఒకవేళ వారు అంగవైకల్య ఉన్నవారో లేక వెనుకబడిన వర్గాలకు చెందిన వారైతే, వారి భవిష్యత్ దృష్ట్యా మరొక చోట ఉద్యోగానికి అప్లై చేయకుడదని చెప్పరు. కానీ అది ఉద్యోగాల విషయమైతేనే. మరి సొంతంగా వ్యాపారం చేయాలనుకొనే వారి సంగతి ఏమిటి?
సర్వీసులో ఉండగా, ప్రభుత్వ ఉద్యోగులు ప్రవేటుగా వ్యాపారం చేయవచ్చా?
ప్రభుత్వ ఉద్యోగులపై ఉండే ఆంక్షలలో, "సొంత వ్యాపారం చేయకూడదు" అనేది ఒక ప్రధానమైన ఆంక్ష!
వ్యాపారాలలో సహజంగానే రిక్ ఎక్కువ. అందుకే ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. పైగా చాలా పెట్టుబడి అవసరం. కాబట్టి, కాస్త ఎక్కువ ఆర్జించాలనే ఆశతో ఈ మధ్యన చాలా మంది వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలు ఉద్యోగాల పట్ల కంటే వ్యాపారాలు చేయాలనే చూస్తున్నారని గ్రహించి దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచాలనే ఉద్దేశంతో, వ్యాపారాల అభివృద్ధి బాగా జరగాలనే ఉద్దేశంతో, స్టార్ట్-అప్ లను ప్రోత్సహించాలనే చూస్తుంది.
కానీ ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇది వర్తించదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి, మరొక వ్యాపారాన్ని నడిపించుకోవడానికి అస్సలు వీలు లేదు.
అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం.
- నైతికత
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులపట్ల నైతికత కలిగి, తమ సామర్ధ్యలోపం లేకుండా ప్రజలకు సేవ చేయాలనేది నియమం. సర్వీసులో ఉన్నా, లేకపోయినా, ప్రభుత్వ ఉద్యోగికి అందుకే అంత గుర్తింపు, ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాంటి వ్యక్తులు, అదనపు సంపాదన కోసమని మరొక వ్యాపారాన్ని మొదలుపెడితే, వారి నైతికత దెబ్బ తినడం ఖాయం. అంతేకాక, తమ స్వార్థం కోసం ప్రభుత్వ బలాన్ని ఉపయోగించుకొనే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం తమకు చెల్లించే వేతనంతో, తమ పూర్తి సమయాన్ని ప్రభుత్వానికే కేటాయించాలనేది తప్పనిసరి.
- సామజిక జవాబుదారీతనం
మనం ముందు చర్చించుకున్నట్టు, ప్రభుతం చేసే అన్ని కార్యక్రమాలకి, ఖర్చులకు ప్రజలకు నివేదిక అందించాలి. కాబట్టి ఉద్యోగులు చేసే ప్రతీ పని పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించి, ఫలితాలను లెక్కించాలి. దేశానికీ సేవ చేస్తూ, ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. అలాంటపుడు, తమ సొంత లాభాల కోసం వ్యాపారం నడిపించుకొనే వారు పై విధులను సక్రమంగా నడిపించే అవకాశాలు తక్కువ కాబట్టి వ్యాపారాలకు అనుమతి ఉండదు.
- అవినీతి
నైతిక విలువలను, న్యాయాన్ని విడిచి పనిచేసే ఉద్యోగుల ప్రభుత్వ పతనానికి కారణం కాగలరు. వ్యాపార అవకాశాలను ఎరగా చూపించి, ప్రభుత్వ ఉద్యోగులను భ్రమపెట్టె అవకాశాలు ఎంతైనా ఉంటాయి. తద్వారా తీవ్రమైన పరిణామాలు ఎదురు కావచ్చు.
- ప్రయోజనాలకు సంబంధించిన సంఘర్షణ
చట్ట నిర్ణేతలు చేసే చట్టాలను ప్రజలు అనుసరించాలనేది కట్టడి. చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఆ చట్టాల నిర్మాణంలో పాలుపంచుకుంటారు. అంతేకాక, ఆఫీసర్ల స్థానంలో ఉండే వీరు సామాన్య ప్రజలు ఎలా నడవాలని విషయాలను నిర్ణయిస్తుంటారు. అదే సమయంలో, సమాజంలో భాగమైన వారిపై, ఆ నిర్ణయాలు ప్రభావం చూపుతాయి కూడా. అలాంటప్పుడు తమ పూర్తి సామర్ధ్యంతో, నిస్వార్థమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది.
కాబట్టి, సొంత వ్యాపారాన్ని పెట్టుకోవాలనే ప్రభుత్వ ఉద్యోగులు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే వ్యాపారాలను స్థాపించుకోవాలి.
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నిర్వహణ బాధ్యతలు)నిభందనలు, 1964
నిషేధించబడిన పనులు
CCS నిభందనలు, 1964 ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు, ముందస్తు అనుమతి లేనిదే క్రింది కార్యకలాపాలలో పాలుపంచుకోవడం చట్టరిత్యా నేరం. అవేమిటంటే,
- ఏదైనా వ్యాపారం లేదా వ్యాపార సంబంధిత లావాదేవీల్లో పాలుపొందడం
- వేరొక ఉద్యోగానికి పొందడం, లేదా బాధ్యతలు తీసుకోవడానికి చర్చించడం
- ఎన్నుకోబడిన ప్రజా సేవకులకు వత్తాసు పలకడం, లేదా రాజకీయాలలో పాలుపొందడం
- ఉద్యోగి బంధువుల చేత నడిపించబడే వ్యాపారానికి అండగా నిలుస్తూ, వ్యక్తిగత లాభాన్ని పొందడం
- తన వృత్తి రీత్యా తప్ప వేరే ఏ కారణంగా కూడా కంపెనీస్ చట్టం 2013 ప్రకారం, అదనపు ఆదాయం కోసం ఏదైనా బ్యాంక్ లేదా కంపెనీని రిజిస్టర్ చేయడం, ప్రమోషన్ చేయడం లేదా నిర్వహించడం
- ఏదైనా ప్రైవేట్ ఏజెన్సీ, స్పాన్సర్ చేస్తూ, నిర్మించే మీడియా ప్రోగ్రాంలో, ప్రభుత్వ అనుమతి లేనిదే పాల్గొనడం, వారితో కలిసి పని చేయడం
- ప్రభుత్వ ఆదేశం లేనిదే, తన వృత్తి రీత్యా చేసిన కార్యకలాపాలకు నగదు స్వీకరించడం,
- తనకు ప్రభుత్వం నుండి కేటాయించబడిన కర్తవ్యాలను, మరొకరికి అప్పజెప్పి వారితో చేయించడం లాంటిది.
అనుమతించబడే విషయాలు
ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఈ క్రింది పనులు చేయవచ్చు
- సామజిక సంక్షేమ పనులలో పాల్గొనడం,
- అప్పుడప్పుడు సాహిత్య, కళాత్మక మరియు శాస్త్రీయ కార్యకలాపాలలో పాలుపొందడం,
- ఔత్సాహికంగా క్రీడల పోటీలలో పాల్గొనడం,
- సాహిత్య, శాస్త్రీయ, సాంకేతిక మరియు సాంఘిక అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేయబడే క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం 1860 ప్రకారం రిజిస్ట్రేషన్, ప్రమోషన్, మ్యానేజ్మెంట్ చేయడం,
- కో-ఆపరేటివ్ సొసైటీస్ చట్టం 1912 ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగుల శ్రేయస్సు కోసం కో-ఆపరేటివ్ సొసైటీని రిజిస్టర్ చేయడం, ప్రొమోషన్ చేయడం అలాగే మ్యానేజ్ చేయడం వంటివి,
కానీ ఎన్నుకోబడిన పదవిలో ఉన్న పక్షాన లేక ప్రభుత్వంచే ఉత్తర్వులు పొందినా, కారణాలను సమర్పించి నెల రోజులలో పై వాటి నుండి తొలగిపోవాల్సి ఉంటుంది.
కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాతో నుండి వచ్చే కొన్ని సంప్రదింపులు/అవకాశాలు
- ఆఫీస్ పనివేళలు కాకుండా, మిగతా సమయంలో విద్యా సంస్థలలో జాయిన్ అవ్వవచ్చు - విద్యాసంస్థలలో చేరి ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వం తన ఉద్యోగులపై ఎటువంటి ఆంక్షలు పెట్టదు. కాకపోతే, పనివేళల్లో హాజరు కావడానికి ఎటువంటి ఆటంకం ఉండకూడదు అలాగే పనితనంలో లోపం ఎదురవ్వకూడదు. అలాగే, అనుమతిని ఇవ్వడానికి ముందు, కోర్స్ ఎన్ని నెలలు ఉంటుందనే విషయాన్నీ పరిగణించిన తరువాతే అనుమతి ఇవ్వబడుతుంది.
- శ్రమదాన కార్యక్రమాలలో పాల్గొనడం - ప్రభుత్వం మరియు భారత్ సేవక్ సమాజం వారు ఏర్పాటు చేసే శ్రమదాన కార్యక్రమాలలో పాల్గొనడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. అదే సమయంలో, ఈ కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వకూడదు.
- చర్చలలో పాల్గొనడం - ప్రభుత్వ ఉద్యోగులు సాహిత్య, సాంకేతిక, మరియు కళలకు సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనడం పై, అలాగే గౌరవ వేతనం పొందడానికి ఎటువంటి ఆంక్షలు ఉండవు. కాకపోతే, ప్రభుత్వ అనుమతి అవసరముండే కార్యక్రమాలలో గౌరవ వేతనం పొందిన పక్షాన, రసీదు తప్పనిసరిగా ఉండాలి.
- గుర్తించబడిన విశ్వవిద్యాలయాల్లో పార్ట్-టైమ్ పరీక్షల ఇన్విజిలేటర్ బాధ్యతలు తీసుకోవచ్చు - కానీ అప్పుడప్పుడు మాత్రమే చేసే పని అయి ఉండాలి.
- ఆఫీసు పనివేళలు ముగిసిన తరువాత పార్ట్-టైమ్ ఉద్యోగం - పనితనంలో లోపం ఏర్పడే అవకాశం ఉన్నందువల్ల, ప్రభుత్వ ఉద్యోగులు పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేయడం నిషేధం. కానీ, కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే, తప్పని సరి పరిస్థితుల కారణంగా అయితే, అనుమతి పొంది పని చేయడానికి అవకాశం ఉంటుంది.
- సివిల్ డిఫెన్స్ సర్వీసెస్ లో జాయిన్ అవ్వడం - మన సమాజంలో సివిల్ డిఫెన్సె సేవలు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి స్వయంగా వాలంటీర్ చేయడానికి ప్రభుత్వం తన ఉద్యోగులకు అనుమతిని అలాగే అవసరమయ్యే వనరులను ఇస్తుంది. కానీ ముఖ్యమైన విధులు నిర్వహించే ఆఫీసర్లకు అనుమతి ఉండదు.
- ఖాళీ సమయంలో మెడికల్ ప్రాక్టీసు - స్వచ్చందంగా, లాభార్జన కోసం కానీ పక్షాన, తమకు దొరికిన ఖాళీ సమయాలలో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు వైద్య సేవలను అందించడానికి అనుమతి ఉంటుంది. కానీ వైద్య సేవలు అందించడానికి కచ్చితంగా తగిన అర్హత ఉండాలి.
సారాంశం
పైన చర్చించబడిన విషయాల ఆధారంగా, ప్రభుత్వ నియమాలను, నిబంధనలను అనుసరించి వాటికీ అనుగుణంగా నడుచుకోవడం ప్రభుత్వ ఉద్యోగులకు చాలా ముఖ్యం అని చెప్పగలము. చట్ట వ్యతిరేకంగా, ప్రభుత్వ కార్యకలాపాలకు అంతరాయం కలిగించే పనులు చేసే ఉద్యోగులు, తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి, వేరొక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం కంటే ముఖ్యమనిపిస్తే, రాజీనామా చేసి చేరడమే ఉత్తమం.
దీనిని కూడా చదవండి: మీ సొంత ఎలక్ట్రికల్ షాపును ఎలా తెరవాలో తెలుసుకుందాం!
తరచుగా అడగబడే కొన్ని ప్రశ్నలు
ప్రభుత్వ ఉద్యోగులు వ్యవసాయం చేయవచ్చా?
చేయవచ్చు. సొంత భూమి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు వ్యవసాయం చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ, తన విధులకు ఎటువంటి ఆటంకం కలుగకుండా చూసుకోవాలి.
ప్రభుత్వ ఉద్యోగులు ఇతర సంస్థలలో డైరెక్టర్లుగా లేదా భాగస్వాములుగా ఉండవచ్చా?
ప్రభుత్వ ఉద్యోగులు వేరొక ప్రైవేట్ సంస్థలో డైరెక్టర్ గా లేక భాగస్వామిగా ఉండవచ్చు. కానీ, సంస్థయొక్క రోజువారీ కార్యకలాపాలలో పాలుపంచుకోకూడదు. కాబట్టి స్లీపింగ్ పార్టనర్ గా, లేక కార్యనిర్వాహక రహిత డైరెక్టర్ గా ఉండవచ్చు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలలో పాల్గొనవచ్చా?
CCS (ప్రవర్తన నియమాలు) 1964 ప్రకారం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి శాసనసభ మరియు స్థానిక ఎన్నికలలో పాల్గొనడం నిషేధించబడినది.
నియమాలకు వ్యతిరేకంగా నిలిచిన ఉద్యోగులపట్ల ఎటువంటి చర్యలు తీసుకొనబడతాయి?
ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని వేళలా తమ నియమాలకు కట్టుబడి ఉండాలి. అలా ఉందని పక్షాన, తమ అధికారుల వద్దకు పిలిపించబడి, తమ చర్యలకు తగిన సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. ఆ తరువాత చేయబడే పరిశీలనలో ఉద్యోగు దోషిగా తేల్చబడితే, విధుల నుండి తొలగించబడడమే కాకుండా, పదవి విరమణ ప్రయోజనాలను కోల్పోతారు.
ప్రభుత్వ ఉద్యోగులు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి అనుమతి ఉన్నదా?
ప్రభుత్వ ఉద్యోగులు స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడానికి ఎటువంటి ఆంక్షలు లేవు. వీరు ఐపిఓలలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు కాని తమ ఉద్యోగ స్థాయి గౌరవ విషయం కారణంగా స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడ్ లేదా ఊహాజనిత కార్యకలాపాలలో పాల్గొనకూడదు.