ఫర్నిచర్ తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి?
సాధారణంగా ఫర్నిచర్ లేని ఇల్లు లేదా కార్యాలయం ఎక్కడా కనిపించదు. ప్రతి ఇంట్లో లేదా కార్యాలయాల్లో సోఫా సెట్, అల్మరా, టేబుల్, కుర్చీ, బెడ్, సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్ అనేక ఇతర ఫర్నీచర్ వస్తువులు కనిపిస్తాయి. దీనిని గమనిస్తే ఫర్నిచర్ వ్యాపారం లాభదాయకమైనదిగా గుర్తించవచ్చు. అయితే ఫర్నీచర్ వ్యాపారం చేయాలనుకునేవారికి ఆ వ్యాపారానికి సంబంధించిన జ్ఞానం అత్యవసరం. కలపను ఎక్కడ నుంచి తీసుకువస్తారు?ఫర్నీచర్‌ను ఎలా మార్కెట్ చేస్తారు? దుకాణం ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలాంటి ఫర్నీచర్ విక్రయించాలి? ఇందుకు ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, ఈ వ్యాపారం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాలకు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఫర్నిచర్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యవస్థాపకుడు కలపను వివిధ వస్తువులుగా ఎలా మలచవచ్చో తెలుసుకోవాలి. ఇది తెలియకపోతే వడ్రంగి వ్యాపారాన్ని ప్రారంభించడానికి తగిన శిక్షణ తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది నిరుద్యోగులు వడ్రంగి పనులను చేస్తుంటారు. అటువంటి స్నేహితులను వడ్రంగి వ్యాపార వ్యవస్థాపకులు వారి వ్యాపారంలో భాగస్వామ్యం చేసుకోవచ్చు. వ్యవస్థాపకుడి లక్ష్యం స్థానిక వినియోగదారులే అయితే ఈ వ్యాపారాన్ని గ్రామీణ ప్రాంతాల్లో సైతం చాలా తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.
ఫర్నిచర్ తయారీ వ్యాపారం అంటే ఏమిటి?
ఫర్నీచర్ వ్యాపారిని సాధారణంగా వడ్రంగి అని పిలుస్తుంటారు. వీరు కుర్చీలు, టేబుళ్లు, మంచాలు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారుచేస్తుండటం మనం చూస్తుంటాం. కస్టమర్ యొక్క ఆర్డర్ ప్రకారం లేదా ప్రామాణిక పరిమాణంలో వీటిని తయారు చేస్తుంటారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వీటిని మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఇంతేకాకుండా భవన నిర్మాణంలో కూడా వడ్రంగిపని ఎంతో అవసరం ఉంటుంది.
మొదట పరిశోధన అవసరం
వ్యవస్థాపకుడు వడ్రంగి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటే, మొదట అతను వ్యాపారం నెలకొల్పానుకుంటున్న ప్రాంతంలో కుర్చీలు, టేబుళ్లు, బెడ్లు, డబుల్ బెడ్లు, అల్మరాలు, విండోలు, తలుపులు తదితర వస్తువులకున్న డిమాండ్‌ను తెలుసుకోవాలి. ఆ డిమాండ్‌ను విశ్లేషించిన తరువాత వ్యవస్థాపకుడు తన లక్ష్య వినియోగదారుల జాబితాను సిద్ధం చేసుకోవాలి. తద్వారా వ్యవస్థాపకుడు ఈ వ్యాపారంపై ఒక అవగాహనకు రాగలుగుతాడు. వ్యవస్థాపకుని విశ్లేషణ డేటా సానుకూల ఫలితాలను తెచ్చేదిగా ఉందని భావిస్తే, అతను తన వ్యాపారం కోసం వడ్రంగి పనివారిని నియమించుకోవడం ప్రారంభించాలి.
వడ్రంగి వ్యాపారం కోసం శిక్షణ పొందండి
ఫర్నీచర్ వ్యాపార వ్యవస్థాపకుడు సాంకేతిక శిక్షణ తీసుకోవలసిన అవసరం తప్పనిసరి కాదు. ఎందుకంటే అతను వడ్రంగి పనివారిని నియమించడం ద్వారా తన వ్యాపారాన్ని నిర్వహించనున్నాడు. అయితే దీనిని లాభదాయకమైన వ్యాపారంగా మార్చాలనే కోణం నుంచి చూస్తే, వ్యాపారవేత్తకు ఫర్నీచర్ తయారీలో శిక్షణ అవసరం.
ఉదాహరణకు:
తన దగ్గర పనిచేస్తున్న ఒక వడ్రంగి ఒక రోజులో కుర్చీ కూడా చేయలేకపోతే, వ్యవస్థాపకునికి ఒక రోజు ఉత్పాదకత ఏమిటో ఎలా తెలుస్తుంది? అందుకే ఇటువంటి పరిస్థితుల్లో శిక్షణ పొందిన వ్యవస్థాపకుని వ్యాపారం లాభదాయకంగా మారుతుంది. వ్యవస్థాపకుడు తగిన శిక్షణ పొందినట్లయితే, అతను తన ఉద్యోగుల పనితీరును, ఉత్పాదకతను సులభంగా అంచనా వేయగలడు. తద్వారా లక్ష్య వస్తువును సమయానికి సిద్ధం చేయగలుగుతాడు.
అనుభవజ్ఞులైన వడ్రంగిలను నియమించండి
వ్యవస్థాపకుడు తన దుకాణానికి సమీప ప్రాంతంలో ఉన్న నిపుణులైన వడ్రంగి పనివారిని నియమించుకోవాలి. వ్యవస్థాపకుడు ప్రారంభంలోనే వ్యాపార విస్తరణ గురించి ఆలోచించకూడదు. కస్టమర్లను లక్ష్యంగా చేసుకోవడం, వారి ఫర్నీచర్ అవసరాలను తీర్చడంపై దృష్టిని కేంద్రీకరించాలి. ఫర్నీచర్ వ్యాపారంలో వ్యవస్థాపకుడు ఇళ్లు, పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలను తమ లక్ష్య వినియోగదారులుగా చేసుకోవచ్చు
వడ్రంగి వ్యాపారం కోసం వ్యాపార నమూనా
వడ్రంగి వ్యాపారానికి సంబంధించి అనేక నమూనాలు ఉండవచ్చు. మొదట వ్యవస్థాపకుడు నిరుద్యోగులను లేదా సక్రమంగా పనిచేసే వడ్రంగి పనివారిని కలుసుకుని వారి ఉపాధి అవసరతను తెలుసుకోవాలి. వడ్రంగిపనివారు రెగ్యులర్ ఉద్యోగం పొందడానికి ఆసక్తి కలిగి ఉంటే, అటువంటి ప్రతిపాదనను వారి ముందు ఉంచవచ్చు. ఈ ప్రతిపాదన వారికి ఆమోదయోగ్యం అయిన తర్వాత వ్యవస్థాపకుడు తన ఫర్నీచర్ వ్యాపారం కోసం స్థలం, ఫైనాన్స్, ముడి పదార్థాలు మొదలైన వాటిని ఏర్పాటు చేసుకోవడం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వ్యవస్థాపకుడు కస్టమర్ల డిమాండ్ మేరకు తన దగ్గర పనిచేస్తున్న వడ్రంగి పనివారిని కస్టమర్ల ఇంటికి లేదా కార్యాలయానికి పంపడం ద్వారా కూడా ఆర్డర్లు పొందవచ్చు
ఎంచుకున్న ప్రదేశంలో ఒక దుకాణాన్ని అద్దెకు తీసుకోండి
వ్యవస్థాపకుడు తాను ఎంచుకున్న వ్యాపార స్థలంలో గల వినియోగదారుల డిమాండ్లను, అవసరాలను గుర్తించాలి. చిన్న స్థాయిలో వడ్రంగి వ్యాపారం చేయాలన్నా వినియోగదారులను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వ్యవస్థాపకులకు వినియోగదారుల నుండే ఆర్డర్లు అందుతాయి. వ్యవస్థాపకుడు తన వ్యాపారం కోసం ఏ ప్రదేశాన్ని ఎంచుకున్నా, అక్కడ భవనాన్ని అద్దెకు తీసుకోవాలి లేదా కొనుగోలు చేయాల్సివుంటుంది. ఫర్నీచర్ దుకాణాన్ని ఏదైనా ప్రధాన రహదారిలో ఏర్పాటు చేయవచ్చు. బహుళ అంతస్తుల భవనంలో ఫర్నీచర్ షాప్ పెట్టాలనుకుంటే కింది అంతస్తులో అది ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. తద్వారా కస్టమర్ నేరుగా దుకాణం లోనికి వచ్చి, ఉత్పత్తులను చూడగలుగుతాడు. ఫర్నీచర్ దుకాణం మూడవ లేదా అంతకంటే పైఅంతస్తులో ఉంటే కస్టమర్ దుకాణంలోనికి రావడం కష్టమవుతుంది. ఇది వ్యాపారంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. వ్యాపార వృద్ధిలో దుకాణం ఉన్న ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దుకాణాన్ని చాలా జాగ్రత్తగా ఎంపికచేసుకోవాలి.
వడ్రంగి వ్యాపారంలో మార్కెట్ పరిధి
ఈ వ్యాపారం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో? అది లాభదాయకంగా ఉందో లేదో తెలుసుకోవడం ముఖ్యం. పెరుగుతున్న జనాభా, ప్రజల ఆదాయం, వారి అవసరాలకు అనుగుణంగా వ్యాపారాన్ని నిర్వహించాల్సివుంటుంది. చాలా మంది కొత్తగా ఫర్నీచర్ తీసుకోవటానికి, పాత ఫర్నిచర్ మార్చడానికి ఇష్టపడతారు. ఇది రోజువారీ వ్యవహారం కానప్పటికీ, కొన్ని సంవత్సరాలకు ఒకసారి అయినా ఫర్నీచర్‌ను మారుస్తుంటారు. ఈ వ్యాపారానికి భారతదేశంలో అనేక అవకాశాలున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. వడ్రంగి పని లేకుండా ఇళ్లు లేదా భవనాలు నిర్మించడం దాదాపు అసాధ్యం. ప్రస్తుత రోజుల్లో ఫర్నిచర్‌తో పాటు ఇనుము, ప్లాస్టిక్ మొదలైన వాటిని కూడా వినియోగిస్తున్నారు. అయినప్పటికీ చెక్కతో చేసిన ఫర్నిచర్ ఎక్కువగా వినియోగంలో ఉంది. ఇంతేకాకుండా ప్రజల వారి రోజువారీ పనులలోనూ వడ్రంగి పనులు అవసరం అవుతాయి. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇళ్లు, భవనాలు మొదలైనవి ఎంతో అవసరం. అందుకే గృహ నిర్మాణంతో అనుసంధానమైవున్న వడ్రంగి వ్యాపారం ఎప్పటికీ కొనసాగుతుంటుంది.
ఫర్నిచర్ దుకాణం ప్రారంభించేందుకు ఎంత పెట్టుబడి అవసరం?
ఏ వ్యాపారమైనా దానిని ప్రారంభించేందుకు పెట్టుబడి పెట్టాలి. కాని ప్రతి వ్యాపారంలో పెట్టుబడి మొత్తం భిన్నంగా ఉంటుంది. ఫర్నిచర్ షాప్ వ్యాపారానికి ప్రారంభంలో కనీసం ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాల్సివుంటుంది. అయితే ఇది దుకాణాన్ని నెలకొల్పే స్థాయిని అనుసరించి ఉంటుంది. ముందుగా దుకాణంలో ఎటువంటి ఫర్నీచర్ ఉంచాలో నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు డిజైనర్ ఫర్నిచర్ ఉంచాలనుకుంటే అందుకు తగిన విధంగా వ్యవహరించాలి. తద్వారా కస్టమర్ ఫర్నిచర్ కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తారు. మీరు సాధారణ గృహోపకరణాల ఫర్నీచర్‌తో దుకాణం ప్రారంభించాలనుకుంటే అందుకు వ్యయం కాస్త తగ్గుతుంది. మంచి ఫర్నీచర్ షోరూమ్ తెరవడానికి కనీసం 1500 నుండి 2500 చదరపు అడుగుల స్థలం ఉండాలి. అలాగే స్టాక్ ఉంచడానికి గోడౌన్ కూడా అవసరం.
ఫర్నిచర్ షాప్ వ్యాపారం కోసం ఫైనాన్స్
ఈ వ్యాపార నిర్వహణకు తగిన పెట్టుబడి పెట్టాలి. స్వంత మూలధనంతో లేదా బ్యాంకు నుండి రుణం తీసుకుని ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దుకాణాన్ని ప్రారంభించే ముందు అన్ని అంచనా లెక్కలు తెలిసుండాలి. రుణం తీసుకుంటే, వాయిదా ఎంత చెల్లించాలి? ఎప్పటిలోగా రుణం తిరిగి చెల్లించాలనే విషయాలు తెలసుకోవాలి. ఈ అంచనాల తర్వాత మాత్రమే సమర్థవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. ఈ పాయింట్లలో ఒకటి గుర్తుంచుకోకపోయినా చాలా నష్టాన్ని భరించాల్సి ఉంటుంది.
ఫర్నిచర్ షాప్‌తో ఎంత లాభం?
ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, దాని లాభదాయకత ఎంతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫర్నిచర్ వ్యాపారంలో 20 నుంచి 30 శాతం మార్జిన్ ఉండవచ్చు. ఈ మార్జిన్ తక్కువగా కనిపిస్తుంది. కానీ వ్యాపారాన్ని విస్తరించడం ద్వారా మంచి లాభాలను పొందవచ్చు. డిజైనర్ లేదా కమర్షియల్ ఫర్నిచర్ వ్యాపారాన్ని నిర్వహిస్తే ఈ లాభం మరింత పెరుగుతుంది. అలాగే స్వంత తయారీ యూనిట్ ఉంటే, ఎక్కువ లాభాలను అందుకోవచ్చు.
ఫర్నిచర్ దుకాణానికి అవసరమైన లైసెన్స్
ప్రస్తుతం దేశంలో వ్యాపారాలను మరింత సులభతరం చేయడానికి భారత ప్రభుత్వం స్టార్టప్ ఇండియా తరహా చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా వ్యవస్థాపకులకు వివిధ రకాలుగా ప్రోత్సాహం అందుతుంది. వీటిని సద్వినియోగం చేసుకోవటానికి వ్యవస్థాపకుడు తన వ్యాపారాన్ని రిజిష్ట్రర్ చేయించుకోవాలి. టాక్స్ రిజిస్ట్రేషన్ లేకుండా కార్పొరేట్ సంస్థలతో వ్యాపారం చేయడం సాధ్యం కాదు. ఫర్నీచర్ దుకాణాన్ని ప్రారంభించేందుకు చట్టపరమైన లైసెన్స్ తీసుకోవలసి ఉంటుంది. జీఎస్టీకి కూడా దరఖాస్తు చేసుకోవాలి. జీఎస్టీ నంబర్ పొందాలి. షాప్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. దీని కోసం ఒక ప్రొఫెషనల్ సహాయాన్ని తీసుకోవచ్చు. ఇందుకు అధికవ్యయం కూడా అవదు. వీటినన్నింటినీ తీసుకున్న తరువాత తర్వాత వ్యాపారాన్ని వేగవంతం చేయగలుగుతారు. ఫర్నిచర్ ఎగుమతి చేయాలనుకుంటే, ఎగుమతి, దిగుమతి లైసెన్స్ కూడా తీసుకోవాలి. మీరు హస్తకళాల ఫర్నిచర్ విషయానికి వస్తే సంబంధిత ప్రభుత్వ శాఖ నుండి లైసెన్స్ పొందవలసి ఉంటుంది.
వడ్రంగి ఉపకరణాల కొనుగోలు
వడ్రంగి పనిలో అనేక చేతి ఉపకరణాలతో పాటు, కొన్ని యంత్రాలను కూడా ఉపయోగిస్తారు. వీటిని వినియోగించి వడ్రంగి ఏదైనా కలపతో వస్తువును తయారు చేయగలుగుతాడు. ఈ వ్యాపారం చేయడానికి వ్యవస్థాపకుడు కింద పేర్కొన్న సాధనాలను కొనుగోలు చేయాల్సివుంటుంది.
ప్రధాన వడ్రంగి ఉపకరణాల జాబితా
బడిసె
సుత్తి
స్పీడ్ స్క్వేర్
రిబ్బన్
చాక్ లైన్ ఫిట్టర్.
ఉలి
వడ్రంగి పెన్సిల్
ఫ్రేమింగ్ స్క్వేర్
సాదారణ పనులకు ఉపయోగించే కత్తి
ఫ్రేమింగ్ హామర్
స్క్రూ డ్రైవర్
గ్రీజ్ పెన్సిల్
టూల్ బెల్ట్
సాస్
వివిధ బిట్లతో కూడిన కార్డ్‌లెస్ డ్రిల్ మెషిన్
మరలు మరియు ఉపకరణాలు
వివిధ రకాలైన ప్లాయిస్
వివిధ రకాల జాక్స్ మరియు బ్లేడ్లు
ర్యాకింగ్ బార్.
ఉపకరణాలను కొనుగోలు చేసిన తరువాత, వ్యవస్థాపకుడు ముడి పదార్థాలను కొనుగోలు చేసి, వాటిని దుకాణంలో అందుబాటులో ఉంచాలి. అప్పుడు వడ్రంగా పనివారి ద్వారా ఉత్పత్తులను తయారు చేయవచ్చు.
ఫర్నిచర్ వ్యాపారంలో మార్కెటింగ్ పాత్ర
వ్యాపారాన్ని ఎంత గొప్పగా ఏర్పాటు చేసినా, అది కస్టమర్లను చేరే వరకు వ్యాపారం వృద్ధి చెందదు. ఇందుకోసం ఫర్నిచర్ దుకాణానికి తగినవిధంగా మార్కెటింగ్ చేయడం అవసరం. మార్కెటింగ్ వ్యవహారాలు తెలిస్తే, స్వయంగా ఒక ప్రణాళికను రూపొందించడం ద్వారా ముందుకు సాగవచ్చు, లేనిపక్షంలో ఒక ప్రొఫెషనల్ సహాయం కూడా తీసుకోవాల్సివుంటుంది. ఇప్పుడున్న రోజుల్లో ఆఫ్‌లైన్ మరియు ఆన్లైన్ మార్కెటింగ్ విధానాలను అనుసరించాలి. వ్యాపారానికి ఒక వెబ్సైట్ అవసరం. కరపత్రాలు, హోర్డింగ్‌లు, బ్యానర్లు, రోడ్ షోలు మొదలైన విధానాల ద్వారా మార్కెటింగ్ చేయవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్ కోసంవెబ్సైట్ ఎస్ఈఓ అవసరం. అలాగే సోషల్ మీడియా సహాయంతో ఫర్నీచర్ ఉత్పత్తులను మార్కెట్ చేయవచ్చు.
విక్రయాలను ఎలా పెంచాలి?
ఫర్నీచర్ దుకాణాన్ని ప్రారంభించాక విక్రయాలపై దృష్టి సారించాలి. తమకు అందుబాటులో ఫర్నీచర్ దుకాణం ఉందని వినియోగదారులు తెలుసుకుకోవడం అత్యవసరం. దీని కోసం వివిధ మాధ్యమాల సహాయంతో కస్టమర్లతో కనెక్ట్ కావచ్చు. డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తూ, కస్టమర్లను ఆకట్టుకుంటూ, మార్కెటింగ్ చేయవచ్చు. వాణిజ్య ఫర్నిచర్ విక్రయాల విషయంలో వివిధ కార్యాలయానికి వెళ్లి, వారితో మాట్లాడి కార్పొరేట్ టై–అప్ చేసుకోవచ్చు. ఈవెంట్లను స్పాన్సర్ చేయడం ద్వారా మార్కెంటింగ్ పెంచుకోవచ్చు. ఈ విధంగా షోరూంనకు మంచి ప్రమోషన్ కూడా అందుతుంది.