డిజిటల్ పేమెంట్లు చేయడానికి UPI యాప్‌లు మరియు ఇ-వాలెట్లు ఉపయోగిస్తున్న సంఖ్య భారీగా పెరుగుతున్నందున దేశంలో ఆన్లైన్ పేమెంట్ మోసాలు సర్వా సాధారణంగా జరుగుతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NCPI) విశ్లేషించిన డేటా ప్రకారం, ఫిబ్రవరి 2022లో మొత్తం UPI లావాదేవీల సంఖ్య 4.53 బిలియన్లకు పైగా ఉంది. దేశంలో లావాదేవీలు చేయడానికి ఎక్కువ మంది వ్యక్తులు ఆన్లైన్ చెల్లింపు యాప్‌లు మరియు ఇ-వాలెట్లు వాడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఇప్పుడు e-UPI మోసాల బారిన పడుతున్నారు. నేరస్థులు సోషల్ ఇంజినీరింగ్ ట్రిక్కులను ఉపయోగించడంలో ఆరి తేరి ఉన్నారు. UPI వాలెట్ ద్వారా చెల్లింపు అభ్యర్థనలను పంపించి వినియోగదారులను మోసం చేస్తున్నారు. చాలా వాణిజ్య బ్యాంకులు, లోన్ ఇచ్చే పార్టనర్లు మరియు UPI యాప్ డెవలప్మెంట్ కమ్యూనిటీలు ఈ స్కామ్‌ల గురించి వినియోగదారులను హెచ్చరించి, అందరికీ అవగాహన కల్పించడానికి సైబర్ అవగాహన ప్రచారాలను నిర్వహిస్తాయి. అయినప్పటికీ, కొన్నిసార్లు తగ్గిన జాగ్రత్తలు పాటించని వాళ్ళు మరియు కొత్త వినియోగదారులు అనుకోకుండా స్కామర్లకు పేమెంట్ చేసి డబ్బులు నష్టపోతుంటారు.
మీకు తెలుసా? భారతదేశంలో ప్రతి నెలా 80,000 కంటే ఎక్కువ UPI మోసాలు నమోదవుతున్నాయి.
e-UPI యాప్ మోసం అంటే ఏమిటి?
కరోనా మహమ్మారి అనేక వ్యాపారాలను డిజిటల్ రూట్‌కి మారేలా చేసింది. ఎక్కువ మంది కస్టమర్లు ఆన్లైన్ పేమెంట్లు చేస్తున్నారు.. మొబైల్ ఫోన్ల ద్వారా నగదు రహిత చెల్లింపులు చేయడానికి UPI యాప్‌లు ఒక చక్కటి సదుపాయం. e-UPI యాప్‌లు బ్యాంక్ అకౌంట్లకు కనెక్ట్ చేయబడతాయి, వాటి ద్వారా సెకన్లలో రియల్-టైమ్ పేమెంట్లు చేయవచ్చు. ఈ యాప్‌లకు సంబంధించిన అన్ని స్కామ్‌లను e-UPI మోసాలుగా పరిగణించవచ్చు. కానీ హర్షించదగ్గ విషయం ఏమిటంటే ఈ యాప్‌లన్నీ అంతర్నిర్మిత భద్రత మరియు భద్రతా లక్షణాలతో రూపొందించబడ్డాయి. ఏదేమైనప్పటికీ, ఏ సాంకేతికత 100% పటిష్ఠంగా ఉండదు. సున్నితమైన డేటాను బయటి వ్యక్తులకు షేర్ చేయకుండా జాగ్రత్తపడడం అంతిమంగా వినియోగదారుల మీదే ఆధారపడి ఉంది.
భారతదేశంలో ఆన్లైన్ పేమెంట్ మోసాలను ఎలా నివారించాలి?
భారతదేశంలో డిజిటల్ పేమెంట్ మోసాలను అరికట్టడానికి ఉత్తమ మార్గం ఆన్లైన్లో ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ స్కామ్‌ల గురించి తెలుసుకోవడం. UPI యాప్‌ల వినియోగం పెరగడంతో ఆన్లైన్ పేమెంట్ మోసాలు మరింత అధునాతనంగా మారుతున్నాయి, వాటిని కనిపెట్టడం కష్టమవుతుంది. మొదటి చూపులో, పేమెంట్ అభ్యర్థనలు సాధారణమైనవిగా అనిపించవచ్చు. స్కామర్లు అధికారిక సంస్థలు లేదా వ్యక్తుల వలె అనుమానం రాకుండా నటించి, వినియోగదారులను వారి మాయలో పడేస్తున్నారు. సున్నితమైన సమాచారాన్ని పొందడానికి స్కామర్లు వాడే కొన్ని సాధారణ మార్గాలతో పాటు వాటి నుండి సురక్షితంగా ఉండేందుకు మీరు తీసుకోగల స్టెప్లు క్రింద ఉన్నాయి:
ఫిషింగ్ స్కామ్‌లు
ఫిషింగ్ స్కామ్‌లు అంటే దాడి చేసేవారు నకిలీ వెబ్సైట్లను సృష్టించి, వాటిని అధికారికంగా కనిపించేలా చేస్తారు. స్కామర్లు ఈ సైట్లకు పేమెంట్లింక్లను టెక్స్ట్ లేదా SMS ద్వారా పంపుతారు. వినియోగదారులు వాటిపై క్లిక్ చేసి స్కామర్ల ట్రాప్‌లో పడతారు. ఈ పేమెంట్ లింక్‌లు వారి UPI యాప్‌కు అభ్యర్థనలను పంపిస్తాయి, వినియోగదారులు వాటిని ఆమోదించినప్పుడు వారి ఇ-వాలెట్ల నుండి డబ్బు డెబిట్ చేయబడుతుంది.
UPI పిన్ లేదా OTPని చేయడం వల్ల జరిగే స్కామ్‌లు
చాలా మంది మోసగాళ్లు కస్టమర్లకు కాల్ చేసి, యాప్ సపోర్ట్‌ని పొందడానికి వారి ఫోన్లకు పంపిన UPI OTPని షేర్ చేయమని అడుగుతారు. కొన్ని సందర్భాల్లో స్కామర్ బ్యాంక్ ప్రతినిధిగా నటించి, కస్టమర్‌ని లావాదేవీ చరిత్రను సమీక్షించమని అభ్యర్థించవచ్చు. ఈ ప్రాసెస్‌లో వారు UPI పిన్ని రీసెట్ చేయమని, లేదా ప్రస్తుత పిన్ ఏమిటని అడిగి వినియోగదారులను మోసగించవచ్చు. స్కామర్లు చాలా స్మార్ట్‌గా ఉంటూ ఫోన్లో సున్నితమైన సమాచారాన్ని అందించడానికి వినియోగదారులను ఒప్పించే నైపుణ్యాలు కలిగి ఉంటారని గుర్తుంచుకోండి. బ్యాంకులు లేదా UPI యాప్ సపోర్టు సిబ్బంది సున్నితమైన వివరాలను అడిగేందుకు కస్టమర్లకు ఎప్పుడూ ఫోన్ కాల్లు చేయరు. భారతదేశంలో ఇ-వాలెట్లను నిర్వహిస్తున్న కంపెనీల తరపున కాల్ చేస్తున్నామని క్లెయిమ్ చేసే వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్‌లను వెంటనే కట్ చేయడం మంచిది.
QR కోడ్ స్కానింగ్
మోసగాళ్లు వినియోగదారులకు QR కోడ్ పంపించి చెక్అవుట్ సమయంలో స్కాన్ చేయమని అడుగుతారు. స్కాన్ చేయడానికి వినియోగదారు UPI యాప్‌ని ఉపయోగించినప్పుడు, అది ఆటోమేటిక్‌గా లావాదేవీని స్టార్ట్ చేస్తుంది. అయితే, సాధారణంగా UPI యాప్‌లు QR కోడ్లను సృష్టించడానికి మరియు పంపడానికి వ్యాపారులను అనుమతించవు. మీకు అలాంటి అభ్యర్థన వస్తే, దానిని పట్టించుకోకండి.
తప్పుదారి పట్టించే UPI పేర్లు
చాలా మంది స్కామర్లు తమ UPI IDలు కన్విన్సింగ్‌గా కనిపించేలా చేయడానికి వారి హ్యాండిల్స్ చివర 'UPI' లేదా 'BHIM' పదాలను ఉపయోగిస్తారు. @disputesNCPI లేదా @paymentsBHIM_serviceతో ముగిసే చిరునామాలను చూసే వినియోగదారులు ఇవి ప్రామాణికమైనవని నమ్ముతారు. స్కామర్లు నకిలీ UPI IDలను సృష్టించి వినియోగదారులను ఈ అకౌంట్లకు చెల్లించేలా చేసి, తద్వారా వినియోగదారుల నుండి సున్నితమైన సమాచారాన్ని పొందుతారు.
సోషల్ మీడియా UPI మోసాలు
UPI వాలెట్లలో ఎక్కువగా జరిగే మరొక మోసం సోషల్ మీడియా UPI స్కామ్‌లు. వినియోగదారులను తమ ఫోన్లలో TeamViewer వంటి స్క్రీన్-షేరింగ్ యాప్‌ను ఇన్స్టాల్ చేయమని చెప్పి వెరిఫికేషన్ కోసం వెబ్‌క్యామ్ ముందు తమ క్రెడిట్/డెబిట్ కార్డ్‌ని పట్టుకోమని అడుగుతారు. ఆ తర్వాత, వెరిఫికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయడానికి స్కామర్ వినియోగదారును UPI OTPని షేర్ చేయమని అడుగుతాడు. వినియోగదారులు వివరాలను షేర్ తర్వాత వారి అకౌంట్ల నుండి డబ్బు విత్‌డ్రా చేయబడుతుంది.
SMS స్కామ్‌లు
మీ UPI లాగిన్ వివరాలను అప్డేట్ చేయమని లేదా యాప్‌ను అప్డేట్ చేయమని కోరుతూ ఒక లింక్‌తో పాటు మీ ఫోన్‌కి ఒక టెక్స్ట్ రావచ్చు. SMS టెక్స్ట్లలోని హానికరమైన లింక్‌లపై క్లిక్ చేయడం వలన మీ ఫోన్‌కు మాల్వేర్ సోకవచ్చు లేదా వైరస్లు డౌన్లోడ్ అవ్వవచ్చు. మీరు లింక్‌ని ఉపయోగించి వివరాలను నమోదు చేసినప్పుడు దాడి చేసే వ్యక్తులు మీ ఖాతాకు అనధికారిక ఆర్ధిక యాక్సెస్ పొందుతారు. అంతే కాకుండా, మీరు లాక్ చేయబడే ప్రమాదం కూడా ఉంది. ఈ టెక్స్ట్‌లను ఓపెన్ చేయకుండా ఉండటమే ఉత్తమ పరిష్కారం. మీ UPI యాప్‌ని ఎల్లప్పుడూ అప్డేట్ చేయండి. అలాగే, డెవలపర్లు ప్యాచ్‌లను విడుదల చేసే వరకు వేచి ఉండండి. సందేహాస్పదంగా ఉన్నప్పుడు, అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి మరియు లేటెస్ట్ వార్తలను తెలుసుకోండి.
చేయవలసినవి మరియు చేయకూడనివి:
- మీ క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్, UPI OTP, PIN మొదలైన వ్యక్తిగత వివరాలు ఎవరికీ షేర్ చేయవద్దు.
- మీకు ఇమెయిల్ ద్వారా పంపబడిన అనుమానాస్పద UPI చెల్లింపు లింక్‌లను ఓపెన్ చేయవద్దు. సబ్జెక్ట్ లైన్ లేదా పంపిన వ్యక్తి మీకు తెలియకపోతే, వాటికి రిప్లై ఇవ్వవద్దు. యాప్ డెవలపర్లు మరియు బ్యాంకుల నుండి నేరుగా వచ్చే అధికారిక ఇమెయిల్లకు మాత్రమే రిప్లై ఇవ్వండి.
- ఎవరైనా మీకు డబ్బు పంపాలనుకున్నప్పుడు మీరు మీ UPI పిన్ను షేర్ చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాదని మరియు మీ UPI IDకి డిజిటల్ పేమెంట్లు పొందడానికి PIN అవసరం లేదని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం.
- మీ UPIకి సంబంధించి సోషల్ మీడియా వెబ్సైట్లు మరియు ఇంటర్నెట్ ఫోరమ్‌లలో లిస్ట్ చేయబడిన కస్టమర్ సపోర్ట్ నంబర్లను ఉపయోగించవద్దు. ఎల్లప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి “మమ్మల్ని సంప్రదించండి” లేదా “కాంటాక్ట్ అజ్” పేజీలను చూడండి.
- వెరిఫై చేయబడని కాలర్లు లేదా లొకేషన్ల నుండి వచ్చే ఫోన్ కాల్‌లను లిఫ్ట్ చేయకండి. ఎవరైనా బ్యాంక్ ప్రతినిధి అని క్లెయిమ్ చేస్తే నమ్మకండి. మీకు స్కామర్ నుండి కాల్ వస్తే, వారి ఫోన్ నంబర్‌ను కాగితంపై వ్రాసి, సమీపంలోని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి.
- మీరు స్కామ్‌కు గురైనట్లయితే, మీ UPI లావాదేవీ IDలు, వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ నంబర్లను సేకరించి, ఫిర్యాదు చేయడానికి మీ సమీప సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో FIR ఫైల్ చేసి మీ లావాదేవీని రివర్స్ చేయడానికి వెంటనే బ్యాంక్ అధికారులను సంప్రదించండి. స్కామర్ మిమ్మల్ని ఫోన్ ద్వారా సంప్రదించినట్లయితే మీ ఫోన్ కాల్‌లను రికార్డ్ చేయండి, తద్వారా మీ దగ్గర స్కామ్‌కి రుజువు ఉంటుంది.
- మీ లావాదేవీ చరిత్ర యొక్క స్క్రీన్‌షాట్‌ను ఉంచండి, మీరు స్కామ్‌కు గురయినప్పుడు దాన్ని బ్యాంకుకు ఫార్వార్డ్ చేయవచ్చు. మీ కాంటాక్ట్ మరియు UPI సమాచారాన్ని సోషల్ మీడియా లేదా వెబ్సైట్లలో ఎప్పుడూ పోస్ట్ చేయవద్దు, మోసగాళ్లు మీ పోస్ట్‌లను చూసి మిమ్మల్ని సంప్రదదించే అవకాశం ఉంది,
- UPI యాప్ నుండి మీ ఫోన్లో స్పామ్ హెచ్చరికను పొందినట్లయితే, మీరు దాన్ని పట్టించుకోకుండా వదిలేయవద్దు. యాప్ డెవలపర్లు ఈ నోటిఫికేషన్ హెచ్చరికల ద్వారా వినియోగదారులకు తెలియజేయడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి మీరు తప్పకుండ ఏమి జరుగుతుందో చదివి తెలుసుకోండి.
ముగింపు
UPI యాప్‌లు ఎలా ఉపయోగించబడుతున్నాయి, మోసగాళ్లు సాధారణంగా డబ్బును దొంగిలించడానికి ఉపయోగించే మార్గాల గురించి ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి, మీరు వాటిని అరికట్టడానికి చర్యలు తీసుకోవచ్చు. అపరిచితులతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని వ్యక్తులకు మీ ఆర్థిక వివరాలను ఆన్లైన్లో షేర్ చేయవద్దు. సందేహాస్పదంగా ఉన్నప్పుడు, యాప్‌లో జరుగుతున్న లేటెస్ట్ సైబర్ క్రైమ్ ట్రెండ్ల గురించి తెలుసుకోవడానికి యాప్ డెవలపర్ వెబ్‌సైట్‌కు వెళ్ళండి. లేటెస్ట్ అప్డేట్లు, న్యూస్ బ్లాగులు మరియు సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు (MSMEలు), వ్యాపార చిట్కాలు, ఆదాయపు పన్ను, GSTకి సంబంధించిన కథనాల, జీతం మరియు అకౌంటింగ్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి Khatabookని అనుసరించండి.
దయచేసి మీ కార్డ్ జారీ చేసే బ్యాంకుకు కేసును రిపోర్ట్ చేయండి లేదా సమీపంలో ఉన్న సైబర్ క్రైమ్‌ను సంప్రదించండి. కేసును రిపోర్ట్ చేయడానికి cybercell@khatabook.comకి ఇమెయిల్ పంపండి.
గమనిక: మీరు SMS లేదా ఇతర ఛానెల్‌ల ద్వారా స్వీకరించే OTPలు, PINలు లేదా ఇతర కోడ్లను ఎప్పుడూ షేర్ చేయవద్దు. పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లో మీ అకౌంట్ నంబర్ లేదా క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ వివరాలను ఎప్పుడూ షేర్ చేయవద్దు.