written by | October 11, 2021

పాలు పంపిణీ వ్యాపారం

×

Table of Content


పాల పంపిణీ వ్యాపారం ప్రారంభించ‌డం ఎలా?

పాల వినియోగానికి ఎప్పటికప్పుడు గిరాకీ పెరుగుతూనే ఉంది. అయితే పాడి పశువుల పెంపకం చెప్పినంత సులభమేమీ కాదు. పశువుల పెంపకంపై ప్రేమ, శాస్త్రీయ అవగాహనతో పాటు అంకితభావంతో కూడిన ఆచరణ తోడైతేనే రంగంలో విజయం సాధించలం. మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్అవకాశాలను పెంచుకుంటూ పోతే డెయిరీ ఫారాన్ని లాభదాయకంగా నిర్వహించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాలు, పాల ఉత్పత్తుల అవసరం ప్రతి కుటుంబానికీ ప్రతిరోజూ ఉంటుంది. పెరుగుతున్న జనాభాతో పాటు పట్టణీకరణ, ప్ర కొనుగోలు సామర్థ్యం పెరగడంతో పాలు, పాల ఉత్పత్తులకు నిరంతరం డిమాండ్పెరుగుతోంది. నేపథ్యంలో పాడి రైతులతో పాటు, ఔత్సాహికులు, నిరుద్యోగ యువత ముందుకు చ్చిన మేలు జాతి ఆవులు లేదా గేదెలతో పాడి పరిశ్రమ ఏర్పాటుకు ఉత్సాహం చూపిస్తున్నారు

పాడి రిశ్ర చేపట్టేముందు గమనించాల్సిన ముఖ్యాంశాలు

  1. పాడి పశువుల పెంపకంపై అమితమైన ఆసక్తిఆశావహ దృక్పథం, 2. వసతులుగిన వనరులు, 3. మేలుజాతి పాడి పశువులు, 4. పాడి పశువుల మేపుద‌, 5. ఖర్చు తగ్గింపుతో పాటు ఉత్పత్తి పెంపు, 6. పశు ఆరోగ్య గ్రసంరక్షణ, 7. పునరుత్పత్తి యాజమాన్యం, 8. దూడల పోషణ, 9. రిశుభ్రమైన పాల ఉత్పత్తి, 10. పాలు, పాల ఉత్పత్తుల మార్కెటింగ్పై అవగాహ లిగివుండాలి

ఈ పరిశ్రమను ఎవ‌రు చేపట్టవచ్చు?

డెయిరీ ఫారాన్ని సంపన్నులు, నిరుపేదలు, పురుషులు, స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలు, స్త్రీలు, ప్రగతిశీల రైతులు, విశ్రాంత ఉద్యోగులు, సహకార సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు, నిరుద్యోగులు ఇలా ఎవరైనాసరే చేపట్టవచ్చు. అయితే రిశ్రలో వ్యస్థాపకునికి పాడి పశువుల పోషణపై ఆసక్తి, వాటిని ప్రేమించే స్వభావం ఉండాలి. పాడి పశువుల పెంపకం చేపట్టబోయే ముందు కొన్నయినా డెయిరీ ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. రెండు నుంచి 10 పాడి పశువుల వరకు నివారిపై ఆధారపడకుండా స్వయంగా కుటుంబమే నిర్వహించుకునేందుకు సంసిద్ధులై ఉండాలి. గడ్డి కోయడం దగ్గర నుంచి పాలు పితకడం వరకు అన్ని పనులను నేర్చుకోవాలి. ఒత్తిడులను ఎదుర్కొనేలా మనో నిబ్బరం కలిగి ఉండాలి.

తెలుసుకోవాల్సిన విషయాలు

పాడి పరిశ్రమ నెలకొల్పే ముందు లాభాల బాటలో నడుస్తున్నడెయిరీకి స్వయంగా వెళ్లి, అక్కడ పనులు జరుగుతున్న తీరును, సమస్యలను క్షుణ్ణంగా, శ్రద్ధగా గమనించాలి. సందేహాలను తీర్చుకోవాలి. వినడం కన్నా చూడటం ద్వారా త్వరగా గినంత విషయ పరిజ్ఞానం కలుగుతుంది. పాడి పరిశ్రమను నెలకొల్పే ప్రదేశాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు అనేక విషయాలను గుర్తుంచుకోవాలి. రవాణా సౌకర్యం, రోడ్డు సౌకర్యం, విద్యుత్సదుపాయం ఎలా ఉందో చూసుకోవాలి. నీటి లభ్యత, బోరు, పశుగ్రాసం పెంపకానికి తగినంత భూమి సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవే కాకుండా చుట్టూ కంచె నిర్మించడం, పనివారి లభ్యతను కూడా చూసుకోవాల్సినఅవసరం ఉంది. ప్రతి సంకరజాతి ఆవు లేదా ముర్రా గేదెకు రోజుకు 75–80 లీటర్ల నీరు అవసరముంటుంది. వేసవిలో ఇది వంద లీటర్ల కూ పెరవచ్చు. పాడి పరిశ్రమను పెట్టాలనుకునే వారు ప్రాంతంలో ఆవు పాలకు గిరాకీ ఉందా లేదా గేదె పాలకు గిరాకీ ఉందా అనే విషయాలను తెలుసుకుని గిననిర్ణయం తీసుకోవాలి. గేదె పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుచిగా ఉంటాయి. అందువల్ల చాలా ప్రాంతాల్లో గేదె పాలకు గిరాకీ ఉంటుంది.

10 ఆవులు లేదా గేదెలకు ఎంత భూమి అవసరం?

ఒక్కో గేదె లేదా ఆవుకు 32 చదరపు అడుగుల స్థలం అవసరమవుతుంది. ప్రతి 5 పాడి పశువులకు పశుగ్రాసాల సాగుకు ఒక ఎకరా భూమి, ఇతర వసతులకు 300 చదరపు గజాల స్థలం ప్పనిసరిగా అవవుతుంది. 10 ఆవులు లేదా గేదెల పెంపకానికి కనీసం రెండెకరాల భూమి ఉండాలి. షెడ్డు నిర్మాణానికి, ఇతర అవసరాలకు మరో పది కుంటలు లేదా పావెకరం భూమి అవసరమవుతుంది.

సంకర జాతి ఆవులు లేదా గేదెలు ఎక్కడ దొరుకుతాయి?

హెచ్‌.ఎఫ్‌., జెర్సీ సంకర జాతి ఆవుల్లో పాల దిగుబడి అధికంగా ఉంటుంది. ఇవి కర్ణాటక, తమిళనాడులలోని చింతామణి, కోలార్, బెంగళూరు సబర్బన్ప్రాంతాలు, చిత్తూరు జిల్లాలో విరివిగా భ్యవుతాయి. ఇవి రోజుకు 12 నుంచి 24 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి. వీటి ధర మార్కెట్లో రూ. 65 వేల నుంచి లక్షపైన ధర కూ పలుకుతాయి. గ్రేడెడ్ముర్రా, ముర్రా అనేవి మేలైన సంకర జాతి గేదెలు. ముర్రా జాతి గేదెలు రోజుకు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తాయి. వీటి ధర మార్కెట్లో రూ. 75 వేల నుంచి లక్ష కూఉండచ్చు. గ్రేడెడ్ముర్రా గేదెలు భీమవరం, ఉండి, కంకిపాడు, మాచర్ల ప్రాంతాల్లో భ్యవుతాయి. ముర్రా జాతి గేదెలు హరియాణాలోని రోహ్తక్, గుజరాత్లోని మెహసన ప్రాంతాల్లో కొనుగోలు చేయచ్చు.

అనుబంధ వ్యాపారాల‌కు అవ‌కాశ‌ముందా?

పాడి పశువులను పెంచే రైతులు ఎక్కువగా పాల వ్యాపారానికే పరిమితమవుతుంటారు. అయితే, పెరుగు, వెన్న, నెయ్యి, క్రీమ్వంటి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మగలిగితే రెండింత ఆదాయం పొందవచ్చు. అంతేకాదు.. పేడతో గోబర్గ్యాస్, వర్మీ కంపోస్టు వంటివి తయారు చేసి విక్రయించచ్చు. పాల శీతలీకరణ, పాల సేకరణ, దూడల పెంపకం మొదలైనవి కూడా చేపట్టవచ్చు.

పశుగ్రాసాలు ఎలా పెంచాలి?

అనేక రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవడం ద్వారా పోషక లోపం లేని రీతిలో పాడి పశువులను పెంచుకోవచ్చు. డెయిరీ ఫారం ప్రారంభానికి రెండుమూడు నెలలు ముందు నుంచే పశుగ్రాసాల సాగు చేపట్టాలిగట్ల వెంబడి పశుగ్రాసంగా పనికి వచ్చే సుబాబుల్, స్టైలో వంటి జాతుల చెట్లు పెంచుకోవడం ఉత్తమం

ఎవరిని సంప్రదించాలి?

పాడి పరిశ్రమను స్థాపించదలచిన వారు మొదట బ్యాంకు, బీమా కంపెనీ, పశువైద్య నిపుణులను సంప్రదించి సత్సంబంధాలు ఏర్పరుచుకోవాలి. పాల వినియోగదారులైన హాస్టళ్లు, హోటళ్లు, ఆసుపత్రులతోపాటు సమీప ప్రాంతాల్లోని సాధారణ పాల వినియోగదారులతో, పాల ఉత్పత్తిదారుల సంఘాలతో సంప్రదింపులు పాలి

డెయిరీ ఫారం పెట్టే రైతులకు శిక్షణ ఎవరిస్తారు?

స్థానిక పశు సంవర్థక శాఖ అధికారులు, వెటర్నరీ విశ్వవిద్యాలయాలతోపాటు జాతీయ డెయిరీ పరిశోధనా సంస్థకర్నాల్, జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డుఆనంద్, భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ఫెడరేషన్‌– పుణే దితసంస్థలు మేలు జాతి పాడి పశువుల పోషణ విషయంలో రైతులకు శిక్షణ ఇస్తున్నాయి.

పాడి ప‌రిశ్ర‌మ‌లో ఇవి ముఖ్యం:

మేపు రికార్డులు: పశువులకు ఎంత మేత వేస్తున్నదీ ఒకచోట రాసి పెట్టుకోవాలి.

ఆరోగ్య సంబంధ రికార్డులు: పశువుల ఆరోగ్య రక్షణకు ఎప్పుడెప్పుడు ఏమేమి మందులు వాడిందీ నోట్ చేసుకోవాలి.

పునరుత్పత్తి రికార్డులు: ప్రతి పశువు ఎదకు వచ్చిన తేదీ, కృత్రిమ గర్భధారణ చేయించిన తేదీ, శువు ఈనిన తేదీ తదితర వివరాలను రాసుకోవాలి.

ఆర్థిక రికార్డులు: రోజువారీగా రాబడి, ఖర్చుల వివరాలను ప్పనిసరిగా మోదు చేసుకోవాలి.

పాల ఉత్పత్తి రికార్డులు: ఒక్కో పశువు రోజుకు ఎన్ని పూటలు, మేరకు పాలు ఇస్తున్నదో నించాలి.

రుణాలు.. సబ్సిడీలు..

పాడి పశువుల పెంపకాన్ని ప్రారంభించే బలహీన వర్గాల వారు రుణాలు, సబ్సిడీలపై సమాచారం కోసం దగ్గర్లోని సహకార పాల ఉత్పత్తిదారుల సంఘాలను లేదా సంబంధిత ప్రభుత్వ శాఖలు/కార్పొరేషన్ల అధికారులను సంప్రదించాలి. డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్, ట్రైబల్కోఆపరేటివ్ఫైనాన్స్కార్పొరేషన వంటి సంస్థలను కూడా సంప్రదించాలి. జనరల్అభ్యర్థులు బ్యాంకులను సంప్రదించి రుణం పొందవచ్చు. ప్రాజెక్టు వ్యయంలో 75శాతం మొత్తాన్ని బ్యాంకు రుణంగా ఇస్తుంది. విషయాలన్నిటినీ అర్థం చేసుకొని మేలు జాతి పాడి పశువుల పెంపకం చేపట్టి, మార్కెటింగ్అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ద్వారా డెయిరీ ఫారాన్ని అత్యంత లాభదాయకంగా నిర్వహించుకోవచ్చు.

పశువుల షెడ్డు నిర్మించేదెలా?

డెయిరీ ఫారం పెట్టాలనుకునే వారు గిన స్థలాన్ని ఎంపిక చేసుకునే ముందు రవాణా, విద్యుత్తు, నీటి లభ్యత, మార్కెటింగ్సదుపాయాలను దృష్టిలో ఉంచుకోవాలి. పశువుల షెడ్డు తూర్పు పడమర దిశగా ఉంటూ గాలి, వెలుతురు ఉండేలా, కాస్త ఎత్తులో ఏర్పాటుచేసుకోవాలి. డెయిరీ ఫారం చుట్టూ పశుగ్రాసానికి అక్కరకు వచ్చే చెట్లు పెంచాలి. షెడ్డును సులభంగా కడగడానికి నీళ్లు కొట్టే ప్రెషర్పంపును ఏర్పాటు చేయాలి. మేత వృథా కాకుండా చూసుకోవడానికి పచ్చి మేతను ముక్కలు చేసి సిద్ధం చేసుకోవాలి.

ముద్రా ప‌థ‌కం ద్వారా

ప్రభుత్వం ముద్రా కం కింద పాల బిజినెస్ కు రుణం కూడా ఇస్తుంది. మిల్క్ యూనిట్ ను ఏర్పాటు చేయడానికి కనీసం 16 లక్షలు ఖర్చు అవుతుంది. ముద్రా స్కీమ్ కింద కనీసం 10 నుంచి 12 లక్షల వరకు లోన్ వస్తుంది. అంటే మీరు రూ. 4 నుంచి 5 లక్షల వరకు సమకూర్చుకుంటే వెంటనే పాల బిజినెస్ ప్రారంభిచవచ్చు. ఇక.. మిల్క్ యూనిట్ ను ప్రారంభించాక.. పాలతో పాటుగా పెరుగు, మజ్జిగ, నెయ్యి లాంటి వాటిని కూడా విక్రయించవచ్చు. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ ను ఏర్పాటు చేసినా రిపోతుంది. ఇక.. అన్ని ఖర్చులు పోను నెలకు కనీసం లక్ష రూపాయల వరకు వ్యాపారంలో ఈజీగా సంపాదించుకోవచ్చుపాల వ్యాపారం ప్రారంభించాలనుకున్నవారు మీ ప్రాంతంలో ఇదివరకే ఉన్న మిల్క్ యూనిట్లను సంప్రదించండి

నాబార్డు నుంచి రుణం…

పాల వ్యాపారం ప్రారంభించాలనుకునువారు నాబార్డు నుంచి 33 శాతం రాయితీతో రూ.7 లక్షల వరకు రుణం పొందవచ్చు. పాడి పరిశ్రమ అభివృద్ధి పథకం (డీఈడీఎస్‌) కింద ప్రాజెక్టు విలువలో 33.33 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశముంది. 10 పాడి పశువులున్నడైరీ ఫామ్కు పశు సంవర్ధక శాఖ రూ.7 లక్షల వరకు రుణాన్ని అందిస్తోంది. డీఏహెచ్డీ అండ్ ఎఫ్‌, కేంద్రం, నాబార్డు సూచనల ప్రకారం, అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులకు లోబడి రాయితీ అందుతుంది. రుణాలను రైతులు, వ్యక్తిగత సంస్థలు, వ్యవస్థీకృత సంస్థలు, పాల యూనియన్లు, పాల సమాఖ్యలు,ఎన్జీవోలు, స్వయం సహాయక బృందాలు, డైరీ సహకార సంఘాలు మొదలగున వారు తీసుకోవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులు రుణాలను అందిస్తున్నాయి.

డీఈడీఎస్‌ లాభాలు

ప్రాజెక్టు విలువలో 25 శాతం పెట్టుబడి రాయితీగా తిరిగి లభిస్తుంది. పశువుల దూడల పెంపకం కోసం రూ.9 లక్షలు , మిల్కింగ్మెషీన్లు, మిల్కోటెస్టర్సర్బల్క్మిల్క్కూలింగ్యూనిట్ల కొనుగోలు కోసం రూ.20 లక్షల రుణాలు తీసుకోవచ్చు. అలాగే స్వదేశీ పాల ఉత్పత్తుల తయారీ కోసం డైరీ ప్రాసెసింగ్యూనిట్కొనుగోలుకు రూ.13.20 లక్షలు రుణంగా తీసుకోవచ్చు.

ఏయే పత్రాలు కావాలి?

లక్ష రూపాయలకుపైగా రుణం పొందాలంటే రుణగ్రహీతలు తమ భూములకు సంబంధించిన పత్రాలను రుణదాతల వద్ద తనఖా పెట్టాల్సి స్తుంది. అలాగే కుల ధ్రువీకరణ పత్రం, ఏదైనా గుర్తింపు కార్డు, వ్యాపార ప్రణాళిక వివరాలు ర్పించాల్సివుంటుంది. డీఈడీఎస్పథకం లబ్ధిదారులు తమ ప్రాజెక్టు విలువలో కనీసం 10 శాతం పెట్టుబడి రూపంలో పెట్టాలిఏదైనా కారణం చేత తొమ్మిది నెలల్లోగా ప్రాజెక్టు పూర్తికాని పక్షంలో యాజమాన్యానికి రాయితీ అందదు. అలాగే ప్రాజెక్టు కోసం అప్పటికే అందిన సబ్సిడీ కూడా వెనక్కి వెళ్లిపోయే అవకాశాలున్నాయి.

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.