written by khatabook | July 28, 2020

GST ట్రాకింగ్ – ఆన్‌లైన్‌లో మీ అప్లికేషన్ స్టేటస్‌‌ను ఎలా ట్రాక్ చేయాలో తెలుసుకోండి

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (GST), 2017 జులై లో అమలులోకి వచ్చిన ఈ పన్ను, భారతదేశం చవిచూసిన అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణ, 'ఒక దేశం, ఒకటే పన్ను' అనే ఆలోచనతో, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల క్రింద ఉండే సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, రాష్ట్ర VAT, ఎంట్రీ టాక్స్, లగ్జరీ టాక్స్ వంటి పనులన్నీ ఈ GST క్రిందకే వచ్చేలా దీన్ని రూపొందించారు.,  

ఇలా ఎన్నో పరోక్ష పన్నులకు బదులుగా రూపొందించిన ఈ పన్ను వల్ల వ్రాతపని కూడా చాలా వరకు తగ్గింది, అంటే పన్ను కట్టేవారిమీద ఉన్న భారం కాస్త సులవు అయ్యింది. ఈ ఆర్టికల్లో, GST పై అవగాహనను పెంపొందించడానికి కొన్ని ముఖ్యమయిన నిబంధనలు, అంశాలను హైలైట్ చేయడం జరిగింది.

GST రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవసరం అవుతుంది?

ఈ క్రింద చూపించిన జాబితాలో ఉన్న అన్ని వ్యాపారాలు GST రిజిస్టర్ చేసుకోవడానికి బాధ్యులు:

 • ఈ కామర్స్ వ్యాపారాలు, దీనికి టర్నోవర్ తో సంబంధం లేదు.
 • 20లక్షలు, ఆ పైగా టర్నోవర్ వచ్చే అంతర్ రాష్ట్ర వ్యాపారాలు.
 • ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తరాఖంఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మిర్ వంటి రాష్ట్రాలలో 10 లక్షలు, అంతకన్నా టర్నోవర్ ఉండే అంతర్ రాష్ట్ర వ్యాపారం చేసే స్పెషల్ విభాగం వ్యాపారాలు. 

ఒక గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (GSTIN ) అనేది ట్యాక్స్ ఇన్పుట్ క్రెడిట్ విషయమై అవసరం. GST క్రింద నమోదైన ప్రతీ వ్యాపారిని GST ట్యాక్స్ సిస్టం‌లో గుర్తించడానికి ఇవ్వబడే వ్యక్తిగత 15 అంకెల నంబర్ ఇది. ఒకసారి రెజిస్ట్రషన్ పూర్తయితే, ఇది మీకు

ఇవ్వబడుతుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు ఎవరెవరు అర్హులు:

 • తమ వార్షిక టర్నోవర్‌కు సంబంధం లేకుండా ప్రతీ వ్యాపారానికి GSTIN ఉండాలి.
 • వేరు వేరు రాష్ట్రాలలో బహుళ వ్యాపారాలు ఉన్న పక్షాన, వేర్వేరు రిజిస్ట్రేషన్లు తీసుకోవడం తప్పనిసరి.
 • ట్యాక్స్‌‌ను ఆకర్షించే వ్యాపారం చేసే ట్యాక్స్ కట్టే సామాన్య పౌరుడు.
 • ట్యాక్స్ ను ఆకర్షించే వ్యాపారం చేస్తున్న భారతదేశంలో నివసించని ట్యాక్స్ కట్టే పౌరుడు.
 • రివర్స్ ఛార్జి పథకం క్రింద ట్యాక్స్ కట్టవలసిన వ్యక్తులు.

GST కొరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం ఎలా?

ఆన్‌లైన్‌లో ఇప్పుడు GST చెల్లించడం చాలా సులభతరం చేయబడింది. ప్రారంభించడానికి క్రింద ఇవ్వబడిన పాత్రలను సిద్ధం చేసుకోండి:

 • PAN కార్డు
 • ఆధార్ కార్డు
 • బిజినెస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
 • ఇంకార్పొరేషన్ సర్టిఫికెట్
 • బ్యాంక్ అకౌంట్ స్టేట్‌మెంట్
 • డిజిటల్ సంతకం

GST రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ఇలా చేయండి:

 • కంప్యూటర్‌లో బ్రోజర్‌ను తెరిచి, GST పోర్టల్ వెబ్‌సైటుకి వెళ్ళండి.(www.gst.gov.in)
 • లాగిన్ ట్యాబ్‌లో ‘New User’ను ఎంచుకోండి.
 • మీ వ్యాపారానికి సంబంధించిన సంబంధిత GST ఫామ్‌ను ఎంచుకోండి.
 • పత్రాన్ని నింపి GST ఫామ్‌ను సబ్మిట్ చేయండి.
 • ఫామ్‌తో మీరు మరికొన్ని డాకుమెంట్స్‌ను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది.
 • ఒకసారి పూర్తయిన తర్వాత, మీ అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ (ARN) ఆటోమేటిక్‌గా సృష్టించబడుతుంది.

ఈ ARN నంబర్, మీరు GSTIN నంబర్‌‌ను పొందుకొనే వరకు తాత్కాలికంగా ఉపయోగించవచ్చు. ARN నంబర్‌ను మీ రిజిస్ట్రేషన్ ఎంతవరకు వచ్చిందో చూడడానికి ఉపయోగించవచ్చు

ఒకసారి మీ ధరఖాస్తు ఆమోదించబడితే, ఆ తరువాత నుండి లాగిన్ చేయడానికి మీ GSTIN నంబర్‌ను ఉపయోగించవచ్చు.

 • పాస్‌వర్డ్‌ను మీరు రిజిస్టర్ అవ్వడానికి ఉపయోగించిన ఇమెయిల్ అడ్రెస్‌కు పంపడం జరుగుతుంది, ఆ ఇమెయిల్‌ను తెరిచి అక్కడ ఉన్న లింకును నొక్కండి.
 • అక్కడి నుండి మీరు GST పోర్టల్ లాగిన్ పేజీకి మళ్లింపబడతారు.
 • సంబంధిత వివరాలను నింపిన తర్వాత, మీ ఇమెయిల్ అడ్రెస్‌కు పంపించబడిన పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
 • ఒకసారి లాగిన్ చేసిన తర్వాత, అవసరమైతే మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ను మార్చుకోండి.

మీ GST అప్లికేషన్ స్టేటస్‌ను ఎలా తెలుసుకోవాలి?

ఒకసారి GST కొరకు రిజిస్టర్ చేసుకొన్న తర్వాత, మీరు వివిధ విధాలుగా మీ అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు. వాటిలో కొన్ని విధాలను క్రింద చూపించాము.

                                         

GST పోర్టల్‌లో అప్లికేషన్ స్టేటస్‌ను చెక్ చేయడం

GST పోర్టల్‌లో మీ అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందో అప్‌డేట్ చేస్తుంటారు.

 • వెబ్‌సైటును తెరిచి, లాగిన్ చేయండి.
 • అక్కడ ఉన్న జాబితా నుండి ‘Registration’ను ఎంచుకోండి.
 • తర్వాత, ‘Services’, మీద ‘Track Application Status’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.

అక్కడ ప్రస్తుతం మీ అప్లికేషన్ ఏ దశలో ఉన్నాడనే విషయం కనిపిస్తుంది.

అక్కడ మీరు తెలుసుకోవాల్సిన కొని విధాలా అప్లికేషన్ స్టేటస్‌లు ఉంటాయి, అవేవనగా:

 • ARN జెనెరేట్ చేయబడితే – రిజిస్టర్ చేయబడ్డ అప్లికేషన్‌ను సమర్పించిన తర్వాత, తాత్కాలిక రిఫరెన్స్ నంబర్ (TRN) యొక్క స్టేటస్.
 • Pending for processing – మీరు రిజిస్టర్ చేసిన అప్లికేషన్ విజయవంతంగా ఫైల్ చేయబడింది.
 • Provisional – GSTIN యొక్క స్టేటస్, రిజిస్టర్ చేయబడిన అప్లికేషన్ ఆమోదించబడే వరకు, (సాధారణ పన్ను చెల్లించే పౌరుడు) చలాన్ సృష్టించబడడం ప్రారంభమైంది అని అర్ధం.
 • ధ్రువీకరణ పెండింగ్‌లో ఉంది – రిజిస్టర్ చేయబడిన అప్లికేషన్ సబ్మిట్ చేయబడిన తర్వాత ARN జెనెరేట్ చేయబడే వరకు ఈ స్టేటస్ కనిపిస్తుంది.
 • Validation Error – ARN జెనెరేట్ చేయబడే వరకు, సబ్మిట్ చేయబడిన రిజిస్టర్ చేసిన అప్లికేషన్ యొక్క ధ్రువీకరణ విఫలమైతే.

GST పోర్టల్‌లోకి లాగిన్ చేయకుండా మీ అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి

మీరు గనుక GST పోర్టల్‌లోకి లాగిన్ చేయకుండా మీ అప్లికేషన్‌ను సబ్మిట్ చేసి ఉంటే, మీరు మీ ARN నంబర్‌ను ఉపయోగించి ట్రాక్ చేయగలరు.

 • GST పోర్టల్ తెరచి, ‘Registration’, ను ఎంచుకోండి, ఆ తర్వాత 'Services’ను ఎంచుకోండి.
 • అక్కడ ‘Track Application Status’ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి.
 • ఒకసారి తారచిన తర్వాత, ‘Track Application with ARN’ అనే దాని మీద నొక్కండి.
 • మీరు మీ ARN నంబర్ ఎంటర్ చేయడానికి అక్కడ ఒక కాలమ్ కనిపిస్తుంది.
 • మీరు రిజిస్టర్ చేసుకొన్న ఇమెయిల్ అడ్రస్‌కు వచ్చిన ARN నంబర్‌ను ఎంటర్ చేయండి.
 • తర్వాత వచ్చే క్యాప్చ అక్షరాలను నింపి, ‘Search’ మీద నొక్కండి.

GST సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

GST క్రింద నమోదు చేయించుకున్న వారికి GST సర్టిఫికెట్ జారీ చేయబడుతుంది. ఈ సర్టిఫికెట్‌ను వారి వారి వ్యాపార స్థలాలలో చూపించవలసి ఉంటుంది. క్రింది విధంగా GST సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:

 • (www.gst.gov.in) కు లాగిన్ అవ్వండి.
 • తర్వాత ‘Services’, ఆపై ‘User Services’ మీద నొక్కండి.
 • అక్కడ ‘View/Download Certificate’ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
 • ఆ లింక్ మీద నొక్కి మీ ఫైలును డౌన్‌లోడ్ చేసుకోవడమే.

GST సర్టిఫికెట్ చెల్లుబాటు

ఒకసారి జారీ చేయబడిన తర్వాత, GST రిజిస్ట్రేషన్‌ను స్వయంగా రద్దు చేయించుకోవడం, లేదా GST అధికారులు క్యాన్సిల్ చేస్తేనే తప్ప GST సర్టిఫికేషన్‌కు వ్యవధి ముగిసిపోవడం అంటూ ఉండదు.

ఒకవేళ సాధారణ పౌరుడు, లేదా దేశంలో నివసించని వారు నమోదు చేసుకున్నట్టు అయితే, సర్టిఫికెట్ గరిష్టంగా 90 రోజులు చెల్లుతుంది. ఆ తరువాత మళ్ళీ చెల్లుబాటు వ్యవధిని పెంచుకోవచ్చు.

GST సర్టిఫికెట్‌లో మార్పుల కోసం

ఒకవేళ GST రిజిస్ట్రేషన్‌లో ఏదైనా సమాచారం తప్పు అయితే, పన్ను చెల్లింపుదారులు GST పోర్టల్‌లో దానిని నమోదు సవరించగలరు. ఈ సవరింపును ట్యాక్స్ అధికారులు ఆమోదించవలసి ఉంటుంది.

GST రిజిస్ట్రేషన్‌లో సవరించడానికి వీలు పడే విషయాలు ఏమంటే:

 • వ్యాపారం యొక్క లీగల్ పేరు, PAN కార్డులో మార్పులతో సంబంధం లేకుండా.
 • వ్యాపారం జరిగే స్థలం మారినప్పుడు.
 • వ్యాపారం నడిపించబడే స్థలంలో జారిగే ఇతర మార్పులు (అంతర్గతంగా రాష్ట్రంలోనే ప్రదేశం మార్చినప్పుడు).
 • వ్యాపార బాగస్వాములలో, మేనేజింగ్ డైరెక్టర్లు, ట్రస్టీ సభ్యులు, ప్రధాన అధికారి లేదా సమన అధికారం ఉన్న వారిలో జరిగిన మార్పులు, మొదలైనవి.

ఒకసారి సవరణల అప్లికేషన్ ఆమోదించబడినా, లేదా తిరస్కరించబడినా, మీకు ఇమెయిల్ లేదా ఫోన్ SMS ద్వారా మెసేజ్ వస్తుంది. అలాగే, సవరించబడింది సర్టిఫికెట్ మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది.

mail-box-lead-generation

Got a question ?

Let us know and we'll get you the answers

Please leave your name and phone number and we'll be happy to email you with information

Related Posts

None

ఎక్సెల్ మరియు వర్డ్ లో జాబ్ వర్క్ కొరకు డెలివరీ చలాన్ ఫార్మెట్


None

మన దేశంలో ఉన్న వివిధ రకాల GST - SST, CGST, IGST మధ్య తేడా ఏంటి?


None

మీరు ఒక సర్టిఫైడ్ GST ప్రాక్టీషనర్ ఎలా అవ్వగలరు?


None

ఈ-వె బిల్లు అంటే ఏమిటి? ఈ-వె బిల్లును జనరేట్ చేయడం ఎలా?


None

GST నంబర్: ప్రతీ వ్యాపారానికి కావాల్సిన 15 అంకెల నంబర్

1 min read

None

GST ఇన్వాయిస్ ఎక్సెల్ - మీ కంప్యూటర్ నుండే GST అర్హమైన ఇన్వాయిస్‌లను తయారు చేయండి

1 min read

None

డిజిటల్ పేమెంట్స్ చిన్న వ్యాపారులకు వరంగా ఎలా మారాయి?

1 min read

None

చాలా తక్కువ పెట్టుబడితో 2021లో నడిపించగల 15 ఆన్‌లైన్ వ్యాపారాలు

1 min read

None

MahaGST – మహారాష్ట్రలో GST కోసం ఆన్‌లైన్ పోర్టల్

1 min read