వ్యాపారాన్ని నడపడం అంటే ఊహించని ఖర్చులు, బాధ్యతలు మరియు ఇబ్బందులతో పాటు ఉత్సాహం అన్నీ కలగలిపి ఎదురవుతాయి. అయితే, సంస్థ నుండి ఎంత డబ్బు బయటకు వెళ్తోందో మరియు ఎంత డబ్బు వస్తున్నదో తెలుసుకోవడం వ్యాపారం యొక్క మొదటి క్రమం. ఏ వ్యాపార ఉద్దేశ్యమైనా చివరకి లాభం పొందడమే. అలా చేయడానికి, పేరోల్ మరియు యుటిలిటీ బిల్లులు వంటి నిరాడంబరమైన ఖర్చుల నుండి అద్దె మరియు ఉత్పత్తి యూనిట్లు వంటి ముఖ్యమైన ఖర్చుల వరకు కంపెనీ నుండి బయటకు వెళ్ళే మొత్తం డబ్బును మీరు ట్రాక్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల, వ్యాపారంలోని ఖర్చులు మరియు వ్యాపారం యొక్క లాభాన్ని ఎలా లెక్కించాలో మరియు బ్యాలెన్స్ షీట్ ఇంకా, లాభ నష్టాల స్టేట్ మెంట్ యొక్క అకౌంటింగ్ ని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాన్ని మీరు మొదట అర్థం చేసుకోవాలి.
ప్రత్యక్ష మరియు పరోక్ష ఖర్చులను అర్థం చేసుకుందాం
ప్రతి వ్యాపారంలో రెండు కేటగిరీల ఖర్చులు ఉంటాయి: ప్రత్యక్ష మరియు పరోక్ష ఖర్చులు.
అందువల్ల, ఏ ఖర్చులు ఏ హెడ్డింగ్ కిందకు వెళ్తాయనే దానిని తెలుసుకోవడం ముఖ్యం, ఎందుకంటే ఇది అకౌంటింగ్ ను ప్రభావితం చేస్తుంది మరియు మినహాయింపులు మరియు పన్ను పొదుపుకు కూడా సహాయపడుతుంది.
ఖర్చులు అంటే ఏమిటి?
మీరు ఒక వ్యాపారాన్ని స్థాపించినప్పుడు, దానిని నడిపించడానికి మీరు కొన్ని నిధులను పెట్టుబడిగా పెట్టాలి. కంపెనీ నడవడం మొదలైన తరువాత, రోజువారీ, వారపు, నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన రెగ్యులర్ ఖర్చులను చేస్తుండాలి. కొన్ని ఖర్చులు పునరావృతమయ్యేవే అయినప్పటికీ, మీరు బడ్జెట్ చేయని కొన్ని ఊహించని ఖర్చులు లేదా వ్యాపార ప్రణాళికల్లో మార్పుల కారణంగా తలెత్తే ఖర్చులు ఎదురవ్వవచ్చు.
ఖర్చులు ఎప్పుడు మరియు ఎక్కడ అవసరమవుతాయనే విషయాన్ని అర్థం చేసుకోవడం అవసరం, తద్వారా అకౌంటింగ్ ప్రక్రియను వెంటనే ప్రారంభించవచ్చు. వ్యాపార సమయంలో తలెత్తే ఏవైనా ఊహించని ఖర్చులను కవర్ చేయడానికి వ్యాపార సంస్థలకు అత్యవసర నిధి కూడా ఉండాలి. కంపెనీ నుండి బయటకు వెళ్ళే డబ్బు విషయానికి వస్తే ఇవి చాలా ముఖ్యమైన పరిగణనలు.
ప్రత్యక్ష ఖర్చులు అంటే ఏమిటి?
పేరులో ఉన్నట్టే, "ప్రత్యక్ష" ఖర్చులు నేరుగా ఒక కంపెనీ యొక్క ప్రాథమిక వ్యాపార కార్యకలాపాలతో ముడిపడి ఉండి, అదే విధంగా కేటాయించబడతాయి. ఇవి ఎక్కువగా సరుకులు మరియు సేవలను పొందడానికి, అలాగే ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులు అయి ఉంటాయి. ప్రత్యక్ష ఖర్చులు అనేవి కంపెనీ యొక్క ప్రధాన ఖర్చులు. ఇవి విక్రయించిన ఉత్పత్తులు మరియు సేవల ఖర్చులో భాగంగా చూపుతారు.
ప్రత్యక్ష ఖర్చులు నేరుగా అమ్మబడిన ఉత్పత్తి లేదా నిర్వహించబడే సేవ యొక్క తయారీతో ముడిపడి ఉంటాయి, మరియు తయారీ, నిర్మాణం లేదా సేవ వంటి వ్యాపార రకాన్ని బట్టి అవి మారతాయి. అవి ఒక వ్యాపార ఆర్థిక ప్రకటన రికార్డులో ఖర్చును ట్రాక్ చేయడానికి చూపించవలసిన ఒక అంశం. ఒక ఉత్పత్తి లేదా సేవ యొక్క ధరను నిర్ణయించడానికి ఈ ఖర్చులను ఆధారం చేసుకుంటారు.
ఈ ఖర్చులు ఉత్పత్తి వేగంతో హెచ్చుతగ్గులకు గురవుతాయి, అయితే ఉత్పత్తి చేయబడిన ప్రతి యూనిట్ లో మాత్రం వీటి ఖర్చు స్థిరంగా ఉంటుంది. సాధారణంగా వీటిని డిపార్ట్ మెంట్ మేనేజర్ మ్యానేజ్ చేస్తారు. కానీ వాటిని ప్రత్యక్ష ఖర్చులుగా విక్రయించే రేటును నిర్ణయించే పని ఈ వస్తువులు మరియు సేవలను ఉత్పత్తి చేసే వ్యాపారానిది. కంపెనీ యొక్క స్థూల లాభాన్ని లెక్కించడానికి ఈ ఖర్చులు ఉపయోగించబడతాయి. ఉత్పత్తి యొక్క ఖర్చును తెలుసుకోవడం కొరకు ఈ ఖర్చులు అవసరం అవుతాయి. డిపార్ట్ మెంట్ ల్లో ఖర్చులను వర్గీకరించడానికి మరియు నిర్వహించడానికి వీటిని ఉపయోగిస్తారు.
ప్రత్యక్ష ఖర్చులు ఉదాహరణలు - ముడిపదార్థాల ఖర్చు, వేతనాలు, ఇంధనం, ఫ్యాక్టరీ అద్దె మొదలైనవి.
పరోక్ష ఖర్చులు అంటే ఏమిటి?
పరోక్ష ఖర్చులు ఒక కంపెనీ యొక్క ప్రాథమిక వ్యాపార కార్యకలాపాలకు వెంటనే ఆపాదించబడవు. కంపెని నడుస్తూ ఉండటానికి పరోక్ష ఖర్చులు చాలా ముఖ్యమైనవి, కానీ అవి వ్యాపారం యొక్క ప్రాథమిక ఆదాయ-ఉత్పాదక ఉత్పత్తులు లేదా సేవల ఖర్చుతో ముడిపడి ఉండవు.
వ్యాపారం యొక్క రోజువారీ కార్యకలాపాల్లో అయ్యే ఖర్చులను పరోక్ష ఖర్చులు అని అంటారు. అమ్మిన వస్తువులతో వీటికి సంబంధం లేదు. చాలా సందర్భాల్లో, పరోక్ష ఖర్చులు ఏ ఒక్క ప్రాంతానికి కేటాయించబడవు. అద్దె వంటి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీల విషయానికి వస్తే ఇది ప్రత్యేకించి నిజం. పారిశ్రామిక ఓవర్ హెడ్ల ఫలితంగా ప్రత్యక్ష ఖర్చులు ఖర్చు అవుతాయి. ఖర్చులు జరిగినప్పుడు తయారు చేసిన ఉత్పత్తులపై ఈ ఖర్చులు ప్రభావం చూపుతాయి. ఉత్పత్తి ధరకు పరోక్ష ఖర్చులను జోడించలేం. అమ్మకపు ధరపై దీనికి ఎలాంటి ప్రభావం ఉండకూడదు. పరోక్ష ఖర్చులు రెండు రకాలుగా విభజించబడతాయి: స్థిర పరోక్ష ఖర్చులు మరియు పునరావృత పరోక్ష ఖర్చులు.
- ప్రాజెక్ట్ యొక్క కాలవ్యవధి కొరకు ఫిక్స్ చేయబడ్డ పరోక్ష ఖర్చులను స్థిర పరోక్ష ఖర్చులుగా పేర్కొంటారు.
- క్రమం తప్పకుండా చెల్లించే పరోక్ష ఖర్చులను పునరావృత పరోక్ష ఖర్చులుగా సూచిస్తారు.
పరోక్ష ఖర్చులు ఉదాహరణలు-టెలిఫోన్ బిల్లులు, ప్రింటింగ్ మరియు స్టేషనరీ, జీతాలు మొదలైనవి.
ప్రత్యక్ష మరియు పరోక్ష ఖర్చులను మెయిన్టైన్ చేయాల్సిన ప్రాముఖ్యత
లాభదాయకమైన వ్యాపారాన్ని నిర్వహించడం కొరకు మీరు సరైన ఆర్థిక రికార్డులను కలిగి ఉండాలి. అందుకే ప్రత్యక్ష మరియు పరోక్ష ఖర్చులను వేర్వేరుగా మెయిన్టైన్ చేస్తూ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
- ఖచ్చితమైన ఆర్థిక రికార్డులను నిర్వహించడం వల్ల మీ కంపెనీ చట్టబద్దంగా అవసరమైన విధంగా పన్నుల నియమాలకు తగినట్టు ఉండటానికి వీలుపడుతుంది.
- తగిన ప్రదేశాల్లో మీ పరోక్ష ఖర్చులను నమోదు చేయడం చాలా ముఖ్యం. కాంప్లయన్స్ మెయింటైన్ చేయడం కొరకు ఇది చాలా ముఖ్యం, అయితే పన్ను మినహాయింపులను సద్వినియోగం చేసుకోవడానికి కూడా ఇది పనికొస్తుంది.
- కొన్ని పరోక్ష ఖర్చుల విషయంలో వ్యాపార యజమానులు కొన్ని ప్రయోజనాలు మరియు పన్ను మినహాయింపులు పొందగలరు.
- యుటిలిటీస్ వంటి కొన్ని పరోక్ష ఖర్చులు మీ వ్యాపారాన్ని నడిపించడానికి తప్పక చేయాల్సి ఉంటుంది, అలాగే మీ పన్నుల విషయంలో రాయితీ పొందడానికి వీటిని చూపించవచ్చు. తమ ఇళ్ల నుండి తమ వ్యాపారాలను నడుపుతున్న వ్యవస్థాపకులకు ఇది మంచి విషయం.
- వ్యాపారంలో విజయం సాధించడం సులభమైన పని కాదు, కానీ మీకు సరైన సాధనాలు ఉంటే మీ పోటీదారులను తప్పక ఓడించగలరు.
- పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో, మీ ఆర్థిక రికార్డుల యొక్క కచ్చితత్వం మరియు మీరు మీ వ్యాపారాన్ని నడిపే సామర్థ్యం కీలకం.
- పెట్టుబడిదారులు తమ డబ్బును ఏ వ్యాపారమైతే తన రంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకొని సరైన అడుగులు వేస్తుందో, అందులో పెట్టాలని చూస్తుంటారు. కాబట్టి అలాంటి సమయంలో ఖచ్చితమైన రికార్డులను చూపించగలిగితే వారిలో విశ్వాసాన్ని పుట్టించగలరు.
ఒక సంస్థ విజయవంతమైనదని దాని ఆర్థిక రికార్డులు రుజువుగా పనిచేస్తాయి. అలాంటపుడు రెండు రకాల ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, ముఖ్యంగా మీ ఉత్పత్తులకు ధర నిర్ణయించేటప్పుడు. ఉత్పత్తి తయారీ యొక్క ఖచ్చితమైన ఖర్చులను మీరు పూర్తిగా అర్థం చేసుకుంటే మీ వస్తువుల ధరను ఆకర్షనియంగా పెట్టడానికి వీలవుతుంది.
ప్రత్యక్ష మరియు పరోక్ష ఖర్చుల మధ్య కీలక వ్యత్యాసాలు
ఈ క్రింది టేబుల్ ప్రత్యక్ష మరియు పరోక్ష వ్యయాల మధ్య వ్యత్యాసాలను చూపుతుంది -
ప్రత్యక్ష ఖర్చులు |
పరోక్ష ఖర్చులు |
ఉత్పత్తి లేదా సేవలను తయారు చేయడానికి అయ్యే ఖర్చును ప్రత్యక్ష ఖర్చు అంటారు. |
రోజువారీ వ్యాపార కార్యకలాపాలను జరిపించడానికి అయ్యే ఖర్చును పరోక్ష ఖర్చు అంటారు. |
డైరెక్ట్ మెటీరియల్ మరియు డైరెక్ట్ చెల్లింపులు మాత్రమే కాకుండా, ప్రత్యేక్ష ఖర్చులను నిర్ధిష్ట ప్రదేశానికి, కస్టమర్, ప్రొడక్ట్, జాబ్ లేదా ప్రాసెస్ కు లింక్ చేయబడతాయి. |
పరోక్ష ఖర్చులు అనేవి స్పష్టంగా గుర్తించలేనివి. వీటిని ఒక వస్తువు, పని లేదా యూనిట్ కు నేరుగా ఆపాదించలేము. |
ప్రత్యక్ష ఖర్చులను నేరుగా వస్తువు కోసం అయ్యే ఖర్చు లేదా ఖర్చు యూనిట్ కు అయ్యే ఖర్చు అని చెప్పగలం. |
ఉత్పత్తులు, సేవలు లేదా డిపార్ట్ మెంట్ లకు అయ్యే ఖర్చు వస్తువులకు పరోక్ష ఖర్చులు అదనంగా ఆపాదించబడతాయి. |
ప్రత్యక్ష ఖర్చులు ప్రధాన ఖర్చులో భాగంగా ఉంటాయి. |
పరోక్ష ఖర్చులను సాధారణంగా ఓవర్ హెడ్ లుగా పరిగణిస్తారు. |
విక్రయించిన వస్తువుల ఖర్చును లెక్కించేటప్పుడు ప్రత్యక్ష ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటారు. |
విక్రయించిన వస్తువుల ఖర్చును లెక్కించేటప్పుడు పరోక్ష ఖర్చులు చేర్చబడవు. |
ట్రేడింగ్ ఖాతాలో ప్రత్యక్ష ఖర్చులు సాధారణంగా ట్రేడింగ్ ఖాతా యొక్క డెబిట్ వైపు నమోదు చేయబడతాయి. |
లాభం మరియు నష్టం వచ్చే పరోక్ష ఖర్చులు ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపు నమోదు చేయబడతాయి. |
ప్రత్యక్ష ఖర్చులు అనివార్యమైనవి. గూడ్స్ లేదా సేవలను ఆపరేట్ చేయడం మరియు అందించడం కొరకు విధిగా ఈ ఖర్చులు చేయాలి. |
పరోక్ష ఖర్చులు అనివార్యమైనప్పటికీ, పరోక్ష ఛార్జీల మొత్తం ఖర్చును తగ్గించడానికి వాటిని తగ్గించడం లేదా వాటిలో కొన్నింటిని కలపడం సాధ్యమవుతుంది. |
వ్యాపారం యొక్క స్థూల లాభాన్ని తెలుసుకోవడానికి ఇది లెక్కించబడుతుంది. |
వ్యాపారం యొక్క నికర లాభాన్ని తెలుసుకోవడానికి ఇది లెక్కించబడుతుంది. |
ఉత్పత్తి యొక్క వాస్తవ ఖర్చును అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం |
వ్యాపారం యొక్క ఆదాయ ప్రకటనను అర్థం చేసుకోవడానికి ఇవి చాలా ముఖ్యం. |
ప్రత్యక్ష వ్యయాల ఉదాహరణలు - కార్మిక వేతనాలు, ముడి పదార్థాల ఖర్చు, ఫ్యాక్టరీ అద్దె మొదలైనవి. |
పరోక్ష వ్యయాల ఉదాహరణలు- ప్రింటింగ్ మరియు స్టేషనరీ బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, లీగల్ ఛార్జీలు మొదలైనవి. |
ముగింపు
ఎలాంటి ఖర్చులు లేకుండా ఒక సంస్థను నడపడం అసాధ్యం. డబ్బు సంపాదించడానికి మీరు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల, మీరు పరోక్ష మరియు ప్రత్యక్ష ఖర్చులను సరిగ్గా కేటాయించాలి. మీరు ఉత్పత్తి ఖర్చులను తగ్గించాల్సి వస్తే, దీర్ఘకాలంలో డబ్బును ఆదా చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది. ఒకరి వ్యాపారం యొక్క స్వభావం ఆధారంగా ఖర్చులు ఎలా విభజించబడతాయో అర్థం చేసుకోవడం తెలియాలి. ఒక వ్యాపారం పరోక్ష మరియు ప్రత్యక్ష ఖర్చుల జాబితాను కూడా ముందుగా తయారు చేయాలి. మీరు మీ వ్యాపార నమూనాను రూపొందించడం ప్రారంభించడానికి ముందు, వ్యాపారంలో ఇమిడి ఉన్న అన్ని ప్రత్యక్ష మరియు పరోక్ష ఖర్చులను మీరు అర్థం చేసుకోవాల్సిందే.
వివిధ ఖర్చులు మరియు అవి ప్రత్యక్ష మరియు పరోక్ష ఖర్చులుగా వివిధ ఉదాహరణలతో ఎలా విభజించబడ్డాయో ఈ ఆర్టికల్ ద్వార మీకు అర్థం అయి ఉంటుందని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా, ట్రేడింగ్ ఖాతాలో ప్రత్యక్ష ఖర్చులను చూపే విధానం మరియు లాభ నష్టాల ఖాతాలో పరోక్ష ఖర్చులను చూపే విధానానికి సంబంధించిన సమాచారం మీకు సహాయపడిందని నమ్ముతున్నాం.
దీనిని కూడా చదవండి: భారత ఆర్థిక వ్యవస్థపై జిఎస్ టి ప్రభావం
తరచుగా అడిగే ప్రశ్నలు
1. బ్యాలెన్స్ షీట్/లాభం మరియు నష్టంలో ప్రత్యక్ష ఖర్చులు ఎలా చూపబడతాయి?
జవాబు. ట్రేడింగ్ అకౌంట్ లో ప్రత్యక్ష ఖర్చులు సాధారణంగా డెబిట్ వైపు రికార్డ్ చేయబడతాయి.
2. లాభ నష్టాల ఖాతాలో, పరోక్ష ఖర్చులు ఎక్కడ పెడతాం?
లాభం మరియు నష్టం ఖాతాలో పరోక్ష ఖర్చులు డెబిట్ వైపు నమోదు చేయబడతాయి.
3. వ్యాపార రంగంలో వేతనాలను ప్రత్యక్ష లేదా పరోక్ష ఖర్చులుగా మనం ఎలా పరిగణిస్తాం?
వేతనాలను ప్రత్యక్ష ఖర్చుగా తీసుకుంటారు.
4. కంపెనీ యొక్క నికర లాభాన్ని లెక్కించడానికి ఎటువంటి ఖర్చులను ఉపయోగిస్తారు?
కంపెనీ యొక్క నికర లాభాన్ని తెలుసుకోవడం కొరకు పరోక్ష ఖర్చులు లెక్కించబడతాయి.
5. కంపెనీ యొక్క స్థూల లాభాన్ని లెక్కించడానికి ఎటువంటి ఖర్చులను ఉపయోగిస్తారు?
కంపెనీ యొక్క స్థూల లాభాన్ని తెలుసుకోవడం కొరకు ప్రత్యక్ష ఖర్చులు లెక్కించబడతాయి.
6. ప్రత్యక్ష వ్యయాలకు కొన్ని ఉదాహరణలు ఏమిటి?
ముడిపదార్థాల ఖర్చు, శ్రమ వేతనాలు, ఇంధనం మొదలైన వాటి ప్రత్యక్ష ఖర్చుల ఉదాహరణలు.
7. పరోక్ష వ్యయాలకు కొన్ని ఉదాహరణలు ఏమిటి?
టెలిఫోన్ ఖర్చులు, ప్రింటింగ్ మరియు స్టేషనరీ ఖర్చులు, ఆఫీసు అడ్మినిస్ట్రేషన్ ఖర్చులు మొదలైన కొన్ని పరోక్ష ఖర్చుల ఉదాహరణలు.