written by Abhishek | June 12, 2021

మీ సొంత ఎలక్ట్రికల్ షాపును ఎలా తెరవాలో తెలుసుకుందాం!

×

Table of Content


వ్యాపారం చేసే ఎవరైనా, తమకు తామే యజమానిగా వ్యవహరించుకుంటూ తమ వ్యాపారాన్ని నడిపించుకోవాలి. మీకు నచ్చిన సమయాల్లో పనిచేసుకుంటూ, మీ వ్యక్తిగత, వ్యాపార జీవితాలలో బ్యాలన్సు మైంటైన్ చేయడం మీరు బిజినెస్ నడిపించే వారైతేనే కుదురుతుంది. అదే సమయంలో, మీరు ఉదయం నిద్ర లేచిన సమయం నుండి, మళ్ళీ రాత్రి పడుకునే వరకు, మనం ఎన్నో ఎలక్ట్రికల్ పరికరాలను ఉపయోగించుకుంటుంటాం. కాబట్టి, ఇలా నిరంతరం డిమాండ్ ఉండే మార్కెట్‌లో, వ్యాపారం మొదలుపెడితే, కచ్చితంగా లాభాలను పొందగలరు.

ఒక వ్యాపారాన్ని నడిపించడం, దానర్థం, మీరు మొదలుపెట్టబోయే ఎలెక్ట్రికల్ షాప్‌ని లాభాల బాటలో నడిపించడం మీరు మార్కెట్‌ని ఎంత బాగా అర్ధం చేసుకున్నారు, డిమాండ్‌కి తగ్గ సప్లై ఎలా చేస్తున్నారు అలాగే, మీరు వ్యాపారం నడుపుతున్న ఏరియాలో ఏ విధంగా లోటుపాట్లను గుర్తించి, దానికి తగ్గట్టుగా వ్యాపారాన్ని నడిపిస్తున్నారనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి బాగా కష్టపడుతూ, ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. వ్యాపారాన్ని తెరవబోయే ముందు, అవసరమయ్యే అన్ని లీగల్ పర్మిట్‌లను పొందడం మరచిపోకండి.

వ్యాపారంలో ఇతర వస్తువులకు డిమాండ్ ఎలా ఉన్నా, ఎలెక్ట్రికల్ వస్తువుల విషయంలో మాత్రం ఆ డిమాండ్ ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. ఎలెక్ట్రికల్ గూడ్స్‌కి ఉన్న భారీ డిమాండ్ కారణంగా, మీ సామర్ధ్యం అనుకూలిస్తే, కచ్చితంగా ఎలెక్ట్రికల్ షాపును తెరవండి. వ్యాపార విధానాన్ని స్థాపించగలిగి, సరైన పరిచయాల సహాయాన్ని పొందగలిగితే, సగం పని పూర్తయినట్టే!

ఎలెక్ట్రికల్ షాపును తెరవడం ఎలా?

ఒక వ్యాపారాన్ని స్థాపించడం అంటే చాలా రిస్కులతో కూడిన పని. ఏ పని చేసినా, ఎలాంటి ప్రణాళిక ఆలోచించినా, ఒక వ్యాపార దృక్కోణంలో అలోచించి మాత్రమే అడుగులు వేయాలి. వ్యాపారాన్ని మ్యానేజ్ చేయగల సామర్ధ్యం ఉంటే మాత్రమే సరిపోదు. ఏ అడుగు వేయడానికైనా ముందు పక్కా ప్రణాళిక, అలాగే ఆచరణ యోగ్యమైన ఆలోచనలు చేస్తుండాలి. అప్పుడే వ్యాపారం నడిపించే సమయంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలుగుతారు.

కాబట్టి మీకోసం, మీ సొంత ఎలెక్ట్రికల్ షాపును తెరవడానికి ఏమేమి చేయాలని 9 అడుగుల్లో వివరించాము. అవేంటో చూద్దాం రండి!

  • మొదటి అడుగు : సరైన లొకేషన్‌లో వ్యాపారాన్ని తెరవాలి.
  • రెండవ అడుగు : వ్యాపారానికి మంచి పేరు పెట్టాలి
  • మూడవ అడుగు : లైసెన్సులు మరియు ఇతర అనుమతులు పొందండి
  • నాలుగవ అడుగు : ఇన్సూరెన్సు తీసుకోండి
  • అయిదవ అడుగు : ఎటువంటి సర్వీసులను ఇవ్వాలో నిర్ణయించుకోండి
  • ఆరవ అడుగు : మీ బృందాన్ని ఏర్పరచుకోండి (లేకపోయినా పర్లేదు)
  • ఏడవ అడుగు : అవసరమైన వస్తువులను కొనండి
  • ఎనిమిదవ అడుగు : డిజిటల్ సామర్ధ్యం 
  • తొమ్మిదవ అడుగు : మార్కెటింగ్ చేయండి

మొదటి అడుగు : సరైన లొకేషన్‌లో వ్యాపారాన్ని తెరవాలి

మీ వ్యాపారాన్ని తెరవడానికి అవసరమయ్యే పెట్టుబడి సమకూరిన తర్వాత, మీరు ఇప్పుడు వ్యాపారం ఎక్కడ చేయాలనే విషయాన్ని అలోచించి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారాన్ని మీరు ఎక్కడ తెరుస్తారనే విషయం అది ఎంత వరకు విజయవంతం అవుతుంది లేదా ఎంత త్వరగా మూతపడుతుందనే విషయాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి లొకేషన్‌ను ఎంచుకొనే ముందు మీరు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది:

  • మీ చుట్టుప్పక్కల వేరే ఏ ఎలెక్ట్రికల్ షాపులు ఉండకూడదు.
  • ఒకవేళ ఎలెక్ట్రికల్ షాపు ఉన్నా కూడా, అక్కడికి వెళ్లే కస్టమర్లకు అక్కడి ఉత్పత్తులు లేదా సర్వీసు సహించడం లేదని నిర్ధారించుకోండి. 
  • ఒకప్పుడు ఎలెక్ట్రికల్ షాపు ఉన్నా కూడా, అది మూతపడి ఉండాలి.
  • ఒకటి కాదు గాని, రెండు వేరే ఎలెక్ట్రికల్ షాపులు ఉన్నాయి అనుకోండి, కానీ అక్కడ మంచి పేరు తెచ్చుకున్న షాపు మూతపడి మరొక లొకేషన్‌కు వెళ్ళిపోతే, అప్పుడు దానికి బదులుగా మీరు మీ షాపును తెరవవచ్చు.
  • అది ఎలెక్ట్రికల్ షాపుల మార్కెట్ అయి ఉండాలి, అక్కడ మీకు కేవలం ఒక పోటీ దారు కాకుండా, మీతో కలిసి పనిచేసే చాలా ఎలెక్ట్రికల్ షాపులు ఉన్న చోట ఉండాలి.

మీరు ఎంచుకోబోయే లొకేషన్‌లో ఈ పరిస్థితులు ఉంటే, తప్పక వ్యాపారాన్ని తెరవండి.

రెండవ అడుగు: వ్యాపారానికి మంచి పేరు పెట్టాలి 

మీరు మీ వ్యాపారానికి పెట్టబోయే పేరు, సింపుల్‌గా, గుర్తుంచుకోవడానికి సులభంగా ఉండాలి. కాబట్టి వ్యాపారానికి పేరు పెట్టబోయే ముందు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోండి:

  • కస్టమర్లకు ఈజీగా గుర్తుండిపోయే పేరును ఎంచుకోండి
  • అప్పుడే అవసరం ఏర్పడిన వెంటనే ముందు మీ షాపు పేరు గుర్తుకువస్తుంది.
  • మీరు పెట్టబోయే పేరు వినగానే నమ్మకం ఉంచగల పేరై ఉండాలి.
  • అలాగే, మీరు పెట్టబోయే పేరు, అప్పటికే వేరే వ్యాపారం ఉప్పయోగించుకొని, చెడ్డ పేరును పొందుకొని ఉండనీదై ఉండాలి.

అంతే కాక, మీ వ్యాపారానికి పెట్టబోయే పేరు ఒక మతానికో, నమ్మకానిలో, రాజకీయ పార్టీకో సంబంధించినదై ఉండాలి. వీలైనంత వరకు సమాజంలో ఉన్న ఏ బలమైన వర్గానికి సంభందించినది కాకుండా చూసుకోండి. అప్పుడే అన్ని వర్గాల ప్రజలు షాపుకు వస్తారు. 

మూడవ అడుగు: లైసెన్సులు మరియు ఇతర అనుమతులు పొందండి

ఏ వ్యాపారానికైనా అవసరమైన అనుమతులు, లైసెన్సులు తీసుకోవడం చాలా ముఖ్యం. రాష్ట్రాలను బట్టి కొన్ని విషయాలు కాస్త మారినా, మెజారిటీ అనుమతులు ఒకేలా ఉంటాయి. మీరు వేర్వేరు షాప్స్ మరియు వ్యాపారాల లైసెన్సులు, ట్రేడ్ లైసెన్సులు, లేబర్ లైసెన్సులు లాంటి వాటిని తప్పక తీసుకోవాలి. ఇలాంటి ప్రక్రియలలో మీకు సహాయపడడానికి చాలా వెబ్సైట్లు వెలిసాయి కాబట్టి వాటి సహాయంతో మీరు మీ ఎలెక్ట్రికల్ వ్యాపారానికి కావాల్సిన అనుమతులను సులభంగా పొందవచ్చు.

నాలుగవ అడుగు : ఇన్సూరెన్సు తీసుకోండి 

ఒకసారి లైసెన్సులు పొందిన తరువాత, మీరు మీ వ్యాపారానికి ఇన్సూరెన్సు చేయించాలి. వీలైనన్ని ఎక్కువ ఇన్సూరెన్సు కంపెనీలను సంప్రదించి, ఏ పాలసీ మీకు అనుకూలంగా ఉంటుందో చూసుకొని డిసైడ్ అవ్వండి. కచ్చితంగా ఇన్సూరెన్సులన్నిటిని ఒకదానితో ఒకటి పోల్చి చుసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి.

ఇన్సూరెన్సు పాలసీలలో సాధారణంగా కావాలని వారు క్లిష్టమైన పదజాలంతో కస్టమర్లకు అర్ధం కానీ లొసుగులను పెడుతుంటారు కాబట్టి, మరెవరి సహాయాన్నైనా తీసుకొని అప్పడు మాత్రమే పాలసీ తీసుకోవాలా వద్దో నిర్ణయించుకోండి. కానీ ఒక పాలసీ అంటూ తప్పక ఉండాలి. సమయానికి ఇన్సూరెన్సు ప్రీమియంలు పట్టడం మర్చిపోకండి.

అయిదవ అడుగు: ఎటువంటి సర్వీసులను ఇవ్వాలో నిర్ణయించుకోండి

ఇది చాలా ముఖ్యమైన అడుగు. మీరు కస్టమర్లకు ఏవిధమైన సర్వీసులను ఎలా నిర్ణయించుకుంటారు? చెప్తాను చూడండి. బేసిక్‌గా మూడు విధాలైన సర్వీసులు ఉంటాయి. అవేంటంటే...

  • ఇళ్లకు పనికొచ్చే సర్వీసులు
  • వ్యాపారాలకు పనికొచ్చే సర్వీసులు 
  • పై రెండిటికి న్యాయం చేసే సర్వీసులు

పై వాటి ఆధారంగా మీరు ఎటువంటి సర్వీసులు అందించాలనే నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత, మీరు అందించే సర్వీసులకు విలువను తీసుకురావడానికి ఎలాంటి ఎక్స్ట్రా సర్వీసులను అందించాలని ఆలోచించండి. అంటే హోమ్ డెలివరీ, సేల్స్ తర్వాత ఇచ్చే సర్వీసు లాంటివి. 

మీరు గనుక కమర్షియల్‌గా, వ్యాపారాలకు సర్వీసులను అందించాలని చూస్తుంటే, అప్పుడు మీరు ఏ వ్యాపారాలతో బిజినెస్ చేయాలనీ చూస్తున్నారో వారితో దీర్ఘకాలిక కాంట్రాక్టు లాంటిది ఏమైనా జరుపుకుంటే మంచిది. ఇలా చేస్తే, క్రమంగా వ్యాపారం జరుగుతుందనే ధీమా ఉంటుంది. కాకపోతే, అందుకుగాను మీరు బల్క్‌లో కొనే వ్యాపారాలకు కాస్త తక్కువ ధరకు అమ్మాల్సి ఉంటుంది.

ఒకసారి ఒక విధమైన సర్వీసు అందించాలని నిర్ణయించుకున్న తర్వాత, నెమ్మది నెమ్మదిగా మీరు ఇతర వనరులను, పరిచయాలను, కస్టమర్లను పొందుకుంటూ విస్తరించాలి.

ఆరవ అడుగు : మీ బృందాన్ని ఏర్పరచుకోండి (లేకపోయినా పర్లేదు)

మీరు నడిపించే వ్యాపారంలో మీకు సహాయానికి కొంతమంది కావాలా వద్దా అనే విషయాన్నీ ఒకసారి ఆలోచించండి. కస్టమర్లను హ్యాండిల్ చేయడానికి, హోమ్ డెలివరీ చేయడానికి, అలాగే సేల్స్ చేసిన తర్వాత ఇచ్చే సర్వీసు చేయడానికి అంటూ కొంతమంది పనిలో పెట్టుకోవడం ఎంతైనా మంచిది. అలా పనిలో పెట్టుకొనే వారు సరైన సామర్ధ్యం కలవారై ఉండాలి. లేదంటే తర్వాత చాలా నష్టపోవాల్సి ఉంటుంది.

కాబట్టి మీరు మీకున్న అవసరాన్ని బట్టి, తగిన అనుభవం ఉన్న వారిని మాత్రమే పనిలో పెట్టుకోవాలి. అంతేకాక, మీ దగ్గర ఉండే వస్తువులు, కస్టమర్లతో ఎలా వ్యవహరించాలనే విషయాన్నీ మీ ఉద్యోగస్తులకు శిక్షణ ఇవ్వడం చాలా మంచిది. మీకు సన్నిహితులు, లేదా కుటుంబ సభ్యులను మీకు సహాయంతో పెట్టుకుంటే మీపై ఒత్తిడి తగ్గు వ్యాపారాన్ని మరింత మెరుగుగా నడిపించుకోగలరు.

కాకపోతే, వ్యాపారం చిన్నదైనప్పుడు, ఇతరుల సహాయం అవసరం ఉండదు. అలాంటప్పుడు ప్రారంభంలోనే మరొకరి సహాయం తెసుకోవాల్సిన అవసరం లేదు. పైగా అభిప్రాయం బేధాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు దగ్గరి వారి సహాయం తీసుకోవడా కంటే మరొకరి సహాయం పొందడం శ్రేష్టం.

ఏడవ అడుగు : అవసరమైన వస్తువులను కొనండి

మీరు మీ సర్వీసులను అందించడానికి మీకు కొన్ని వస్తువులు అవసరం అవుతాయి. మల్టీమీటర్, వోల్టేజ్ టెస్టర్, వైర్ స్ట్రిప్పర్స్, సర్క్యూట్ ఫైండర్స్, స్క్రూడ్రైవర్స్ లాంటివి అన్నమాట. 

ఇలాంటివి లేకుండా మీరు ఎలెక్ట్రికల్ బిజినెస్ నడపడం అసాధ్యం, కాబట్టి కచ్చితంగా ఉండాలి. కాకపోతే, కాస్త ఖర్చుతో కూడిన వ్యవహారం. అలాగని చవకగా దొరికితే కొనేద్దాం అని చూస్తుంటారు కొందరు, అలా చేయకండి. చవకగా కొన్నవి త్వరగా పాడైపోతాయి కాబట్టి డబల్ ఖర్చు అవుతుంది.

కాబట్టి ఒకవేళ అంత ఖర్చు చేయలేని పరిస్థితి ఎదురైతే, మంచి బ్రాండ్ వాటినే సెకండ్ హ్యాండ్ లో కొనండి. ఒకసారి ఆదాయం మొదలైన తర్వాత, నెమ్మదిగా అన్నిటిని కొనొచ్చు.

ఎనిమిదవ అడుగు : డిజిటల్ బాట పట్టాల్సిందే.

స్మార్ట్‌ఫోన్లు వాడే యూజర్ల సంఖ్య ఇప్పుడు గణనీయంగా పెరిగింది. కాబట్టి ఇది డిజిటల్ యుగం అనడానికి మనం సందేహించాల్సిన పని లేదు. ఇప్పుడు చాలా మంది గూగుల్‌లో "దగ్గరలో ఉన్న బేకరీని చూపు, లేదా నా దగ్గరలో ఎలెక్ట్రిక్ షాపు ఎక్కడ ఉంది?" అని అడగడం కామన్ అయిపోయింది. కాబట్టి అలాంటి సందర్భాలలో మీరే ముందు కనిపించేలా చేయడం ఎంతైనా మంచిది.

అందుకే మీ షాపు అడ్రెస్‌ని గూగుల్ మ్యాప్స్‌లో పెట్టడం మంచి పని. మీ షాపు పేరు, ఫోన్ నంబర్ అలాగే ఫోటోని కూడా యాడ్ చేయండి. అదెలా చేయాలో మీకు తెలియకపోతే, తెలిసిన వారి సహాయం తీసుకోండి. ఇలా చేయడం ద్వారా కస్టమర్లు ఈజీగా మీ షాపుకు వస్తారు.

తొమ్మిదవ అడుగు : మార్కెటింగ్ చేయాలి

ఒక వ్యాపారిగా మీరు చేయాల్సిన అన్నిటిని మంచిగా చేసిన కూడా, కస్టమర్లు ఒక్కోసారి రారు. అలాంటప్పుడే మీ మార్కెటింగ్‌లో లోపం ఉందని గ్రహించాలి. పైన చెప్పబడిన అన్ని అడుగులు వేసినా కూడా, ఈ ఒక్క అడుగు సరిగా వేయకపోతే, జనం మీ దగ్గరకి రారు. జనం మీ షాపును ఇష్టపడుతున్నారని మిగతా వారికీ తెలిస్తే, మీ షాపుకు తప్పక వస్తారు.

మరి అలాంటప్పుడు అలా తెలిసేలా చేయడం ఎలా? మీ ఏరియాలో ఉండే లోకల్ ఎలక్ట్రీషియన్లు, లైన్ మ్యాన్లు, ఎలెక్ట్రికల్ వస్తువులు సప్లై చేసేవారితో మంచి బంధం కలిగి ఉండడం అందులో ఒక భాగం. మీరు నేరుగా కస్టమర్ల దగ్గరకు వెళ్ళలేరు, కానీ వీళ్ళు వెలగలరు. కాబట్టి వారి ద్వారా మీకు వ్యాపారం నడిచేలా ఏర్పరచుకోండి. అలా చేస్తున్నందుకు గాను, వారికీ రేట్ల విషయంలో కాస్త సహకరించండి. అప్పుడు అందరూ లాభ పడతారు. 

అంతే కాక, మీరు న్యూస్ పేపర్, రేడియో, ఫామ్ప్లెట్స్ లాంటి వాటిలో యాడ్స్ కూడా వేయించవచ్చు. 

మార్కెటింగ్ మంచిగా ఉంటే, ప్రత్యర్థులు మీ ముందు నిలిచే అవకాశమే ఉండదు.

పైవన్నీ సరిగ్గా చేస్తే, మీరు సిద్ధంగా ఉన్నట్టే

ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మార్కెట్ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, అలాగే కస్టమర్ల అవసరాలు కూడా మారుతుంటాయి. కాబట్టి మీరు కస్టమర్లకు అవసరమైన సర్వీసులను వీలైనంత వరకు ఎల్లప్పుడూ అందించాలని చూడండి. 

బిజినెస్‌లో రేపు ఎలా ఉంటుందని ఎవరూ చెప్పలేరు. కాబట్టి ప్రతీ చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా చదివి తెలుసుకోండి. ఎక్కడ తప్పటడుగు వేయకూడదు. చాలామంది భాగస్వాములతో వచ్చే సమస్యలతో దివాళా తీస్తుంటారు కాబట్టి ఆ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 

కొన్ని సాధారణంగా అడిగే ప్రశ్నలు

ఒక ఎలెక్ట్రిక్ షాపును తెరవడానికి ఎంత ఖర్చు అవుతుంది?

సాధారణంగా ఒక ఎలెక్ట్రిక్ షాపును తెరవడానికి 3 నుండి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ షాపును ఎక్కడ స్థాపిస్తున్నారనే విషయం ఇందులో పెద్ద ప్రాభవాన్ని చూపుతుంది.

ఎలెక్ట్రికల్ షాపు బిజినెస్‌లో లాభాలు బాగా ఉంటాయా?

తప్పకుండ. టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది, కాబట్టి ఎలెక్ట్రికల్ వస్తువులకు డిమాండ్ ఎప్పుడోఒ ఉంటుంది.

ప్రారంభంలో ఎలాంటి వాటిపై పెట్టుబడి పెట్టాలి?

ఎలెక్ట్రికల్ షాప్ తెరవడానికి మీరు అన్నిటికంటే ముందు షాపులో అవసరమయ్యే పనిముట్లు, అలాగే అద్దెకు తీసుకొనే ఒక షాపు.

నా ఎలెక్ట్రికల్ షాపుకు అడ్వేర్టైజ్‌మెంట్ ఇవ్వడం ఎలా?

చాలా విధాలుగా చేయొచ్చు. ఆన్‌లైన్ మార్కెటింగ్ చేయొచ్చు, పామ్ప్లెట్లు పంచిపెట్టవచ్చు, బిల్ బోర్డుల సహాయం కూడా తీసుకోవచ్చు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ సన్నిహితుల ద్వారా మీ షాపు గురించి వీలైనంత మందికి తెలిసేలా చేయండి.

నా ఎలెక్ట్రిక్ షాపుకు కస్టమర్లను ఎలా పొందగలను?

పైన చెప్పినట్టు, ఎలెక్ట్రిషియన్లు, లైన్ మ్యాన్లు ఇంకా ఇతర వ్యాపారులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోండి. తప్పకుండా వ్యాపారం పుంజుకుంటుంది.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.