కార్‌వాష్ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి?
కార్‌వాష్ వ్యాపారం దశాబ్దాలుగా కొనసాగుతున్న లాభదాయకమైన వ్యాపారం. కారు ప్రేమికుల సంఖ్య పెరుగుదల మరియు సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కూడా ఈ వ్యాపారం గత కొన్నేళ్లుగా మరింత లాభదాయకంగా మారింది. ఈ వ్యాపారం విజయవంతమైతే ఈ వ్యాపారంలో 50 నుంచి 55 శాతం లాభం ఉంటుంది. కార్‌వాష్ వ్యాపారంలో వాషింగ్, క్లీనింగ్, పూతలు, సర్వీసింగ్ లాంటి అదనపు పనులు కలిగి ఉన్నందున దీనిని మంచి ఆదాయం సమకూర్చే వ్యాపారంగా చెప్పవచ్చు. ఈ కార్‌వాష్ వ్యాపారంలో కారును కడగడానికి మించిన చాలా పనులు ఉన్నాయి. సిబ్బంది నియామకం, వ్యాపారానికి తగిన ప్రాంతం ఎంపిక, లైసెన్సులు, నీటి సరఫరాకు వెసులుబాటు, సాంకేతికత అందిపుచ్చుకోవడం లాంటి అనేక అంశాలు ఈ వ్యాపారంలో కీలకమైనవి.
కార్ వాష్ వ్యాపారంతో లాభాలు:
కార్‌వాష్ వ్యాపారం దీనిని నెలకొల్పే వ్యాపారవేత్తకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అయితే ఈ వ్యాపారంలో కొన్ని ప్రయోజనాలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు వీటి గురించి తప్పక తెలుసుకోవాలి.
కార్ వాష్ వ్యాపారంలో లాభాలు
-
యంత్రాలతో కార్ వాషింగ్
కార్ వాష్ అనేది కారు కలిగివారికి తప్పనిసరి అవసరం. కార్లు కలిగిన చాలామందికి తమ కార్లను శుభ్రం చేయడానికి వారికి తగిన సమయం ఉండదు. అందువల్ల కార్‌వాష్ సేవలు కోరుకునేవారు తగినంత రుసుము చెల్లించి, తమ కార్లను శుభ్రపరచుకోవాలనుకుంటారు.
-
మంచి లాభాలను పొందవచ్చు
ఈ కార్‌వాష్ వ్యాపారంలో స్వల్పకాలంలో లేదా తక్కువ వ్యవధిలో కూడా భారీ మొత్తంలో లాభాలను ఆర్జించేందుకు అవకాశాలున్నాయి. ఈ వ్యాపారంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ప్రాంతం. అలాగే ఈ వ్యాపారంలో మీరు సరైన మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తే ప్రారంభ దశలోనే మీరు లాభాలను అందుకోవచ్చు.
-
కృషికి తగినంత ఆదాయం
మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నప్పుడు, ఈ వ్యాపారం కోసం మీరు చాలా కష్టపడి పనిచేయాలని గుర్తుంచుకోండి. ఈ వ్యాపారంలో గంటల తరబడి పనిచేయడంతపాటు ఆటోమేటిక్ వాష్ వ్యవస్థ సమకూర్చుకోవాలి. ఇది లేనిపక్షంలో శారీరకంగా శ్రమించాల్సివుంటుంది. ఇలాకొంతకాలం శ్రమించిన తరువాత మీ కృషి ఫలిస్తుంది. మీరు మంచి లాభాలను అందుకుంటారు.
కార్ వాష్ వ్యాపారంలో ప్రతికూలతలు
-
మీరు భారీ పోటీని ఎదుర్కోవలసి ఉంటుంది
ఈ వ్యాపారం ప్రారంభించడం సులభం. అధిక పెట్టుబడి కూడా అవసరం లేదు. అందుకే మీరు చాలా తక్కువ ధరలకే అనేక సేవలను అందిస్తున్న చాలా మంది పోటీదారులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువలనే ప్రతి ప్రదేశంలోనూ మీరు ఒకటి లేదా రెండు కార్ వాష్ వ్యాపారాలతో పోటీ పడాల్సివుంటుంది. అందుకే మీ వ్యాపారం కోసం మంచి స్థానాన్ని కనుగొనడంలోనూ మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంటుంది.
మీ వ్యాపారంలో నిర్వహణ సమస్యలు
వ్యవస్థాపకుడు వ్యాపారంలో లాభాలు తగ్గకుండా ఉండటానికి వ్యాపారానికి తగినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలి. ఇది యజమాని యొక్క ప్రధాన బాధ్యత. ఉత్తమమైన కార్‌వాష్ వ్యాపారాన్ని అందుకు తగిన ప్రదేశంలో ఏర్పాటు చేయాలి. అప్పుడే సిబ్బందికి కూడా అనువుగా ఉంటుంది. మీ పోటీదారులకు మించి, మీ కస్టమర్లకు సేవలను అందించడంలో ఎక్కడ లోపం ఉందో మీరు తప్పక తెలుసుకోవాలి. మరియు అటువంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి ఉత్తమమైన మార్గాలను ఎన్నుకోవాలి.
మీ కస్టమర్లను గుర్తించాలి
కార్‌వాషింగ్ సౌకర్యాన్ని విలాసవంతమైన కార్లను కలిగి ఉన్న ఉన్నత తరగతి ప్రజలు మాత్రమే ఇష్టపడేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి మారింది. మధ్యతరగతి ప్రజలు మంచి కార్లను కొనుగోలు చేయడమే కాకుండా, తమ కార్లను సరికొత్తగా కనబడేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం కార్ల మొయింటనెన్స్తో పాటు జాగ్రత్తగా చూసుకోవడానికి అన్ని మార్గాలను అవలంబిస్తున్నారు. విక్రయమవుతున్న కార్ల సంఖ్య, శుభ్రపరిచే వాహనాల మధ్య చాలా అంతరం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో కార్ల కొనుగోళ్లు పెరిగే సూచనలు ఉన్నందున కార్‌వాషింగ్ పరిశ్రమ ప్రముఖ పరిశ్రమగా మారుతోంది. అందువల్ల ఈ వ్యాపారం భవిష్యత్‌లో మరింత లాభదాయకంగా మారనుంది.
మీ కార్ వాష్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి దశలు
మీ స్వంత కార్‌వాష్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. తద్వారా మీ వ్యాపారం యొక్క ప్రారంభ దశలో మీకు ఎటువంటి సమస్యలు ఎదురుకావు.
-
మీరు ప్రారంభించాలనుకుంటున్న కార్‌వాష్ వ్యాపార విధానం
మొదటి దశలో మీరు ప్రారంభించాలనుకుంటున్న కార్ వాష్ వ్యాపార విధానం గురించి నిర్ణయించుకోవాలి. రెండు రకాల కార్ వాష్ వ్యాపారాలు ఉన్నాయి, వీటి నుండి మీరు ఏదైనా ఎంచుకోవచ్చు.
(i) డోర్ టు డోర్ కార్‌వాష్
డోర్ టు డోర్ కార్ వాష్ సదుపాయం కల్పించాలనుకుంటే మీరు కస్టమర్ ఇంటికి వెళ్లి పూర్తి సేవలను అందించడం ద్వారా మీ వ్యాపారాన్ని కొనసాగించాలి. ఈ విధంగా కార్‌వాష్ సేవలను అందించాలనుకుంటే ఇటువంటి వ్యాపారానికి పేరు మాత్రమే సరిపోతుంది. అయితే ఇటువంటి సందర్భంలో మానవశక్తి ప్రధాన అవసరం కనుక వ్యాపారానికి ధృవీకరణ తప్పనిసరి. మరియు మీ వ్యాపారంలో పనిచేసే సిబ్బందికి తగిన గుర్తింపు కార్డులను ఇవ్వాలి. మీరు మీ కస్టమర్లకు మీ ట్రాకింగ్ వివరాలను అందించాలి. భారతదేశంలో డోర్ టు డోర్ ఫెసిలిటీ వ్యాపారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు తమ ఇళ్ళ నుండి కార్‌వాష్ సెంటర్లకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఒక సర్వేలో తేలింది. ఈ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు భారీ ప్రారంభ ఖర్చులు లేవు. అందువల్ల కార్‌వాష్ సెంటర్ ఏర్పాటుతో పోలిస్తే ఈ విధంగా డోర్ టు డోర్ కార్‌వాష్ సర్వీస్ నిర్వహించేందుకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు.
(ii) కార్‌వాష్ సెంటర్
మీరు కార్‌వాష్ సెంటర్ ప్రారంభించాలని అనుకుంటే అందుకు అనువైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. అప్పుడు స్వల్ప వ్యవధిలోనే భారీ లాభాలను సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. మీరు మీ కేంద్రాన్ని నివాసిత ప్రాంతానికి సమీపంలో లేదా కార్యాలయాల సమీపంలో ఏర్పాటు చేయవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మీకు కొన్ని అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. కార్‌వాష్ సెంటర్ ప్రారంభించడానికి మీకు ప్రభుత్వం నుండి అనుమతి అవసరం. నివాస ప్రాంతంలో వాణిజ్య సంస్థను ఏర్పాటు చేయడానికి కూడా అనుమతి అవసరం. కార్‌వాష్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి భారీ యంత్రాలు కొనుగోలు చేయడతో పాటు, తగినంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తీసుకున్న స్థలానికి తగినంత అద్దె చెల్లించాల్సివుంటుంది. యంత్రాల కొనుగోలుకు రూ. 17 నుంచి 25 లక్షల వరకు ఖర్చవుతాయి. మీరు కొనుగోలు చేయడానికి ఎంచుకున్న బ్రాండ్‌ను అనుసరించి యంత్రాల ధర మారుతుంటుంది.
-
మీ వ్యాపారాన్ని సెటప్ చేయడానికి తగిన స్థానం
వ్యాపారాలు విజయవంతం కావడానికి ఆ వ్యాపారం ఏర్పాటు చేసే ప్రాంతం కీలకంగా ఉంటుంది. వ్యాపారానికి తగిన ప్రదేశాన్ని ఎన్నుకున్నట్లయితే తక్కువ వ్యవధిలోనే భారీ లాభాలను సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. మీరు మీ కార్‌వాష్ సెంటర్‌ను నివాసిత ప్రాంతం లేదా కార్యాలయాల దగ్గర ఏర్పాటుచేయవచ్చు. మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు మీరు మీ లక్ష్య ప్రాంతంలోని పరిసరాలను గమనించండి. అక్కడుండే ట్రాఫిక్, అటుగా వెళ్లే వాహనాలను గమనించండి. అలాగే మీ సేవలను వృద్ధి చేసే ఇతర విషయాలపై కూడా దృష్టి పెట్టండి. మీరు మీ వ్యాపారాన్ని మీ పోటీదారులకు ధీటుగా ఉండేలా చూసుకోవాలి. తద్వారా మీరందించే సేవలు మీ పోటీదారుల సేవలకు మించి ప్రభావం చూపవు. మీరు మీ మార్కెట్‌ను మీ స్వంతంగా అభివృద్ధి చేసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోండి.
-
మీ పోటీదారుల తీరుతెన్నులను విశ్లేషించండి
ఈ వ్యాపారంలో తదుపరి దశ మీ పోటీదారులను విశ్లేషించడం. మరియు మీ పోటీదారులు వారి వినియోగదారులకు ఏఏ సేవలను అందిస్తున్నారో గమనించాలి. ప్రతిరోజూ వారి దగ్గరకు ఎంత మంది కస్టమర్లు వస్తారు? మరియు మీ పోటీదారులు ఎటువంటి మార్కెటింగ్ వ్యూహాలను అనుసరిస్తున్నారనే దానిని గమనించండి. అలాగే మీ పోటీదారులు అందించే సేవలు వారి కస్టమర్లను సంతృప్తిపరుస్తున్నాయా? లేదా వారికి సర్వీసు ప్రొవైడర్ల నుండి అంతకుమించి ఏదైనా అవసరమా? మీ పోటీదారులు రుణ రహితంగా పనిచేస్తున్నారా? లేదా వారు ఎవరివద్దననా రుణం తీసుకుంటున్నారా? అనేది గమనించాలి. మీ వ్యాపారం యొక్క ప్రారంభ దశలో మీరు తక్కువ ధరలకు సేవలను అందించవచ్చు. అధికశాతం కస్టమర్లను ఆకర్షించడానికి తక్కువ లాభాలు వచ్చిన రాజీపడాల్సివుంటుంది. మీ కస్టమర్లకు మెరుగైన సౌకర్యాలను అందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుండాలి. వ్యాపారం పెరిగేకొద్దీ క్రమంగా మీరందించే సేవల ధరలను పెంచుకోవచ్చు. అప్పుడే మీరు కస్టమర్ల నమ్మకాన్ని దక్కించుకోగలుగుతారు. అటువంటప్పుడు మీరు ధరలను పెంచినప్పటికీ వారు మీ పోటీదారుల కన్నా మీదగ్గరకు రావడానికే ఇష్టపడతారు.
-
మీ వ్యాపారం కోసం అవసరమైన లైసెన్స్‌లు
ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు చట్టపరమైన అవసరాలను నెరవేర్చాలి. మీ వ్యాపారాన్ని కొనసాగించేందుకు తగిన లైసెన్స్‌లను అందించే మీ స్థానిక ప్రభుత్వ విభాగాన్ని సందర్శించాలి. మీ కార్‌వాష్ వ్యాపార నిర్వహణకు లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. లైసెన్సు తీసుకోవడం ద్వారా మీరు భవిష్యత్‌లో ఎటువంటి సమస్యలను ఎదుర్కోరు.
జీఎస్టీ రిజిస్ట్రేషన్: మీ వ్యాపారానికి అవసరమైన చట్టపరమైన అనుమతుల కోసం జీఎస్టీ నమోదు తప్పనిసరి.
ల్యాండ్ పర్మిట్: కార్‌వాష్ సెంటర్ ప్రారంభించడానికి ముందుగా మీరు ల్యాండ్ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. మీరు మీ వ్యాపార కేంద్రాన్ని నివాసిత ప్రాంతంలో ప్రారంభించనట్లయితే మీ వ్యాపారానికి ఈ పర్మిట్ అవసరం.
వాటర్ పర్మిట్: ఈ వ్యాపారంలో మీరు కార్లను కడగడానికి చాలా ఎక్కువ నీటిని ఉపయోగించాల్సి ఉన్నందున మీరు వాటర్ పర్మిట్ కూడా కలిగి ఉండాలి. ఈ అనుమతి కింద నీటిని ఉపయోగించడానికి గరిష్ట పరిమితి ఉంటుంది. ఉదాహరణకు.. రోజుకు 800 లీటర్ల గరిష్ట నీటి వినియోగ పర్మిట్‌ను ఇస్తారు. ప్రతి రాష్ట్రం లేదా నగరంలో కార్‌వాష్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన నియమాలు మరియు నిబంధనలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి మీరు మీ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీ ప్రాంతంలో మీరు పాటించాల్సిన నియమనిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి.
-
సమర్థవంతమైన సిబ్బందిని నియమించుకోండి
ఈ వ్యాపారాన్ని నడపడంలో ప్రతీ అంశాన్నీ మీరే నిర్వహించడానికి బదులుగా నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలి. ఈ ప్రయోజనం పొందేందుకు మీరు అధికవేతనంపై నిపుణులైన సిబ్బందిని నియమించుకోవచ్చు. మీ పోటీదారులు వారి సిబ్బందికి ఇస్తున్న వేతనాల కన్నా అధిక మొత్తంలో మీరు ఆఫర్ చేయవచ్చు. కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో మరియు వారితో మర్యాదగా మాట్లాడటానికి నైపుణ్యాలు కలిగిన సిబ్బందిని నియమించుకోవడం తప్పనిసరి. తద్వారా మీ వ్యాపారం మీ కస్టమర్లపై ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించదు. కస్టమర్లతో ఎలా వ్యవహరించాలో మీ ఉద్యోగులకు కూడా స్వయంగా శిక్షణ ఇవ్వవచ్చు. మీ వ్యాపార ప్రారంభ దశలో మీరు కనీసం ఇద్దరు ఉద్యోగులను నియమించుకోవాలి. వ్యాపారం పెరిగేకొద్దీ మీరు అవసరాలకు అనుగుణంగా తగినంతమంది సిబ్బందిని నియమించుకోవచ్చు.
-
మీ వ్యాపార నిర్వహకు నిధులు అందుబాటులో ఉంచుకోండి
ఈ అంశం మీ వ్యాపార నిర్వహణకు చాలా ముఖ్యమైన మరియు అత్యంత సవాలుగా ఉన్న విషయం. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి తగిన ప్రణాళిక ఉంటే వ్యాపారం విజయవంతం కావడానికి ఖచ్చితంగా మార్గం ఏర్పడినట్లే. కార్‌వాష్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మరియు మీ కస్టమర్లకు ఉత్తమమైన సేవలను అందించడానికి మీ వ్యాపారంలో తగినంత పెట్టుబడులు పెట్టడానికి మీ దగ్గర నిధులు ఉండాలి. అలాగే వ్యాపారాభివృద్ధికి తగిన మార్కెటింగ్ ప్రణాళికను అమలు చేయాలి.
-
మీ వ్యాపార మార్కెట్ విధానం ఎలా ఉండాలి?
మీరు మీ కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు కస్టమర్లకు మీ కేంద్రం గురించి తెలియదు కాబట్టి, మీరు మీ వ్యాపారానికి తప్పనిసరిగా ప్రకటనలు ఇవ్వాల్సిన అవసరముంది. తద్వారా మీరందించే సేవల గురించి కస్టమర్లు తెలుసుకోగలుగుతారు. మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా మీరందించే సేవలను ప్రకటించడం ద్వారా మీ కార్‌వాష్ కేంద్రానికి ఎక్కువ మంది వినియోగదారులు ఆకర్షితులవుతారు. మీరు స్థానికంగా ప్రకటనలు ఇవ్వడంతోపాటు మీరందించే సేవల వివరాలను సోషల్ మీడియాలో ఉంచడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకోవచ్చు. కస్టమర్లను ఆకర్షించడానికి మీరు సోషల్ మీడియాలో ప్రచారాలను కూడా అమలు చేయవచ్చు. వ్యాపార ప్రారంభ దశలో మీరు మీ సేవలకు మార్కెట్లో డిమాండ్ పెంచుకునేందుకు తక్కువ మార్జిన్ వద్ద వాటిని అందించచ్చు. వ్యాపార ప్రారంభంలో అన్ని అవసరాలకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవద్దు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి చిన్న స్థాయి నుంచే ప్రయత్నించాలి. మీ వ్యాపార పరిధిని పెంచుకునేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫారాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు.