ప్రింటింగ్ షాప్ (జిరాక్స్ షాప్) బిజినెస్ ప్రారంభించడం ఎలా?
ప్రింటింగ్ మరియు ఫోటోకాపీ షాప్ ప్రారంభించడమనేది ఒక ఉత్తమ వ్యాపార ఆలోచన. ఇవి ప్రతిచోటా ఉన్నప్పటికీ వీటి అవసరాన్ని ఎవరూ కాదనలేదు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు మొదలైనచోట్ల ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ఎంతో ఉత్తమం. సాంకేతిక పరిజ్ఞానం పురోగతి దారిలో ఉన్నప్పటికీ, జిరాక్స్ మరియు ప్రింటింగ్ అవసరం ఎప్పటికీ ఉంటుంది. ఫోటోకాపీ అండ్ ప్రింటింగ్ షాప్ తక్కువ మూలధన పెట్టుబడితో కూడిన లో బడ్జెట్ వ్యాపార ఆలోచన. ఇది లాభదాయకమైన వ్యాపార ఆలోచన. దీనిని విద్యార్థులు కూడా ప్రారంభించవచ్చు. ప్రింటింగ్ మరియు ఫోటోకాపీ వ్యాపారం క్యాంపస్ వాతావరణంలో ఏర్పాటు చేయగల లాభదాయకమైన వ్యాపారం. అందుకే క్యాంపస్లోని వీధులు ప్రింటింగ్ దుకాణాలతో నిండి ఉంటాయి. ఇక్కడకు విద్యార్థులు తమ ప్రింటింగ్ అవసరాల కోసం వస్తుంటారు. ప్రింట్ మరియు ఫోటోకాపీ దుకాణాలు నిర్వహిస్తున్నవారు ఎల్లప్పుడూ బిజీగా ఉండటాన్ని చూస్తుంటాం. ప్రింటింగ్ మరియు ఫోటోకాపీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. మీరు ప్రింటింగ్ అండ్ ఫోటోకాపీ వ్యాపారంలోకి ప్రవేశించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటే ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోండి.
షాపు ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు?
ప్రింటింగ్ అండ్ ఫోటో కాపీ వ్యాపారంలో మీ బిజినెస్ విజయవంతం కావడానికి మీరు షాపు పెట్టబోయే ప్రాంతమే కీలకం. ఇతర వ్యాపారాల మాదిరిగా కాకుండా, ప్రింటింగ్ అండ్ ఫోటో కాపీ వ్యాపారానికి అందరికీ అందుబాటులో ఉన్న ప్రాంతాన్నే తప్పనిసరిగా ఎన్నిక చేయవలసిన అవసరం లేదు. పాఠశాలలు, ట్యూషన్లు, కళాశాలలు లేదా కార్యాలయాల దగ్గర మీ అవుట్లెట్ను ప్రారంభించండి. అక్కడ మీకు చాలా మంది కస్టమర్లు దొరుకుతారు.
ఏఏ పరికరాలు కొనుగోలు చేయాలి?
ప్రింట్ అండ్ జిరాక్స్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు కొన్ని ప్రాథమిక పరికరాలు అవసరం. ఫోటోకాపియర్ అండ్ ప్రింటింగ్ మెషిన్ తప్పనిసరి. అయితే నిమిషానికి 40-50 కాపీలు ఉత్పత్తి చేయగల ఫోటోకాపీయర్లను ఎన్నుకోండి. ఎందుకంటే మీదగ్గరకు పెద్ద వాల్యూమ్ అవసరాలతో సాధారణ కస్టమర్లు వస్తారు. అందుకే ఇందుకు అనువైన కాపీయర్లను కొనుగోలు చేయవచ్చు లేదా వాటిని లీజుకు తీసుకోవచ్చు. అయితే వాటిని అద్దెకు తీసుకోవడం వల్ల మీ లాభం తగ్గుతుంది. మీరు లో బడ్జెట్లో ఉంటే సెకండ్ హ్యాండ్ పరికరాలు కూడా కొనుగోలు చేయవచ్చు. కోరల్ డ్రా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ (ఇది MS వర్డ్, పవర్ పాయింట్, యాక్సెస్ మరియు ఎక్సెల్ ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది) మరియు ఫోటోషాప్ వంటి ఇతర ప్రోగ్రామ్లు కలిగి ప్రచురణ సాఫ్ట్వేర్లతో కూడిన డెస్క్టాప్ మీకు అవసరమవుతుంది. A4, A3, A2 మొదలైన పరిమాణాల్లోని ముద్రణ కాగితాలు, ఫోటో పేపర్, స్టెప్లర్స్, స్పైరల్ బైండర్ మొదలైవి అవసరవమవుతాయి.
మార్కెటింగ్ ఎలా చేయాలి?
మీ ఫోటోకాపీ అండ్ ప్రింటింగ్ వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు సరసరమైన ధరలకు సేవలు అందించడం ఉత్తమం. మీ దగ్గరకు వచ్చే కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ ధరలకు మెరుగైన సేవలను ఇవ్వడమనేది ఈ వ్యాపారంలో ఉత్తమ మార్కెటింగ్ వ్యూహం. ప్రింట్ అండ్ జిరాక్స్ అవసరాల కోసం సాధారణంగా విద్యార్థులు వస్తుంటారు. వారు పెద్ద వాల్యూమ్ అవసరాలతో వస్తుంటారు. అందుకే వారు తక్కువ ధరకు ఉత్తమ సేవలను అందించే దుకాణం కోసం వెదుకుతుంటారు. కాపీ మరియు ప్రింట్ వ్యాపారం వినియోగదారులకు విస్తృతమైన సేవలను అందిస్తుంది. ఒకే రకమైన ముద్రణ మొదలుకొని అనేక రకాల ప్రింటర్లను, కాపీయర్లను ఉపయోగించి పెద్ద సైజు ప్రింటవుట్లను తీసుకునుందుకు కూడా అవకాశముంది. చిన్న ప్రింట్ షాపులకు దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద ప్రింటింగ్ చైన్ వ్యాపారులతో పోటీ ఉంటుంది. అయితే మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను ఆకట్టకునేందుకు ప్రయత్నించడం ద్వారా వ్యాపారాన్ని వృద్ది చేయవచ్చు.
తగిన పేరును ఎంచుకోండి
మీ వ్యాపారం కోసం ఒక పేరును ఎంచుకోండి. మీ కంపెనీని రిజిస్ట్రర్ చేయించండి. ఈ వ్యాపారంలో చట్టపరమైన బాధ్యతకు తక్కువ ప్రాధాన్యత ఉన్నందున చిన్న ముద్రణ దుకాణాలను ఒక్కరే కూడా నిర్వహించవచ్చు. కంపెనీ యజమానుల సమాచారం మరియు రిజిస్టర్డ్ కంపెనీ చిరునామాను గుర్తించే సాధారణ రిజిస్ట్రేషన్ పత్రాన్ని పొందడం తప్పనిసరి. వ్యాపార అప్పులకు వ్యక్తిగతంగా బాధ్యత వహించే అవకాశం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, పరిమిత బాధ్యత సంస్థ (LLC) గా రూపొందించుకోండి.
మీరు ఏఏ సేవలు అందించవచ్చంటే…
మీరు కస్టమర్లకు అందించడానికి ఉద్దేశించిన సేవల యొక్క పూర్తి జాబితాను ముందుగా తయారు చేయండి. ఈ సేవలను అందించగల పరికరాల జాబితాను రూపొందించండి. ప్రింట్ షాపులలో కలర్ లేదా బ్లాక్ అండ్ వైట్ ఫోటోకాపీ, డాక్యుమెంట్ కటింగ్, స్కానింగ్ మరియు ఫ్యాక్స్ సేవలను అందించగలగాలి. విస్తృత శ్రేణి కస్టమర్లను ఆకర్షించడానికి వీలైనంతవరకు మీ సేవల సూట్ను విస్తరించండి. లామినేషన్, ప్రెజెంటేషన్–అసెంబ్లీ సేవలను కూడా అందించండి. ప్రింటింగ్, హోల్–పంచ్ మరియు పత్రాలను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న బైండర్ సేవలు అందుబాటులో ఉంచండి.
సురక్షిత ఫైనాన్సింగ్ ఎలా?
మీకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేయడానికి అవసరమైన ఫైనాన్సింగ్ను పొందండి. మరియు దుకాణాన్ని లీజుకు తీసుకోండి. వ్యక్తిగత పొదుపు కింద మీకు అవసరమైన డబ్బు మీ వద్ద లేకపోతే, స్థానిక బ్యాంక్ లేదా క్రెడిట్ యూనియన్ నుండి స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎస్బిఎ) రుణం తీసుకోవడం గురించి ఆలోచించండి. వాణిజ్య బ్యాంకులు అందించే చిన్న–వ్యాపార రుణాల కోసం సంప్రదించండి. కొత్త వ్యాపారవేత్తలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు ప్రోత్సాహాన్ని అందిస్తాయి. స్థానిక స్థాయిలో అవసరమైన వ్యాపార అనుమతులను పొందండి. సమాఖ్య పన్ను ప్రయోజనాల కోసం వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించండి.
ఇందుకోసం మీ రాష్ట్ర రెవెన్యూ శాఖను సంప్రదించండి. మీ స్థానిక ప్రాంతానికి అవసరమైన లైసెన్సులు లేదా అనుమతుల గురించి ఆరా తీయడానికి స్థానిక ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించండి.
ఆన్‌లైన్‌లో వ్యాపారం కొనసాగించాలంటే..
మీ కస్టమర్ బేస్ను అభివృద్ధి చేసుకునేందుకు ఆన్లైన్ ఉనికి కూడా అవసరమే. ఇందుకోసం వెబ్సైట్ను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఫేస్బుక్ మరియు ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సాధనాలను ఉపయోగించి, మీ వ్యాపారం గురించి అందరికీ తెలియజేయండి. వినియోగదారులు ప్రింటింగ్ సేవల కోసం శోధిస్తున్నప్పుడు మీ సేవలు వారికి చేరువయ్యేందుకు గూగుల్ యాడ్వర్డ్ లో ప్రకటనలను ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే రోడ్డుపై వెళ్లేవారి ఆకర్షించడానికి ప్రత్యేక ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేయండి. వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇవ్వండి. వీధి మూలల్లో బాణం గుర్తులతో మీ దుకాణానికి చేరుకునే మార్గాన్ని సూచించండి.
దశల వారీగా జిరాక్స్ గైడ్..
- కాపీ చేయాల్సిన మీ పత్రాలను తీసుకోండి. మీ ప్రింటర్ను ఆన్ చేయండి.
- మీ ప్రింటర్ యొక్క మూత తెరిచి, మీ దగ్గరున్న పత్రాలను కాపీ చేయదలిచిన వైపు గాజు పలక పైన ఉంచండి.
- అమరిక సరిగావుందో లేదో తనిఖీ చేయండి. తద్వారా మీ ప్రింటర్ మొత్తం పత్రాన్ని కాపీ చేయగలుగుతారు.
- తరువాత ప్రింటర్ మూత వేయండి. మీరు ఒక పెద్ద పుస్తకాన్ని కాపీ చేస్తున్నప్పుడు మూత బలవంతంగా మూసివేయడానికి ప్రయత్నించకూడదు.
- ఇప్పుడు మీకు ఏ రకమైన జిరాక్స్ అంటే రంగులోదా లేదా నలుపు లేదా తెలుపు కావాలో నిర్ణయించుకోండి.
- కొన్ని మల్టిపుల్ ప్రింటర్లలో మీరు కాగితం రకం మరియు కాపీ చేసిన పత్రం యొక్క పరిమాణాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. మీరు కాపీ చేస్తున్న అసలు పత్రంతో పోలిస్తే ఈ పత్రాన్ని పెంచడానికి లేదా కుదించడానికి ఇది అనువుగా ఉంటుంది.
- మీకు కావలసిన కాపీలు లేదా జిరాక్స్ పత్రాల సంఖ్యను ఎంచుకోండి. ప్రింటర్లో జిరాక్స్ పని పూర్తి కావడానికి మీరు తగినన్ని షీట్లను ప్రింటర్లో ఉంచండి.
- ఇప్పుడు స్టార్ట్ / కాపీ / ప్రింట్ బటన్ క్లిక్ చేయండి.
- షీట్లు పూర్తిగా ప్రింటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత వాటిని తీసుకోండి.
డబుల్ సైడెడ్ కాపీ కోసం ప్రింటర్‌లో జిరాక్స్ ఎలా చేయాలి?
మీరు పేజీకి రెండు వైపులా ముద్రించబడే విధంగా ప్రింటర్లో జిరాక్స్ చేయాలనుకుంటే మీరు డబుల్ సైడెడ్ కాపీలు సెలెక్ట్ చేయాలి. ఇందుకోసం ప్రింటర్ నుండి ‘2-సైడ్స్‘ లేదా డబుల్ సైడెడ్ బటన్ ఎంచుకోవాలి. పేజీని కాపీ చేయడం ప్రారంభించడానికి స్టార్ట్ బటన్ నొక్కాలి. తరువాత పేజీని తిప్పాలి.
తెలుసుకోవలసిన ఇతర విషయాలు
అమరిక సమస్యలలోని లోపాలు కాపీ చేసిన పత్రంలో కనిపిస్తాయి. కాబట్టి ఎంపికలను ఎన్నుకునేటప్పుడు, పత్రాన్ని సరిగా ఉంచేటప్పుడు ముద్రించేటప్పుడు తగిన జాగ్రత్త వహించండి. ప్రింటర్తో జిరాక్స్ పని ప్రారంభించేముందు మీ ప్రింటర్లో ఇంక్ స్ట్రీకింగ్ సరిగా ఉందో లేదో చూసుకోవాలి.