చిన్నస్థాయిలో నిర్వహించే వ్యాపార ఐడియాలు
ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నగరంలో జీవన విధానాలు చాలా బిన్నంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. రోజువారీ పనులతో నగరాలు నిత్యం జనసందోహంతో నిండివుంటాయి. అభివృద్ధితో పాటు ప్రజల జీవనంలో కూడా చాల మార్పులు చోటుచేసుకున్నాయి. మీరు ఏదైనా చిన్న వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే, ఇంట్లో ఉండి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందుకు మంచి వ్యాపార ఆలోచనలు ఉండటమే ముఖ్యం. దానితో పాటు వ్యాపారానికి ఒక గుర్తింపు ఎలా తీసుకురావాల్సి ఉంటుంది. మార్కెటింగ్ ఎత్తుగడలు, కస్టమర్ కేర్ సేవలు అనే వాటిపై పూర్తి అవగాహన అవసరం. భారతదేశంలో ఇప్పుడు చిన్న వ్యాపారాలను చాలా సులువుగా నడిపించేందుకు అవకాశాన్ని ఇంటర్నెట్ కల్పించింది. మీరు అనవసరంగా సామగ్రి కొనుగోలు చేయడం, అద్దెలు కట్టడం, పెట్టుబడి వంటి వాటి గురించి అంతగా ఆలోచించాల్సిన పనిలేదు. మీరు తగిన స్వయం ఉపాధిని ఏర్పరచుకుంటే ఆదాయ మార్గం ఏర్పడుతుంది. మీ సొంతంగా వ్యాపారాన్ని మొదలుపెడితే మీకు మీరే బాస్ అవుతారు.
ఈవెంట్ మేనేజర్:
మీరు ఈవెంట్ మేనేజర్‌గా పనిచేయవచ్చు, మీరు మంచి సమన్వయకర్త అయితే ఒకే సమయంలో బహుళ విధాల పనిని నిర్వహించవచ్చు. ఈరోజు అనేక కార్పొరేట్ మరియు ఎస్ఎంఈ ఆప్ట్ ఈవెంట్ మేనేజింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
మ్యాచ్ మేకర్ లేదా వెడ్డింగ్ ప్లానర్:
చాలా మంది వివాహ సంబంధాల కోసం మ్యాచ్ మేకర్ లేదా పెళ్లి ప్లానర్‌ను నియమించుకుంటారు. కాబట్టి ఈ బిజినెస్ మొదలుపెట్టడం అద్భుతమైన ఆలోచనగా భావించవచ్చు. ఈ వ్యాపారానికి చిన్న మొత్తంలో పెట్టుబడి అవసరం.పెళ్లి ప్రణాళికకు సంబంధించిన వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి.
కేటరింగ్ బిజినెస్:
చాలామంది క్యాటరింగ్ సేవల కోసం ఎదురుచూస్తుంటారు. అంతేకాకుండా మన దేశంలో తరచూ పండుగలు జరుగుతుంటాయి. అటువంటి సందర్భాల్లో క్యాటరింగ్ సేవను అందించడం వలన ప్రయోజనం పొందవచ్చు. అందుకే మంచి వ్యాపార ఆలోచనగా చెప్పుకోవచ్చు. వ్యాపారాన్ని పెంచుకుటూ పోతే మంచి లాభాలతో ముందుకు సాగవచ్చు.
టైలరింగ్ వ్యాపారం:
టైలరింగ్ వ్యాపారం చాలా లాభదాయకమైన వ్యాపార ఆలోచన. టైలరింగ్‌లో నైపుణ్యం సంపాదించిన తరువాత, మీరు ఈ వ్యాపారాన్ని కేవలం ఒక కుట్టు యంత్రంతో మొదలు పెట్టవచ్చు. ఉద్యోగుల వలే టైలర్లను నియమించుకుని, పెద్ద టైలరింగ్ షాప్ మాదిరిగా విస్తరించవచ్చు.
రెస్టారెంట్ / ఆహార ట్రక్:
ఆహార ప్రియులు వారి ఆర్థిక పరిస్థితిని అనుసరించి ఏదోఒకటి తినడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా నగరాల్లో ఆహార ప్రియుల సంఖ్య అధికంగానే ఉంటుంది. అందువల్ల ఒక ఈటరీ లేదా ఒక రెస్టారెంట్ పెట్టడం అత్యంత విజయవంతమైన మరియు లాభదాయకమైన వ్యాపార ఆలోచనలో ఒకటి. అంతేకాకుండా మీ రెస్టారెంట్‌కు అనుబంధంగా ఫుడ్ ట్రక్ ఏర్పాటు చేసుకుని, వివిధ ప్రదేశాలలో వ్యాపారం నిర్వహించవచ్చు.
పౌల్ట్రీ వ్యాపారం:
పౌల్ట్రీ వ్యాపారం మొదలు పెట్టడానికి, మీకు పెట్టుబడి, భూమి మరియు వస్తు సామగ్రి అవసరం. అయితే, మీరు దీనిని చిన్నపాటి పెట్టుబడి ద్వారా కూడా ప్రారంభించవచ్చు. నెమ్మదిగా వ్యాపారాన్ని పెంచుతూ పెద్ద ఎత్తున విస్తరించుకోవచ్చు.
స్వీట్ షాప్:
స్వీట్ షాప్ లాభదాయకమైన వ్యాపారం. స్వీట్స్‌కు నగరాల్లో మంచి ఆదరణ ఉంటుంది. ఇది మంచి వ్యాపార ఆలోచన.. అయితే మీరు ఈ రంగంలో చాలా పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. నాణ్యత మరియు రుచికి ఆహారప్రియులు ఒక్కసారి అలవాటు పడ్డారంటే మీరు ప్రారంభించిన వ్యాపారంలో విజయం సాధించినట్లే.
కెరీర్ కౌన్సిలింగ్:
లక్షల మంది యువకులు మరియు వారి తల్లిదండ్రులు వివిధ కెరీర్ ఎంపికల గురించి గందరగోళానికి గురవుతుంటారు. మీకు తెలిసిన వివిధ కెరీర్ ఎంపికల గురించి పరిశోధించి, వారికి కెరీర్ కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా కూడా ఆదాయాన్ని సంపాదించవచ్చు.
సెక్యూరిటీ ఏజెన్సీ లేదా డిటెక్టివ్ ఏజెన్సీ: –
సెక్యూరిటీ మరియు భద్రతకు నేటి రోజుల్లో ఎంతో ప్రాధాన్యత పెరిగింది. చాలామంది ఇటువంటి సేవల కోసం కోసం డబ్బు ఖర్చు వెచ్చించటానికి సిద్ధంగా ఉన్నారు. మానవ వనరులను అందించేందుకు లేదా డిటెక్టివ్ ఏజెన్సీ ప్రారంభించడానికి భద్రతా సంస్థను మొదలుపెట్టడం మంచి వ్యాపార ఆలోచనగా చెప్పుకోవచ్చు.
భీమా కన్సల్టెంట్ లేదా ఏజెంట్:
ప్రస్తుత రోజుల్లో చాలామంది వ్యక్తులు భీమా సదుపాయాల కోసం సలహాల కోసం ఎదురు చూస్తుంటారు. మీరు పార్ట్ టైమ్ బిజినెస్ మొదలు పెట్టినట్లయితే, భీమా సలహాదారుగా లేదా కన్సల్టెంట్ గా పనిచేయడమనేది మంచి ఆలోచనగా గుర్తించండి.
చాక్లెట్ మేకర్:
ఇది మహిళలు సైతం నిర్వహించగల వ్యాపారం. ఈ చాక్లెలెట్లను ప్రపంచం మొత్తం ప్రేమిస్తుంది. వివిధ ఆకృతులలో చాక్లెట్లు చేయగలిగతే, మీ చేతుల్లో మంచి వ్యాపార కళ ఉన్నట్లే. చాక్లెట్లను చాలామంది ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు చాక్లెట్లను అమితంగా ఇష్టపడతారు.
బేబీ సిట్టింగ్ మరియు వంట సేవ:
వ్యాపార ధోరణితో చిన్న పిల్లలని చూసుకోవటం మరియు వంట చేయటం అనేవిమంచి ఆలోచనలే. నగరాల్లో చాలా మంది ఉద్యోగ విధుల్లో తలమునకలై ఉండటం వలన వారికీ ఇంట్లో పని చేసుకోవడంసాధ్యం కాదు. అటువంటి వారి కోసం ఇటువంటి సేవలు చేసి డబ్బు సంపాదించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
పర్యాటక గైడ్ / టూర్ ఏజెంట్:
నగరాల్లోని ప్రసిద్ధ చారిత్రక భవనాలను సందర్శించాలని చాలామంది తపన చెందుతుంటారు. వీటికి పర్యాటకులు ఆకర్షితులవుతుంటారు. మీరు నగరాల్లో నివసిస్తుంటే, ఆ ప్రాంతంలోని పర్యాటక ప్రాంతాల వివరాలను తెలుసుకుని పర్యాటక గైడ్ లేదా టూర్ ఏజెంట్‌గా మారవచ్చు. ఈ వృత్తిలో రాణిస్తే, సంవత్సరానికి రూ. 50,000 కంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఫార్మసీ:
ఒక ఫార్మసీని ఏర్పాటు చేయడానికి లైసెన్స్ అవసరం తప్పనిసరి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు చాలా పెట్టుబడి అవసరం. మార్కెట్లో చాలా పోటీ ఉంది. కానీ నిరంతరం జరిగే వ్యాపారాల్లో ఫార్మసీ అనేది అతి ముఖ్యమైనది. అందుకే ఇటువంటి వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఐడియా ఎంతో ఉత్తమమైనదని గ్రహించండి.
సెకండ్ హ్యాండ్ బుక్ షాప్:
బుక్ షాప్స్ అనేవి పుస్తక ప్రియులను అమితంగా ఆకర్షిస్తుంటాయి. పాత పుస్తకాలను సేకరించి దాని ద్వారా మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఒక చిన్న బుక్ షాప్ ఏర్పాటు చేయవచ్చు. అలాగే ఆ దుకాణంలో గ్రీటింగ్ కార్డులు, మేగజైన్లు కూడా విక్రయిస్తూ మంచి ఆదాయం పొందవచ్చు.
వాహనాలను అద్దెకివ్వడం:
ఒక ఆసక్తికరమైన వ్యాపార ఆలోచన వాహనాలను అద్దెకివ్వడం. మీరు సైకిళ్ళు, కార్లు, మోటార్ సైకిళ్ళు వంటి వాహనాలను వినియోగదారులకు అద్దెకు ఇవ్వవచ్చు. ఈ వ్యాపారం మంచి లాభదాయకం ఉంటుంది.
డ్రాప్‌షిప్పింగ్
మీరు ఒకవేళ ఆన్‌లైన్‌లో వస్తు అమ్మకాలు చేయాలని అనుకుంటే, పెట్టుబడికి సరిపడా నగదు లేదని ఆలోచిస్తుంటే, ఇది మీకోసమే. డ్రాప్ షిప్పింగ్ అనే ఈ–కామర్స్ వ్యాపార మోడల్ ద్వారా మీరు ఒక ఆన్లైన్ దుకాణాన్ని తయారుచేసుకొని, వస్తువులు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్న వారితో భాగస్వామ్యం తీసుకుని, వాటిని వినియోగదారుల వద్దకు చేరవేయవచ్చు.
తర్జుమా
మీకు భాష మీద పట్టు ఉంటే, మీరు అప్ వర్క్, ఫ్రీలాన్సర్ వంటి వాటిలో అకౌంట్ క్రియేట్ చేసుకుని, అక్కడ మీ భాషా ప్రావీణ్యాన్ని చూపించండి. అనువాదం చేయించుకునే కంపెనీలకు అప్లై చేసి, మీకు మీరే చాలా పని సంపాదించుకోవచ్చు.
సోషల్ మీడియా కన్సల్టెంట్
మీరు సృజనాత్మకంగా రాయగలగి, సోషల్ మీడియాలో మీ కంటెంట్ ట్రెండింగ్‌లో ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలిసుండీ, సోషల్ మీడియాకి సంబంధించిన వృత్తిని ఎంచుకోవాలనుకుంటే, ఇది మీకోసమ. మీకు సోషల్ మీడియాలో ఉండే చిక్కుల గురించి, జెన్యూన్ ఫాలోవర్లను ఎలా సంపాదించాలో అవగాహన ఉంటే, మీరు నిరభ్యంతరంగా ఈ రంగంలో కాలుమోపవచ్చు.
వెబ్ డిజైనర్
మీకు వెబ్‌సైట్‌లు రూపొందించడం చేయడం వస్తే, మీకు ఇక తిరుగే లేదు. ప్రస్తుతం చాలా మంది చిన్నగా వ్యాపారాలు మొదలుపెడుతున్నారు. వారందరికీ వెబ్సైట్ల అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఆ రంగంలో దూసుకుపోండి. ఇక మీకు డబ్బులకు ఇబ్బంది ఏర్పడదు.
ఇంటి నుంచే చేసే క్యాటరింగ్ బిజినెస్
మీ వంట అద్భుతంగా ఉంటుందా? అయితే వంటలపై మీకున్న అభిరుచినే ఆదాయంగా మార్చుకోండి. ఆన్లైన్లో మీ చేతివంటలను ఆర్డర్ అందించేలా వ్యాపారం మొదలుపెట్టండి. మీకు ఏది బాగా వస్తుందో, దాని నుండే లాభం సంపాదించడం ప్రారంభించండి.
బ్లాగింగ్
మీకు ఏదైనా ఒక రంగం, లేదా కొన్ని విషయాలపై మంచి అవగాహన ఉన్నవారైతే మీ సొంత బ్లాగు మొదలుపెట్టవచ్చు. వర్డ్‌ప్రెస్ మరియు బ్లాగర్ అని మీరు ఉచితంగా బ్లాగులు సృష్టించడానికి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. మీరు గనుక క్రమంగా, పాఠకులకు ఉపయోగపడే మంచి విషయాలపై రాస్తున్నట్లయితే, అతి త్వరలోనే మీ బ్లాగును సెర్చ్ ఇంజిన్లు మంచి పొజిషన్లో చూపించడం ప్రారంభిస్తాయి. ఆ తర్వాత మీరు గూగుల్ యాడ్‌సెన్స్ సహాయంతో బ్లాగ్‌లో యాడ్స్ నడిపించి సంపాదన మొదలుపెట్టవచ్చు. మీ బ్లాగులో పెట్టిన యాడ్స్ మీద ఎంత మంది క్లిక్ చేశారనే దానిని బట్టి సంపాదన ఆధారపడి ఉంటుంది.
కస్టమ్ బహుమతులు
ఎవరికైనా వారి కోసమే ఏదైనా ప్రత్యేకంగా తయారు చేశారంటే, అది వాళ్లకు ఖచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి మీకు అలాంటివి తయారు చేయడం వస్తే, అంటే టీ షర్టులు, ఫోన్ కేసులు, హూడీలు, బ్యాగులు, కాఫీకప్పులు వంటివి తయారు చేసి, వాటిమీద వాళ్ళకి నచ్చేలా ఏదైనా వాళ్ళ కోసం రాయండి. అప్పుడు వాటిని మీరు మీ ఆన్‌లైన్ వ్యాపారం సహాయంతో అమ్మవచ్చు.
హస్తకళలు
మీరు సృజనాత్మకంగా ఆలోచించే వారైతే, ఇంట్లోనే తయారు చేసుకోగలిగే కాండిల్, సోప్‌లు, కుండలు, బహుమతులు, గ్రీటింగ్ కార్డులు, వంటివి తయారు చేసి ఆన్‌లైన్‌లో అమ్మండి. మీరు మీ సోషల్ మీడియా ద్వారా కూడా వీటిని విక్రయించవచ్చు. మీ ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుంచి, యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా సంపాదించవచ్చు. మీ ఫాలోవర్లను పెంచుకుని, మీ పనికి ఒక గుర్తింపు, పేరు వచ్చేలా చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు.
గ్రాఫిక్ డిజైనర్
మీకు లోగోలు, పోస్టర్లు, బ్రౌచర్లు డిజైన్ చేయడం మీద మంచిపట్టు ఉంటే, మీరు ఆన్‌లైన్‌లో వీటి ద్వారానే వ్యాపారం మొదలుపెట్టవచ్చు. వేర్వేరు కంపెనీలకు, వ్యాపారాలకు డిజిటల్ డిజైన్ తయారు చేసి ఇవ్వండి. మీ అభిరుచిని, మీ నైపుణ్యతను ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోండి.
యాప్ డెవలపర్
ఈరోజుల్లో, మొబైల్ ఫోన్లు, వెబ్‌సైట్‌లను ఓడించి వాటి స్థానాన్ని పెంచుకున్నాయి, ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ప్రతిదీ మొబైల్ అప్లికేషన్ల రూపంలో ఉంటుంది. కాబట్టి మీరు కోడింగ్ చేయగలిగితే, అప్లికేషన్ డెవలప్ చేయడం మొదలుపెట్టండి. మీరు మీ సొంతంగా అప్లికేషన్‌ను తయారుచేయొచ్చు, లేదా ఎవరికైనా కావాలంటే వాటిని చేసిచ్చి డబ్బు సంపాదించవచ్చు.
ఆన్‌లైన్ కంటెంట్ క్రియేటర్
మీకు జోకులు వేసి పక్కనవారిని నవ్వించడం అలవాటా? అయితే, దానినే ఉపాధిగా చేసుకోవచ్చు. మీరు వీడియోలు తయారుచేసి, వాటిని యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇంస్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేయండి. మీ వీడియోలను జనాలు ఇష్టపడి, వాటిని ఎక్కువగా చూస్తూ, లైక్ చేసి, మీ ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు పెరుగుతారు. అప్పుడు మీ ఛానల్లో ప్రకటనలు చేసి, వాటి నుంచి షేర్ తీసుకోవచ్చు. మీ సొంతంగా మీరు పాడ్‌క్యాస్ట్, అంటే ప్రస్తుత తరంలో రేడియో ప్రసారం లాంటిది, దానిని ఏర్పాటు చేసి కథలు కవితలు వంటివి చెప్పవచ్చు. వాటికి ఆదరణ పెరిగిన తర్వాత, అక్కడ కూడా ప్రకటనలు ఇచ్చి డబ్బు సంపాదించవచ్చు.
ఈ-బుక్ రచయిత
రాయడం అంటే అమితమైన ఇష్టం ఉండి, అది మీ అభిరుచి అయితే, దానితోనే ఆన్‌లైన్‌లో వ్యాపారం మొదలుపెట్టండి. మీకు ఏ విషయం లేదా అంశం మీద గట్టిపట్టు ఉండి, నేర్పుగా రాయగలరు అని తెలుసో, దాని మీద మీ నైపుణ్యాన్ని అంతా చూపి, ఒక ఈ–బుక్ తయారు చేయండి. దాని గురించి మీరు సోషల్ మీడియాలో ప్రకటనలు పెట్టి, డబ్బులకి దానిని డౌన్లోడ్ చేసుకునేలా సెట్ చేయండి.
ఆన్‌లైన్ కోచింగ్/ట్యూషన్లు
మీరేదైనా పనిలో నైపుణ్యత కలిగుండి, దానిని ఇతరులకి నేర్పాలనే ఉత్సుకత కలిగి ఉంటే, మీరు ఆన్‌లైన్ క్లాసులు మొదలుపెట్టవచ్చు. ప్రస్తుత కొరోనా పరిస్థితులలో అందరూ ఇంటి నుంచే ఏదోఒకటి నేర్చుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి మీరు యోగా, వంటలు, ఇలా ఏ విషయాన్నైనా నేర్పవచ్చు.
ఆన్‌లైన్ ఫాషన్ బోటీక్
మీకు ఫ్యాషన్ గురించి బాగా తెలుసా? మీకు ఇతరులను అందంగా రెడీ చేయడం ఇష్టమా? అయితే మీరే ఆన్‌లైన్‌లో ఒక ఫ్యాషన్ షాప్ ఒక తెరిచి, మీకొక గుర్తింపును సంపాదించుకోండి. ఆన్‌లైన్‌లో మీరు బట్టలు, అలంకరణ సామన్లను ఈ కామర్స్ ద్వారా అమెజాన్, మిన్‌త్రా, ఫ్లిప్‌కార్ట్ వంటి సైట్‌లలో అమ్మవచ్చు. ఫ్యాషన్ గురించి తెలియని వారికి మీరే ఒక స్టయిలిస్టుగా కూడా సేవలు అందించవచ్చు.