written by khatabook | August 18, 2020

డిజిటల్ పేమెంట్స్ చిన్న వ్యాపారులకు వరంగా ఎలా మారాయి?

×

Table of Content

చిరు వ్యాపారులకు సహాయపడుతున్న ఈ డిజిటల్ పేమెంట్స్, వాటి పనితనం, మరియు వాటి లాభాలు ఏమిటి?

మొబైల్ ఫోనులు, స్మార్ట్ టెక్నాలజీలు, 24/7 ఉండే ఇంటర్నెట్ కనెక్షన్, వినియోగదారులు చేసే షాపింగ్, మరియు చెల్లింపు విధానాలపై బలమైన ప్రభావాన్ని చూపించాయి. మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకు బదులుగా, ప్రస్తుతం మార్కెట్‌లో కూడా లోతైన పరివర్తన చోటుచేసుకుంటుంది. భౌతికంగా నడిచిన వ్యాపారాలన్నీ ఇప్పుడు వినియోగదారులను ఆకర్షించడానికి, వ్యాపారాన్ని పెంచుకోవడానికి మరియు ఖర్చులను తగ్గించుకోవడానికి డిజిటల్ వ్యాపారం పై దృష్టి పెడుతున్నాయి. కారణంగా చిరు, మధ్యతరగతి వ్యాపారులు డిజిటల్ పేమెంట్లను అన్వయించుకొని, తమ వినియోగదారులను ఆకర్షించడానికి అవకాశం దొరుకుతుంది.

వినియోగదారులకు డిజిటల్ మాంద్యమాలపై మక్కువ ఉన్నంత కాలం డిజిటల్ పేమెంట్స్ చిరు, మధ్యతరగతి వ్యాపారులపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ప్రస్తుతం వినియోగదారులు చెల్లింపులకు డిజిటల్ పేమెంట్స్ చేయడానికి ఇష్టపడడం కూడా ఆశ్చర్య పడవలసిన విషయం కాదు. అంతే కాకుండా, డిజిటల్ పేమెంట్స్ స్వీకరించడం ద్వారా ఖర్చులు కూడా తగ్గుతాయి:

  • 57% చిరు, మధ్యతరగతి వ్యాపారాలు క్యాష్ కంటే కార్డు వాడినప్పుడు ఎక్కువ కొనుగోలు చేస్తారని చెప్తున్నారు
  • 45% చిరు, మధ్యతరగతి వ్యాపారాలు డిజిటల్ పేమెంట్స్ స్వీకరించడం ప్రారంభించిన తర్వాత, తమ అమ్మకాలు పుంజుకున్నాయని చెప్పారు

చిరు, మధ్యతరగతి వ్యాపారాలు అమలు చేయగల మంచి డిజిటల్ పేమెంట్స్ పద్ధతులు ఏమిటి?

క్యాష్‌లెస్ పేమెంట్లకు భారతదేశంలో ఆదరణ బాగా పెరుగుతుంది. అందుకని క్రింద వ్యాపారాలు అమలు చేయగల కొన్ని డిజిటల్ పద్దతులను క్రింద పేర్కొంటున్నాము:

బ్యాంకింగ్ కార్డులు:

బ్యాంకింగ్ కార్డులు చాలా సురక్షితమైనవి, స్థిరమైనవి, అలాగే ఇతర పద్ధతులకంటే వినియోగదారులకు మరింత నియంత్రణను ఇస్తుంది. వీటి సహాయంతో స్టోరులో, ఇంటర్నెట్‌లో, మెయిల్ ఆర్డర్స్‌లో, లేదా ఫోన్ ద్వారా కూడా ఆర్డర్ చేయవచ్చు. వీటి సహాయంతో వినియోగదారులు, మరియు విక్రయదారులు కూడా సమయాన్ని ఆదా చేసుకోగలుగుతారు.

USSD:

నిర్మాణాత్మక అనుబంధ సర్వీస్ డేటా (USSD) ఛానెల్ అనేది మీ మొబైల్ ఫోన్ నుండి *99# డయల్ చేస్తే పనిచేసే సర్వీసు. ఈ సర్వీసు ఇంటర్నెట్ లేని ఫోనులలో కూడా, ఈజీగా ఉపయోగించడానికి వీలవుతుంది.

AEPS:

ఆధార సహాయ పేమెంట్ విధానంaka AEPSఆన్‌లైన్ కొనుగోలు సమయంలో AADHAAR ప్రామాణీకరణ లేదా మైక్రో ATM వద్ద బిజినెస్ కరస్పాండెంట్ సహాయంతో ఆర్థిక లావాదేవీలను జరిపించవచ్చు.

UPI:

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ అనేది మన అవసరత, సౌలభ్యాన్ని బట్టి పేమెంట్స్ చేయడానికి, షెడ్యూల్ చేయడానికి సహాయపడే ఒక సర్వీసు. ఈ డిజిటల్ పేమెంట్స్ విధానం బ్యాంక్ లావాదేవులను మరియు కొనుగోలుకు చెల్లింపులను ఒకే ఫోన్ అప్లికేషన్ నుండి చేయడానికి వీలు పడుతుంది.

మొబైల్ వాలెట్లు:

మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డును మీ ఫోన్ మొబైల్ వాలెట్‌కు లింక్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ఈ అద్భుతమైన మొబైల్ వాలెట్ అప్లికేషన్లు ఒక వాలెట్ నుండి మరొక వాలెట్‌కు నగదు బదిలీ చేయడానికి కూడా సహకరిస్తుంది.

పాయింట్ ఆఫ్ సెల్ (POS):

పాయింట్ ఆఫ్ సేల్ (PoS) అంటే అమ్మకం జరిగే స్థలం అని అర్ధం. క్షుణ్ణంగా పరిశీలిస్తే, PoSను వ్యాపారాలు కేవలం వినియోగదారులు చివరిగా చెల్లించడానికి వచ్చే స్థలంగా లెక్కేస్తారు.

ఇంటర్నెట్ బ్యాంకింగ్:

ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఒక ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం, దీని సహాయంతో బ్యాంకులు తమ వెబ్‌సైట్ల నుండే పలు విధాల లావాదేవీలను, ఇతర సర్వీసులను అందించగలవు.

మొబైల్ బ్యాంకింగ్:

ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగానే, మొబైల్ బ్యాంకింగ్ కూడా ఒక బ్యాంకు యొక్క మొబైల్ అప్లికేషన్ సహాయంతో, పలు విధాల సేవలను అందుకోగలరు అలాగే లావాదేవీలను జరిపించగలరు కూడా.

మైక్రో ATMలు:

మైక్రో ATM అనేది వ్యాపార కరస్పాండెంట్లు తక్షణ లావాదేవీలను జరపడానికి ఉపయోగించే పరికరాలు. ఈ మైక్రో ATMలు కేవలం బేసిక్ బ్యాంకింగ్ సర్వీసులను మాత్రమే అందించగలవు.

డిజిటల్ పేమెంట్లు చిన్న వ్యాపారాలకు ఏ విధంగా ఉపయోగపడగలవు:

సాధారణ చెల్లింపులకంటే డిజిటల్ పేమెంట్స్ ఏడూ రెట్లు వేగవంతమైనవి. చిరు, మధ్యతరగతి వ్యాపారాలు ఈ డిజిటల్ విధానాలను అమలు చేసినప్పుడు, వ్యాపార వ్యయం, సమయం ఆదా చేసుకోగలుగుతాయి. అలాగే క్రింద చూపించిన కొన్ని లాభాలను కూడా పొందగలరు:

  • మంచి కస్టమర్ సర్వీస్(e.g., మొబైల్ ఫోన్ నుండే ఎక్కడి నుంచైనా పేమెంట్స్ స్వీకరించడం.)
  • తక్కువ ఖర్చు (e.g., ఎక్కువ మంది జోక్యం ఉండదు, పేపర్ ఖర్చు ఉండదు)
  • రికార్డులు మెయింటైన్ చేయొచ్చు(e.g., విషయం అంతా ఆన్‌లైన్‌లో స్టోర్ చేయొచ్చు)
  • పోటీలో ముందడుగు (e.g., బయట దేశాల మార్కెట్‌లో వ్యాపారాన్ని నడిపించగల అవకాశం)

డిజిటల్ పేమెంట్స్ మీద అంటే, బ్యాంక్ కార్డు, GPay, PayTM మరియు ఇతర మాంద్యమాల ద్వారా చేయబడే చెల్లింపుల పై జరిపిన ఒక సర్వ్ క్రింది విషయాలను తెలిపింది:

మెరుగైన వ్యాపారం:

క్యాష్ పేమెంట్స్ జరిపిన వారితో పోల్చితే, డిజిటల్ పేమెంట్స్ జరిపిన వ్యాపారాలు మరిన్ని ప్రయోజనాలు పొందినట్టు తెలిసింది. ఆ ప్రయోజనాలు ఏమంటే:

వేగవంతమైన ప్రక్రియ:

చాలా వ్యాపారాలు డిజిటల్ పేమెంట్స్ మొదలుపెట్టిన తర్వాత, తమ పేమెంట్స్ ప్రాసెస్ చేయడానికి మరియు వ్యాపారాన్ని మరింత సమర్థవంతంగా నడిపించడానికి వీలైందని తెలుసుకున్నారు.

  • సర్వేలో పాల్గొన్న 82% మంది, డిజిటల్ పేమెంట్స్ మరింత వేగవంతమైనవని అభిప్రాయపడ్డారు.
  • తద్వారా పేమెంట్ చెల్లించే సమయం సాంప్రదాయ విధానాలకంటే 1.4 రెట్లు వేగవంతమని తేలింది.

ఖరీదు:

సాంప్రదాయ విధానాలతో పోల్చితే, చేతులు మారడం మరియు ఇతర భౌతిక పరిమితులు లేనందువల్ల డిజిటల్ పేమెంట్స్ మరియు కార్డు పేమెంట్స్ 3 రెట్లు సమర్ధవంతమైనవి మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్నవని తెలిసింది.

చిరు, మధ్యతరగతి వ్యాపారుల మధ్య జరిగే (B2B) చెల్లింపుల విలువ నేరుగా డబ్బు చెల్లించదానికి చెల్లించే రుసుము మరియు బ్యాంక్ ఫీజుతో పోల్చి చూస్తే, కచ్చితంగా ఎక్కువే. ఇలా నేరుగా చెల్లించే మొత్తాన్ని సులభంగా లెక్కించడం వీలు పడినా, మనం సహజంగా గమనించని, లావాదేవీకి మాత్రమే వర్తించని ఇతర ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది, కారణం చిన్న వ్యాపారాలపై సిబ్బంది సామర్ధ్యం మరియు సమయం ప్రధానమైన కొన్ని సమస్యలలో ఒకటి, కాబట్టి డిజిటల్ పేమెంట్స్ సహాయం ఎంతైనా అవసరం.

చిరు, మధ్యతరగతి వ్యాపారాలు తెసుకోవాల్సిన తరువాతి జాగ్రత్తలు:

మొదటి అడుగు: మీ ఖర్చులు ఎలాంటివనే విషయాన్ని బట్టి ఎటువంటి పేమెంట్స్ సరైనవో గుర్తించాలి.
రెండవ అడుగు: అమలు చేయడానికి అయ్యే ఖర్చు మరియు పేమెంట్ విధానం యొక్క వ్యయాన్ని గుర్తించాలి.
మూడవ అడుగు: ఆమోదయోగ్యమైన ఖర్చుకు అవసరమయ్యే ప్రయోజనాలను అందించగల డిజిటల్ విధానాల వైపు చెల్లింపు ప్రక్రియలను మార్చడం.
నాలుగవ అడుగు: చెల్లింపులను వేగంగా చేయడానికి మార్గాలను చర్చించడానికి సరఫరాదారు మరియు కొనుగోలుదారు కమ్యూనికేషన్.

కస్టమర్లను ఆకర్షించడానికి, చిరు మరియు మధ్యతరగతి వ్యాపారాలు, కస్టమర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించగల, తమకు సమయాన్ని, డబ్బును ఆదా చేయగల, డిజిటల్ విధానాలను అనుసరించి కృషించాలి. ఈ ఆర్టికల్ మీకు ఎంతో కొంత సహాయపడిందని అనుకుంటున్నాము. 

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.