written by | October 11, 2021

ప్రయోజనాలు ప్రతికూలతలు ఆన్‌లైన్ వ్యాపారం

×

Table of Content


ఆన్‌లైన్‌లో వ్యాపారావ‌కాశాలు-లాభాలు- న‌ష్టాలు! 

ఇప్పుడున్న‌దంతా ఆన్‌లైన్‌ మయయే. మ‌న ద‌గ్గ‌ర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. కాలు బయట పెట్టకుండానే కావలసిన వస్తు, సేవలను ఆన్‌లైన్‌లో పొంద‌వ‌చ్చు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో మీకూ ఏదైనా ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేయాలని ఉందా? అయితే ఈ ఐడియాలపై ఒక్కసారి దృష్టి పెట్టండి. అలాగే ఈ వ్యాపారంలో ఉండే లోతుపాతుల‌ను కూడా తెలుసుకోండి. ముందుగా ఆన్‌లైన్‌లో ఏఏ వ్యాపారాలు సుల‌భంగా చేయ‌వ‌చ్చో తెలుసుకుందాం! 

ఆహార వ్యాపారం

దేశంలోని ప్రధాన నగరాల్లో ఆన్‌లైన్‌ ఆహార వ్యాపారం అంత‌కంత‌కూ ఊపందుకుంటోంది. ఉద్యోగాలు చేసే చాలా మందికి త‌మ ఇంట్లో వండుకునే తీరిక ఉండడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి, కోరిన టైమ్‌కి న‌చ్చిన‌ వంటకాల‌ను ఇంటికే తెప్పించుకుంటున్నారు. ఇటువంటివారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. దీనికితోడు వీకెండ్స్‌లో బయట‌కు వెళ్లి ఏ రెస్టారెంట్‌లోనో కూర్చోని, భారీగా సొమ్ము తగలేసే బదులు మంచి ఆన్‌లైన్‌ ఫుడ్‌ బజార్‌ నుంచి చౌకగా పసందైన వంటకాలు తెప్పించుకుంటున్న‌వారు కూడా ఎక్కువ‌వుతున్నారు. ఇటువంటి ఆన్‌లైన్‌ ఆహార వ్యాపారం కోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం ఉండదు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, సూరత్‌ నగరాల్లో ఇటువంటి సేవలు అందిస్తున్న డెల్ఫూ.కామ్ మాదిరిగా సిటీలోని మంచి హోటల్స్‌, రెస్టారెంట్లతో టై అప్‌ పెట్టుకుని ఈ బిజినెస్‌ను‌ ప్రారంభించవచ్చు. లేదా మీకే  వంట‌చేయ‌డంలో నైపుణ్యం ఉంటే సొంత కిచెన్‌ నుంచీ ఈ వ్యాపారం మొద‌లుపెట్ట‌వచ్చు. కాకపోతే మీ కిచెన్‌లో సరైన శుభ్రత పాటిస్తున్నారనేందుకు గుర్తుగా ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఎఐ) నుంచి ముందుగా లైసెన్సు తీసుకోవ‌డంత‌ప్ప‌నిస‌రి. ఆక‌ట్టుకునేలా వెబ్‌సైట్‌ డిజైన్‌ చేయించుకుని, ఆన్‌లైన్‌లోనే ఆర్డర్లు తీసుకుని కావలసిన వంటకాలు రుచిగా, శుచిగా డెలివరీ చేయగలిగితే ఈ వ్యాపారంలో మంచి లాభాలు అందుకోవ‌చ్చు. ఫుడ్‌పాండా.కామ్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన కిచెన్‌ఫుడ్స్‌.కామ్‌ కూడా ఆన్‌లైన్‌లో మంచి ఆహార వ్యాపారం చేస్తున్నాయి. ఆన్‌లైన్ వ్యాపారాలు మ‌రింత‌గా ఊపందుకుంటున్నందున‌ మున్ముందు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోనూ ఈవిధ‌మైన ఆహార వ్యాపారానికి బోలెడ‌న్న అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

టాక్సీ బుకింగ్‌..

నెట్‌ పుణ్యమాని ఆన్‌లైన్‌ క్యాబ్‌ బుకింగ్‌ సేవలకూ ఇటీవలి కాలంలో అంత‌కంత‌కూ డిమాండ్‌ పెరుగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉబెర్‌, ఓలా సంస్థలు ఎంతగా విస్త‌రిస్తున్న‌ప్ప‌టికీ, మంచి సర్వీస్‌ అందజేయగలిగితే చిన్న చిన్న ఆన్‌లైన్‌ టాక్సీ బుకింగ్‌ సంస్థలకూ మంచి వ్యాపార అవకాశాలుంటాయి. కాకపోతే కస్టమర్‌ కోరిన చోటికి సకాలంలో కోరిన టాక్సీ లేదా కారు పంపించ‌గ‌ల‌గాలి. ఈ వ్యాపారంలో సమయ పాలనతోపాటు ఎక్కువ కార్లు ఉన్న వ్యక్తులు, సంస్థలతో మంచి సంబంధాలు నెలకొల్ప‌డం ఎంతో అవసరం. ఆన్‌లైన్‌ టాక్సీ బుకింగ్‌ వ్యాపారానికి బుక్‌మైక్యాబ్‌.కామ్‌ చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ సంస్థ హైదరాబాద్‌తో పాటు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో తన సేవలు విరివిగా అందిస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే జీక్యాబ్స్‌, డాట్‌క్యాబ్స్‌, ఈజీక్యాబ్స్‌ పేరుతో పలు అన్‌లైన్‌ బుకింగ్‌ సంస్థలు త‌మ సేవ‌లు అందించ‌డం ప్రారంభించాయి. ఈ సంస్థలు ఎయిర్‌పోర్టు డ్రాపింగ్‌ మొదలుకుని యానివర్సిరీ, బర్త్‌డే, మ్యారేజ్‌ వంటి సందర్భాలకూ కావలసిన ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. కొద్ది పాటి పెట్టుబడితో చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లోనూ ఇలాంటి సర్వీసులు ప్రారభించి నిర్వ‌హించ‌వ‌చ్చు.

 గ్రంథాలయం

నెట్‌ ఎంతగా విస్త‌రిస్తున్నా పుస్తకాలు చదివే వారికి ఇప్పటికీ కొదవ లేదు. మీకు మంచి పుస్తక పరిజ్ఞానం ఉంటే ఆన్‌లైన్‌ బుక్‌ లైబ్రరీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఎక్కువ మందికి నచ్చే పుస్తకాలను ఎప్పటికపుడు కొని, వెబ్‌సైట్‌లో ప్రదర్శనకు ఉంచాలి. ఆన్‌లైన్‌లో సభ్యులను చేర్చుకుని, పుస్తకానికి ఇంత లేదా నెలకు ఇంత అని చందా కట్టించుకుని, వారికి ఆయా పుస్తకాల అవసరాన్ని బట్టి ఇంటి దగ్గరే అందించాలి. ఈజీలిబ్స్‌, జస్ట్‌బుక్స్‌సిఎల్‌సి వంటి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో ఆన్‌లైన్‌ బుకింగ్‌ ద్వారా సభ్యులకు పుస్తకాలను అద్దెకు అందిస్తున్నాయి.

 అద్దెకు ఆట బొమ్మలు

ఆన్‌లైన్ మాధ్య‌మం ద్వారా పిల్లల ఆట వస్తువులను అద్దెకు ఇవ్వవచ్చు. పిల్లలకు ఆట వస్తువుల మీద ఉన్న‌ ఆసక్తి కార‌ణంగా ఈ వ్యాపారం నిర్వ‌హించి రాణించ‌వ‌చ్చు. అయితే ఇందుకు చేయాల్సిందిల్లా పెద్ద సంఖ్యలో బొమ్మలు, ఇతర ఆట వస్తువులు కొనుగోలు చేసి, వాటిని ఆన్‌లైన్‌లో ప్ర‌ద‌ర్శించాలి. సభ్యులుగా చేరిన వారికి వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని అందుకోవ‌చ్చు. ఇందుకోసం నెలవారీ, లేదా మూడు నెలలకు ఒకసారి లేదా ఏడాదికి ఒకసారి స‌బ్‌స్క్రిప్ష‌న్ వసూలు చేయ‌వ‌చ్చు. పిల్లల వయసుకు తగ్గట్టు బొమ్మలు అద్దెకు ఇవ్వడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. టాయిస్‌-ఆన్‌-రెంట్‌.కామ్ త‌ర‌హా ఆన్‌లైన్‌ టాయ్‌ రెంటింగ్‌ కంపెనీలు ఇప్పటికే హైదరాబాద్‌తో సహా పలు నగరాల్లో ఈ తరహా సేవలు అందిస్తున్నాయు. అందుకే ఇటువంటి ఆలోచన ఉంటే మీరు కూడా ఈ త‌ర‌హా వ్యాపారాన్ని ప్రారంభించ‌వచ్చు.

ఆన్‌లైన్‌లో బస్‌ టిక్కెట్‌ బుకింగ్‌

ఆన్‌లైన్‌ బస్‌ టిక్కెట్ల బుకింగ్‌ వ్యాపారానికి మంచి భవిష్యత్ ఏర్ప‌డుతోంది. ఈ రంగంలో ఇప్పటికే అభిబ‌స్‌.కామ్‌, రెడ్‌బ‌స్‌.కామ్ మొద‌లైన‌వి అభివృద్ధి బాట‌లో ప‌య‌నిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలతో పాటు వివిధ నగరాల మధ్య బస్‌ సర్వీసులు నడిపే సంస్థలు ఇప్పటికే తమ సొంత ఆన్‌లైన్‌ టిక్కెట్ల బుకింగ్‌ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. అయిన‌ప్ప‌టికీ బస్‌ ఆపరేటర్లు, ట్రావెల్‌ ఏజెన్సీలతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తులు కొద్దిపాటి పెట్టుబడితో ఆన్‌లైన్‌ బస్‌ టిక్కెట్ల బుకింగ్‌ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంతేకాదు ఆన్‌లైన్‌లో ప్రారంభించడానికి మీ దగ్గర ఏదైనా మంచి బిజినెస్‌ ఐడియాలు ఉంటే అందుకు పెట్టుబడులు అందించే సంస్థలు కూడా ఉన్నాయి.

ఆన్‌లైన్ వ్యాపారంలో ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి

కొత్తగా ఆన్‌లైన్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకొనేవారు కొన్ని జాగ్రత్తలు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి. కొంతమంది వ్యాపారం పెట్టామన్న అత్యుత్సాహంతో తొంద‌ర‌పాటుతో త‌మ‌కు తోచినట్లు చేసేస్తుంటారు. త‌రువాత అవన్నీ బెడిసికొడితే డీలాపడిపోతుంటారు. ముందుగా మార్కెట్లో ఎలాంటి వస్తువులకు డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. లాభనష్టాలను బేరీజు వేసుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. అవ‌గాహ‌న లేకుండా ఆన్‌లైన్ బిజినెస్ నిర్వ‌హించ‌డం అంత సులభమైన‌దేమీ కాదు. నిశిత పరిశీలన, ఏకాగ్రత, సరైన అవగాహన విస్తృతమైన దృష్టికోణం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. మొదట్లో కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ సరైన అవగాహన లేకపోవడం వల్ల అపజయాల‌ పాలవుతుంటారు. ప్రారంభంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌నే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. మార్కెట్ ఎలా ఉంది? ఏఏ వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి? కస్టమర్లను ఏవిధంగా ఒప్పించగలగాలి? అనే విషయాలపై పరిశోధన చేయాలి. 

ఆన్‌లైన్ వ్యాపారంలో చోటుచేసుకునే తప్పిదాలు

షార్ట్‌కర్ట్ ఎంచుకోకూడదు  

అనుభవజ్ఞులైన వ్యవస్థాపకులు వ్యాపారంలో సత్వర మార్గాలను ఎంపిక చేసుకోరు. అలాచేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. స్టార్టప్‌లు ప్రారంభించేవారు తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి, సులభ మార్గంలో వ్యాపారం కొనసాగిస్తుంటారు. దీర్ఘకాలంలో ఇది వ్యాపార పతనానికి దారితీయ‌వ‌చ్చు. ఇలాంటి పరిస్థితులు ఏర్ప‌డితే కంపెనీ పూర్తిగా పతనమవుతుంది.

రాత్రికి రాత్రే ఎద‌గ‌డం అసాధ్యం 

ఆన్‌లైన్ వ్యాపారం ప్రారంభించే ముందు కొంతమంది వ్యవస్థాపకులు ఎక్కువగా పనిచేసి ఒక్కరోజులో ధనవంతులమైపోవాలనుకుంటారు. అందుకోసం విపరీతంగా కష్టపడుతుంటారు. ఈ నేప‌ధ్యంలో పట్టు తప్పుతుంటారు. ఆన్‌లైన్‌లో వ్యాపారం చేయాల‌నుకునేవారికి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం సహనం. వ్యాపారం క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి గానీ త్వరత్వరగా ఏదో చేసేద్దామనుకోకూడదు. సమయం, ధనం, కృషి వీటన్నింటినీ సరైన పద్ద‌తిలో పెట్టుబడిగా పెట్టాలి. నిలకడ కలిగాక నెమ్మదిగా అభివృద్ధి చెంద‌డం ప్రారంభమ‌వుతుంది. ఊహించిన ఫలితాలను పొందలేకపోతే, ప్రణాళిక, వ్యూహాల అమలును పూర్తిగా సమీక్షించుకోవాలి.

తప్పుడు భాగస్వామిని ఎంచుకోకూడ‌దు

వ్యాపారంలో స‌రైన భాగస్వామి (పాట్నర్)ని ఎంచుకోక‌పోతే నష్టాలు తప్పవు. ఎంచుకున్న వ్యక్తి సరైనవారా కాదా అనేది బేరీజు వేసుకోవాలి. నిజాయితీ, నైపుణ్యాలకు ప్రాధాన్య‌త‌నివ్వాలి. మీ ఆలోచనలకు, ప్రతిచర్యలకు ప్రతిరూపంగా భాగ‌స్వామి ఉండాలి. మీ పనులకు సహకారం అందిస్తుండాలి. అటువంట‌ప్పుడే భాగ‌స్వామ్య వ్యాపారం ఊపందుకుంటుంది.

అత్యుత్సాహం ప‌నికిరాదు  

కొంతమంది ఆన్‌లైన్ బిజినెస్ ప్రారంభించిన మొదట్లో విజయాలను త్వరగా అందుకుంటారు. దీనివల్ల విజ్ఞత కోల్పోయే అవ‌కాశ‌ముంది. అలాగే కష్టపడటం మానేస్తారు. విజయం అందించే ఉత్సాహం ఒక్కోసారి వెర్రిత‌నానికి దారితీయ‌వ‌చ్చు. ఇతర ఉత్పత్తులు, వ్యాపారాన్ని విస్తరించాలని అమిత‌మైన రిస్క్ తీసుకుంటారు. దీంతో దేనిపైనా సరైన శ్రద్ధ తీసుకోలేకపోతారు. ఏకాగ్రత లేకపోవడం వల్ల వ్యాపారం అపజయం పాలవుతుంది.

వినియోగదారుల అభిప్రాయాలు విస్మరించడం 

ఆన్‌లైన్ వ్యాపారం ప్రారంభంలో వినియోగదారుల ఫిర్యాదులను త‌ప్ప‌నిస‌రిగా స్వీకరించాలి. ప్రతికూల, అనుకూల ప్రతిస్పందనలను ఒకేరకంగా తీసుకోవాలి. వస్తు ఉత్పత్తి, నాణ్యత మరింత మెరుగ్గా ఉండాలంటే వినియోగదారుల అభిప్రాయాలను, ఫిర్యాదులను పట్టించుకోవడం అత్యవసరం. వ్యాపారం ఎలా ఉంటోంది? దానిని ఎలా నిలబెట్టుకోవాలనే విశ్లేషణ అవసరమ‌వుతుంది. వ్యవస్థాపకులు వారి విధానాలలో, వ్యూహాలలో ప్రగతిశీల మార్పులను అమ‌లుచేయ‌గలుగుతారు.

లైవ్ చాట్ తప్పనిసరి 

కొంతమంది ఆన్‌లైన్ వ్యాపార వ్యవస్థాపకులు కస్టమర్ సర్వీస్ వైపు సరైన శ్రద్ధ చూపరు. ఖరీదైన ప్రకటనలు, మార్కెటింగ్ మొద‌లైన‌వి ఉంటేనే విజయం సాధిస్తామని అనుకోవడం తప్పు. బిజినెస్‌లో కస్టమర్ల మద్ధతు కీల‌క‌మైన‌ అంశం. ప్రారంభంలో సేవా ప్రమాణాన్ని మెరుగుపరచడానికి వ్యాపారానికి గుర్తింపుగా అది ఉంటుంది. వ్యవస్థాపకుడు వినూత్నంగా ఆలోచించ‌గ‌ల‌గాలి. ఆన్‌లైన్ వ్యాపారంలో లైవ్‌ఛాట్ తప్పనిసరిగా ఉండాలి. ఆన్‌లైన్ వ్యాపార ఉపకరణాలను త‌ప్ప‌నిస‌రిగా ఉపయోగించుకోవాలి. ఇలాంటి త‌ప్పులు దొర్ల‌కుండా చూసుకోగ‌లిగితే ఆన్‌లైన్ బిజినెస్‌లో విజయవంతం కావ‌డానికి అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. 

 

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.