written by Khatabook | August 6, 2021

ఆదాయపు పన్ను మినహాయింపుల గురించిన పూర్తి సమాచారం

×

Table of Content


శీర్షికలో తెలియజేసిన విధంగా, ఆదాయపుపన్ను మినహాయింపు అనగా ఆదాయ వనరు నుండి పన్ను రూపంలో తగ్గించబడే సొమ్ము. ఇది ఒక వ్యక్తి( సొమ్ము ఇచ్చువాడు) మరొక వ్యక్తి( సొమ్ము గ్రహీత)కి ఒక నిర్దిష్ట రూపంలో ఇచ్చే అద్దె, వడ్డీ సొమ్ము, జీతం మొ. లగు వాటి నుండి ఇన్ కమ్ టాక్స్ సంస్థ సూచించిన విధంగా నిర్ణీతమైన సొమ్ము మొత్తం పన్ను రూపంలో తగ్గించబడే ఒక విధమైన ప్రక్రియ. ఇక్కడ సొమ్ము ఇచ్చే వ్యక్తే పైవాటి అన్నింటి నుండి మినహాయించి ఉంచిన మొత్తం టీడీఎస్ ను గడువు తేదీలోగా కేంద్ర ప్రభుత్వానికి జమ చేయాలి.

మీరు, చెల్లింపు విధానంతో సంబంధం లేకుండా ఏ విధంగానైనా టీడీఎస్ ను చెల్లించవచ్చు, అనగా నగదు రూపంలో కానీ, చెక్ లేదా క్రెడిట్ పద్ధతులలో కానీ చేయవచ్చు. చెల్లింపు దారుడి (చెల్లింపు దాత) చేత కోత విధించబడిన టీడీఎస్ మొత్తానికి ఆ ఉద్యోగస్థుడు(చెల్లింపు గ్రహీత) క్రెడిట్ పొందేందుకు అర్హుడు. ఉద్యోగస్థుడు( చెల్లింపు గ్రహీత) ఫామ్ 26 AS లేదా చెల్లింపుదారు( చెల్లింపు దాత) చేత ఇవ్వబడిన సర్టిఫికెట్ ద్వారా దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏమైనప్పటికీ, ఈ టీడీఎస్ రేటు అనేది ఆదాయం ఎంత ఉంది మరియు ఎంత మినహాయింపు అవుతుంది అనే దాన్ని బట్టి పరిధిలో 1% నుండి 30% వరకు ఉంటుంది. 

అసలు ఈ టీడీఎస్ అంటే ఏంటి? ఎందుకు చెల్లించాలి? 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ అనే సంస్థ ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం టిడిఎస్ నిబంధనలు ఎలా ఉండాలి అనేది నియంత్రిస్తుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, టిడిఎస్ అనేది ప్రత్యక్ష పన్నుగా మరియు ముందస్తు పన్నుగా ఉంటుంది. పన్ను చెల్లింపుదారు ఆదాయం ఎంత మరియు పన్ను ఎంత అనేది ప్రకటించి దానిని ఆదాయపన్ను శాఖలో జమ చేయాలి. ఈ క్రింది కారణాల వల్ల టీడీఎస్ అనేది ప్రవేశపెట్టబడింది:

  • ఆదాయాన్ని పొందిన తర్వాత పన్ను చెల్లించే వరకు జరిగే సమయ వృధాని తగ్గించేందుకు
  • ప్రభుత్వానికి క్రమం తప్పకుండా నిధుల ప్రవాహం ఉండేందుకు
  • వ్యక్తులు లేదా సంస్థలు పన్ను ఎగవేత చేయకుండా అరికట్టడానికి.
  • మీరు సంపాదించే ఏ రకపు ఆదాయం నుండి అయినా వెంటనే కొంత పన్ను చెల్లించే విధానం వలన సంవత్సరం చివరి వరకు ఆగడం మరియు ఒకేసారి చెల్లింపు దారుడి పైన పన్ను భారం పడటం వంటివి తగ్గించడానికి
  • అలాగే, పన్ను వసూలు చేసే సంస్థలపై పడే భారాన్ని తగ్గించడం కోసం

సొమ్ము ఎక్కడి నుండి వస్తుంది అనే దాన్ని బట్టి పన్ను రేటు, వేతనం మరియు వేతనం కాని చెల్లింపుల నుండి వేరు వేరుగా వసూలు చేయబడుతుంది.

చెల్లింపుల రకం

ప్రస్తుత టీడీఎస్ రేటు

వేతనాలు

10%

భద్రతా సొమ్ము పైన వచ్చే వడ్డీ

10%

మ్యూచువల్ ఫండ్స్ పైన వచ్చే డివిడెండ్ లు మరియు

కంపెనీల షేర్ లపైన వచ్చే ఆదాయం

10%

ఫిక్స్డ్ డిపాజిట్ లపై వచ్చే వడ్డీ

10%

లాటరీ బహుమతులపై వచ్చే ఆదాయం

30%

గుర్రపు పందాలపై వచ్చే ఆదాయం

30%

వ్యక్తులు పొందే భీమా డబ్బు

5%

ఏదైనా ఆస్తి కొనుగోలు సమయంలో జరిపిన లావాదేవీలు

1%

ఏవైనా యంత్ర సముదాయం లేదా పరిశ్రమలపై అద్దె పొందుతున్నప్పుడు

2%

ఏదైనా స్థిరాస్థిపై అద్దెకు పొందుతున్నప్పుడు

10%

ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం నుండి నెలకు రూ. 50,000 లకు పైగా అద్దె చెల్లింపులు పొందినప్పుడు

5%

దృష్టాంతాన్ని బట్టి రూ. 20 లక్షల నుండి 1 కోటి వరకూ చేసిన నగదు ఉపసంహరణ లపై

2%

టీడీఎస్ మినహాయింపులను ఎవరు చేయాలి?

ఈ క్రింది వారు మరియు ఈ తరగతికి చెందిన వ్యక్తులు టీడీఎస్ మినహాయింపులను జరపాలి: 

  • ఏవరైనా వ్యక్తి లేదా HUF ( కుటుంబం) వారి అకౌంట్ లను ఆదాయపన్ను చట్ట ప్రకారం ఆడిట్ జరిపి వాటి నుండి ఏవైనా చెల్లింపులు చేసిన సమయంలో తప్పనిసరిగా టీడీఎస్ ను మినహాయించాల్సి ఉంటుంది. 
  • ఎవరైనా వ్యక్తి లేదా HUF(కుటుంబం) నెలకు రూ. 50,000/- లకు పైగా అద్దె చెల్లిస్తున్నప్పుడు టీడీఎస్ 5%ను మినహాయించాల్సి ఉంటుంది. ఒకవేళ వారి అకౌంట్ లు ఆడిట్ చేయకపోయినా ఇది వర్తిస్తుంది.
  • వర్తించే ఆదాయపన్ను స్లాబ్ రేట్ ప్రకారం యజమానులు ఆయా ఆర్ధిక సంవత్సరానికి పన్నును మినహాయించాల్సి ఉంటుంది. ఒకవేళ, మీరు మీ పాన్ నంబరును ఇవ్వనట్లయితే బ్యాంకులు 20%  రేటుతో టీడీఎస్ ను మినహాయిస్తాయి.
  • మీకు సంబంధించిన ప్రతీ బ్యాంక్ లోని ఎఫ్డీ( ఫిక్స్డ్ డిపాజిట్లు) లేదా ఆర్డీ( రికరింగ్ డిపాజిట్) లపై మీ పాన్ డిటైల్స్ లను ఇచ్చినట్లయితే 10% టీడీఎస్ మినహాయించబడుతుంది. ఒకవేళ పాన్ వివరాలను అందించనట్లయితే బ్యాంక్ లు 20% టీడీఎస్ ను  మినహాయిస్తాయి.
  • ఆదాయపు పన్ను రేట్ల ప్రకారం మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని మీరు బ్యాంకుకు సరైన సమాచారం అందిస్తే, బ్యాంక్ మీకు వడ్డీల రూపంలో వచ్చే ఆదాయంలో టీడీఎస్ ను మినహాయించదు. మీరు అటువంటి సమాచారాన్ని ఫారం 15 జి లేదా 15 హెచ్‌లో దాఖలు చేయవచ్చు.
  • ఒకవేళ బ్యాంక్ లు  ఇప్పటికే టీడీఎస్ ను మినహాయించి ఉంటే, మీరు యజమాని వద్ద సకాలంలో ఆదాయ రుజువును దాఖలు చేయలేకపోతే మీరు ఎప్పుడైనా వాపసు కోసం దాఖలు చేయవచ్చు.

దీనిని కూడా చదవండి: GST నంబర్: ప్రతీ వ్యాపారానికి కావాల్సిన 15 అంకెల నంబర్

టీడీఎస్ సర్టిఫికెట్లు అంటే ఏమిటి? 

పన్ను మినహాయింపు జరిగినట్లుగా ప్రభుత్వం ఈ క్రింది సర్టిఫికెట్ లను జారీ చేస్తుంది.: ఫామ్ 16ఏ, 16బి,16సి. చెల్లింపుదారుడు(చెల్లింపు దాత/ యజమాని) టిడిఎస్ జమ చేసిన తరువాత చెల్లింపు గ్రహీత( ఉద్యోగస్తులకు) లకు ఈ ధృవపత్రాలను ఇస్తాడు. కానీ కొన్ని సందర్భాలలో ఇలా ధృవపత్రాలను ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు కొన్ని సందర్భాలలో చెల్లింపు గ్రహీత తనని ఆదాయ పన్ను పరిధిలోకి రానని పేర్కొన్నా లేదా కొంత తగ్గింపు కోసం ధరఖాస్తు చేసుకున్నా టీడీఎస్ సర్టిఫికెట్ అవసరం లేదు. ఇతర సందర్భాలలో మాత్రం టీడీఎస్ సర్టిఫికెట్ ఇవ్వడం తప్పనిసరి. ఒకవేళ చెల్లింపు దాత/ యజమాని అలా చేయలేకపోతే, అతను దానిని జారీ చేసే వరకు అతనికి రోజుకు రూ .100 జరిమానా విధించడం జరుగుతుంది. కానీ, ఈ జరిమానా మినహాయించబడే టిడిఎస్ మొత్తాన్ని మాత్రం మించదు.

వివిధ రకాల టీడీఎస్ సర్టిఫికెట్లు

  • ఫామ్ 16: ఇది వేతన జీవులకు వారి జీతాల చెల్లింపుపై సంవత్సరానికి ఒకసారి జారీ చేసే టిడిఎస్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ఇవ్వడానికి గడువు తేదీ మే 31. ఎవరైనా ఉద్యోగి యొక్క ఆదాయం, అసలు పన్ను పరిధిలోకి వచ్చే మొత్తం రూ .2,50,000 కన్నా తక్కువగా ఉంటే, అప్పుడు యజమాని వారి వేతనాల నుండి టిడిఎస్‌ కోత వేయడు. ఇలాంటి సందర్భాలలో యజమాని అటువంటి ఉద్యోగికి ఫారం 16 జారీ చేయడు.
  • ఫామ్ 16 ఏ: ఈ టీడీఎస్ సర్టిఫికెట్ వేతనేతర చెల్లింపులకు సంబంధించి జారీ చేయబడుతుంది. చెల్లింపు దాత దీన్ని మూడు నెలలకు ఒకసారి జారీ చేస్తాడు. రిటర్న్ దాఖలు చేసిన గడువు తేదీ నుండి 15 రోజుల్లోపు చెల్లింపుదారు(దాత) దీన్ని జారీ చేయాలి. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లపై డిపాజిటర్లు సంపాదించిన వడ్డీపై కూడా బ్యాంకులు ఈ సర్టిఫికెట్ ను జారీ చేస్తాయి. ఈ సర్టిఫికెట్ భీమాపై సంపాదించిన కమీషన్ మీద కూడా జారీ చేయబడుతుంది.
  • ఫామ్16 బి: ఆస్థి అమ్మకాలకు సంబంధించిన అన్ని లావాదేవీలలో చెల్లింపుదారు ఈ సర్టిఫికెట్ ను జారీ చేయాలి. అలాగే ఫామ్ 16 ఏ లాగా, రిటర్న్ దాఖలు చేసిన గడువు తేదీ నుండి 15 రోజుల్లోపు చెల్లింపుదారు(దాత) ఈ సర్టిఫికెట్ ను జారీ చేయాలి. 
  • ఫామ్16సి: అద్దె ద్వారా వచ్చే ఆదాయాలపై చేసే మినహాయింపులకు చెల్లింపుదారు ఫామ్16సి టీడీఎస్ సర్టిఫికెట్ ను జారీ చేస్తాడు. రిటర్న్ దాఖలు చేసిన గడువు తేదీ నుండి 15 రోజుల్లోపు చెల్లింపుదారు(దాత) ఈ సర్టిఫికెట్ ను జారీ చేయాలి. 

 టిడిఎస్ రిటర్న్ ఫారమ్‌ల రకాలు

ఆదాయపు రకాలు మరియు మినహాయింపు రకాలను బట్టి టిడిఎస్ రిటర్న్స్ దాఖలు చేయడానికి వివిధ రకాల ఫామ్ లను నింపడం ప్రభుత్వానికి అవసరం. టిడిఎస్ రిటర్న్స్ యొక్క నాలుగు ముఖ్యమైన రకాలు ఈ క్రింద ఇవ్వబడినవి:

  1. ఫామ్ 24క్యూ: ఈ టిడిఎస్ రిటర్న్ ఫారం జీతం చెల్లింపుల నుండి మినహాయించబడే టిడిఎస్ కోసం ఒక ప్రకటన. యజమాని దీనిని ప్రతీ త్రైమాసికంలో  దాఖలు చేయాలి. ఇది ఉద్యోగి జీతం మరియు యజమాని చేత తీసివేయబడే టిడిఎస్ యొక్క మొత్తం సమాచారాన్ని మనకు తెలియజేస్తుంది
  2. ఫామ్ 26క్యూ:ఈ టిడిఎస్ రిటర్న్ ఫారం డివిడెండ్ సెక్యూరిటీలు, సెక్యూరిటీలపై వచ్చే వడ్డీ, ప్రొఫెషనల్ ఫీజు లేదా డైరెక్టర్ల వేతనం వంటి వేతనాలు కాని చెల్లింపుల టిడిఎస్ కోసం ఒక ప్రకటన. చెల్లింపుదారు/ యజమాని దీనిని ప్రతీ త్రైమాసికంలో దాఖలు చేయాలి.
  3. ఫామ్ 27 క్యూ: డివిడెండ్, బోనస్, వడ్డీ లేదా విదేశీయులకు లేదా ఎన్నారైలకు ఏదైనా ఇతర చెల్లించే మొత్తాలు వంటివి ఉన్నప్పుడు మీరు ఇలాంటి టిడిఎస్ రిటర్న్ ఫారమ్‌ను దాఖలు చేయాలి. మరో మాటలో చెప్పాలంటే, చెల్లింపుదారులు విదేశీయులకు మరియు ప్రవాస భారతీయులకు చేసిన చెల్లింపుల కోసం ఈ రిటర్న్స్ ను ఫైల్ చేస్తారు.
  4. ఫామ్ 27 ఈక్యూ: ఇది ప్రాథమికంగా ముందుగా వసూలు చేసిన పన్ను కోసం ఒక ప్రకటన. పేరు సూచించినట్లు మూలం వద్ద అమ్మకందారు వసూలు చేసిన పన్ను. సేకరించినవారు  ప్రతీ త్రైమాసికంలో సమర్పించాలి.

టిడిఎస్ చెల్లించడానికి గడువు తేదీ 

  • మీరు మీ ఆదాయ ఆధారం నుండి పన్ను మినహాయింపు చెల్లించినప్పుడు లేదా ఛాలాన్ లేకుండా కట్టినట్లయితే మీరు టీడీఎస్ ను అదే రోజున జమ చేయాల్సి ఉంటుంది.
  • మీరు మీ ఆదాయ ఆధారం నుండి పన్ను మినహాయింపు చెల్లించినప్పుడు లేదా ఛాలాన్ తో కట్టినట్లయితే మీరు వచ్చే నెల 7వ తారీఖు లోపు టీడీఎస్ ను జమ చేయాల్సి ఉంటుంది.

ఆర్థిక సంవత్సరం 2020-21 కి టీడీఎస్ ఫైల్ చేయడం

త్రైమాసిక సమయం 

ఫైలింగ్ చేయడానికి గడువు తేదీ

ఎప్రిల్ నుండి జూన్ వరకు

31 మార్చి

జులై నుండి సెప్టెంబర్ వరకు

31 మార్చి

అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు

31 డిసెంబర్

జనవరి నుండి మార్చి

31 మే 

సాంకేతికంగా రిటర్న్స్‌ను ఫైల్ చేసేందుకు ఎవరికి అధికారం ఉంది?

ఒక అంచనా ప్రకారం ఈ క్రింద తెలియజేయబడిన వారు త్రైమాసిక ప్రాతిపదికన సాంకేతికంగా మూలధనం నుండి మినహాయించిన పన్నును దాఖలు చేయడం తప్పనిసరి:

  • 44ఏబీ u/s ప్రకారం ఎవరి అకౌంట్లు అయితే ఆడిట్ చేయబడతాయో వారు
  • ప్రభుత్వ ఉద్యోగులు
  • సంస్థలు/ కంపెనీలు

టిడిఎస్ రిటర్న్స్ ను  దాఖలు చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సిన విషయాలు

  • ఇ-ఫైలింగ్ కోసం మీకు చెల్లుబాటు అయ్యే మరియు నమోదిత పన్ను మినహాయింపు మరియు కలెక్షన్ ఖాతా సంఖ్య (TAN) ఉందని నిర్ధారించుకోండి. ఫారం 27A లో ఫైల్ చేయడానికి మీకు ఇది అవసరం.
  • కంపెనీలు మరియు ప్రభుత్వ అధికారులు తమ టిడిఎస్ రిటర్న్స్‌ను ఎలక్ట్రానిక్‌గా దాఖలు చేయడం తప్పనిసరి. ఏదేమైనా, పైన పేర్కొన్నవి కాకుండా ఏదైనా తగ్గింపు ఉంటే మాత్రం భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేయవచ్చు.
  • ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీ రిటర్న్స్ ని అప్‌లోడ్ చేయడానికి మీకు చెల్లుబాటు అయ్యే డిజిటల్ సంతకం అవసరం. ఇ-రిటర్న్ ఆదాయ-పన్ను విభాగం మరియు ఎన్ఎస్డిఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) వారు సూచించిన విధంగా ఇది ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో ఉండాలి. ఈ ఫార్మాట్ మాత్రమే మెరుగైన సామర్థ్యం మరియు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీనిని మాత్రమే విధిగా ఉపయోగించడం తప్పనిసరి.
  • ఇ- టీడీఎస్ రిటర్న్స్ ఫైలింగ్ చేయునప్పుడు 7 అంకెల బ్యాంక్ శాఖా కోడ్ ను పేర్కొనడం తప్పనిసరి.
  • ఆథరైజ్ చేయబడిన సంతకం గల ఫామ్ 27A ని సమర్పించండి. ఫామ్ 27A ను రూపొందించడానికి మీరు ఫైల్ వాలిడేషన్ యుటిలిటీని ఉపయోగించవచ్చు. ఏవైనా తప్పులు దొరికితే ఫైల్ ధ్రువీకరణ యుటిలిటీ వాటిని మీకు తెలియజేస్తుంది. మీరు TIN-NSDL వెబ్‌సైట్‌లో ఫైల్ ధ్రువీకరణ యుటిలిటీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
  • సాధారణంగా, మీరు రిటర్న్‌ ను, చెల్లింపుదారు యొక్క పాన్ మరియు ఏదైనా తగ్గింపు సంబంధిత వివరాలు, ప్రభుత్వానికి చెల్లించిన పన్ను మొత్తం మరియు మూలధనం నుండి తగ్గించిన పన్ను చలాన్ వివరాలతో దాఖలు చేస్తారు. అయితే, మీరు ఇ-టిడిఎస్ రిటర్న్‌తో పాటు బ్యాంక్ చలాన్ లేదా టిడిఎస్ సర్టిఫికేట్ కాపీని దాఖలు చేయవలసిన అవసరం లేదు.
  • ఇ-రిటర్న్ తప్పనిసరి కానప్పుడు, మదింపుదారుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న వివిధ ఎన్‌ఎస్‌డిఎల్ ఆమోదించిన టిన్-ఎఫ్‌సిల వద్ద ఎప్పుడైనా టిడిఎస్ రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు.
  • టిడిఎస్ ఫారమ్‌ను దాఖలు చేసేటప్పుడు దానిలో అనవసర రాతలు లేకుండా అవసరమైనంత వరకే ఉంది అని భౌతికంగా నిర్ధారించుకోండి
  • రిటర్న్ ను ఎలక్ట్రానిక్ గా దాఖలు చేస్తే గనక, మీరు నేరుగా టిఐన్-ఎన్ఎస్డిఎల్ వెబ్‌సైట్‌లో ఫైల్ చేయవచ్చు. ఇటువంటి సందర్భంలో మీరు డిజిటల్ సంతకంతో రిటర్న్‌ను దాఖలు చేయాలి.
  • ఏ టిడిఎస్ ఫైల్ ఫార్మాట్ ఎంచుకోబడినా కూడా దాని ఫైల్ పేరు పొడిగింపులో “txt” ఉండేలా ఒకసారి చెక్ చేయండి. ఇ-రిటర్న్ దాఖలు చేసేటప్పుడు మీకు క్లీన్ టెక్స్ట్ ఫార్మాట్ అవసరం ఉంటుంది. ఇది ఎంఎస్ ఎక్సెల్ లేదా టాలీ లేదా ఎన్ఎస్డిఎల్ వెబ్‌సైట్‌లో సాఫ్ట్‌వేర్ గా మీకు లభిస్తుంది
  • రిటర్న్స్ సమర్పించేటప్పుడు మొత్తం సమాచారం ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలి మరియు అవసరమైన అన్ని పత్రాలను సరిగ్గా అప్‌లోడ్ చేయాలి.
  • రిటర్న్ ఆమోదించబడని సందర్భాల్లో, ఎందుకు తిరస్కరించబడిందో గల కారణాలతో పాటు అంగీకరించబడలేదని కూడా ఒక మెమో జారీ చేస్తుంది.

టిడిఎస్ రిటర్న్ చేసేందుకు జాప్యం మరియు దాఖలు చేయనందుకు జరిమానాలు

  • టీడీఎస్ రిటర్న్ చేసేందుకు జాప్యం
  • ఆలస్యం లేదా జాప్యం అనగా నిర్ణీత తేదీ నాటికి మూలధనం నుండి మినహాయించిన పన్నును దాఖలు చేయకపోవడాన్ని సూచిస్తుంది. దీనికి ప్రతి రోజూ మదింపుదారుడు 200 రూపాయల జరిమానా చెల్లించాలి, డిఫాల్ట్ గా ఇది రోజూ కొనసాగుతూ ఉంటుంది. అయితే, ఇటువంటి జరిమానా టీడీఎస్ మొత్తాన్ని మాత్రం మించకూడదు.
  • ఒక సంస్థ టిడిఎస్‌ మినహాయింపు జరపడంలో ఆలస్యం చేయడం
  • ఒక సంస్థ టిడిఎస్ రిటర్న్ దాఖలు చేయడంలో ఆలస్యం చేస్తే, అసలు మినహాయింపు తేదీ నుండి ఆలస్యంగా టిడిఎస్ జమ చేసిన తేదీ వరకు 1% p.m వడ్డీ అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.
  • టిడిఎస్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వడం లేదా అసలు దాఖలు చేయకపోవడం. 
  • రిటర్న్ యొక్క గడువు తేదీ నుండి ఒక సంవత్సరం తరువాత కూడా మూలధనం నుండి మినహాయించిన పన్నును దాఖలు చేయడంలో మదింపుదారుడు విఫలమైతే లేదా తప్పుడు సమాచారం ఇస్తే, అటువంటి వారు భారీ జరిమానా విధించబడతారు. ఈ జరిమానా కనిష్టంగా రూ .10,000 మరియు గరిష్టంగా 1,00,000 రూపాయలు ఉంటుంది.
  • సమయానికి టీడీఎస్ చెల్లించడంలో వైఫల్యం
  • ఒక సంస్థ టిడిఎస్‌ మినహాయింపులు జరిపినా, నిర్ణీత తేదీకి చెల్లించడంలో విఫలమైతే, దానిపై వడ్డీ కూడా టీడీఎస్ కు కలపబడుతుంది. వారు టిడిఎస్ మినహాయింపులు జరిపిన తేదీ నుండి వారు మరలా చెల్లించే తేదీ వరకు 1.5% p.m వడ్డీని అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.

టీడీఎస్ వాపసు

సాధారణంగా అసలు బాధ్యతగా కట్టవలసిన  పన్ను మొత్తం,  మూలధనం నుండి మినహాయించబడిన పన్ను కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ మదింపుదారుడు బకాయి మొత్తాన్ని తప్పక చెల్లించాలి. ఒకవేళ ఈ పన్ను మొత్తం మూలధనం నుండి మినహాయించబడిన పన్ను కంటే తక్కువగా ఉన్నప్పుడు, ఆ సొమ్ము తిరిగి వాపసు చేయబడుతుంది. ఆదాయపు పన్ను శాఖ మూడు నుండి ఆరు నెలల మధ్య వసూలు చేసిన అదనపు పన్నును తిరిగి మదింపుదారుడికి చెల్లిస్తుంది. ఇక్కడ వీరు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారా లేదా అనే దానిపై కూడా సొమ్ము వాపసుకు ఈ సమయం ఎంత పట్టొచ్చనేది ఆధారపడి ఉంటుంది.

ఇటువంటి టిడిఎస్ వాపసు యొక్క రసీదు మదింపుదారుడి యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడికి కూడా పంపబడుతుంది. మదింపుదారునికి ఒకవేళ రసీదు లభించకపోతే వారు ఎప్పుడైనా ఆదాయపు పన్ను వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు. వాపసు కోసం దాఖలు చేయడానికి లేదా అతని సొమ్ము వాపసు స్థితిని అంచనా వేయడానికి తన పాన్‌ను ఉపయోగించవలసి ఉంటుంది. ఒకవేళ మూడు నుంచి ఆరు నెలల్లోపు మదింపుదారుడు టిడిఎస్ వాపసు పొందకపోతే, ఆదాయపు పన్ను శాఖ అటువంటి వాపసు మొత్తానికి 6% p.a వడ్డీని అధికంగా చెల్లించాలి. కానీ, అటువంటి వాపసు మొత్తం అసలు పన్ను లో10% కన్నా తక్కువ ఉంటే ఈ వడ్డీ చెల్లించబడదు.

ముగింపు

మూలధనం నుండి మినహాయించబడే ఈ పన్ను ఆదాయాన్ని సంపాదించడంలో ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పన్ను చెల్లింపుదారులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక మదింపుదారుడు పన్నును ఒక విధంగా లేదా మరొక విధంగా ఏలాగైనా చెల్లించాలి. కొత్తగా ఈ టీడీఎస్ వాడకం వలన మదింపుదారునికి పన్ను చెల్లించడం సులభతరంగా మరియు సౌకర్యవంతంగా మారింది.

తరచుగా అడిగే ప్రశ్నలు

- టిడిఎస్ రిటర్న్ దాఖలు చేసేటప్పుడు మినహాయింపు చేసే వారికి మరియు మినహాయింపు చేయించుకునే వారికి  ఇద్దరికీ పాన్ తప్పనిసరా?

అవును, మూలధనం నుండి మినహాయించిన పన్నును దాఖలు చేసేటప్పుడు మినహాయింపు చేసే వారికి మరియు మినహాయింపు చేయించుకునే వారికి  ఇద్దరికీ పాన్ తప్పనిసరి.

- టీడీఎస్ రిటర్న్ ఫైలింగ్ జరిపిన తర్వాత ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దవచ్చా?

దిద్దవలసిన తప్పులు మరియు మార్పులు చేర్పులు ఎలాంటివి అనేదాన్ని బట్టి టీడీఎస్ రిటర్న్స్ ను C1 నుండి C5 ఫామ్ లను ఉపయోగించి సరిచేయవచ్చు. 

- సవరించిన టిడిఎస్ రిటర్న్‌ను నేను ఎన్నిసార్లు దాఖలు చేయవచ్చు?

ఏదైనా కొత్త మార్పులు లేదా దిద్దుబాట్లు లేదా అప్డేట్ లను చేసేందుకు మీరు ఎన్ని సార్లయినా టిడిఎస్ రిటర్న్‌ను సవరించి తిరిగి దాఖలు చేయవచ్చు. అయితే ఇక్కడ మొదటిసారి చేసిన రిటర్న్ అంగీకరించబడినప్పుడు మాత్రమే మీరు ఇలా సవరింపుల చేసిన రిటర్న్ ను  దాఖలు చేయవచ్చని మాత్రం గుర్తుంచుకోండి.

- ఆన్‌లైన్‌లో దాఖలు చేసిన మా టిడిఎస్ రిటర్న్ ప్రస్థుత స్థితిని నేను తనిఖీ చేయవచ్చా?

తప్పకుండా, ఏ వ్యక్తి అయినా ఎన్‌ఎస్‌డిఎల్ వెబ్‌సైట్‌కు వెళ్లవచ్చు మరియు పాన్ లేదా తాత్కాలిక టోకెన్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా వారు వారి టిడిఎస్ రిటర్న్ స్థితిని తనిఖీ చేయవచ్చు.

- ఇ-టిడిఎస్ రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు నేను ఏవైనా ఛార్జీలు చెల్లించాలా?

అవును, మీ టిడిఎస్ రిటర్న్‌లో రికార్డుల సంఖ్యను బట్టి, మీరు మీ ఇ-టిడిఎస్ రిటర్న్‌పై ఛార్జీలు చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం క్రింది పట్టికను చూడండి:

ఇ-టిడిఎస్ / టిసిఎస్ రిటర్న్‌లో మినహాయింపు రికార్డుల సంఖ్య

అప్‌లోడ్ ఛార్జీలు (ఇది కాకుండా జీఎస్టీ ప్రత్యేకం) * జీఎస్టీ వర్తిస్తుంది

రిటర్న్స్ లో 100 రికార్డులు ఉంటే

₹42.37

రిటర్న్స్ లో 101 నుండి 1000 రికార్డులు ఉంటే

₹178.00

రిటర్న్స్ లో 1000 కి పైగా రికార్డులు ఉంటే

₹578.50

*జీఎస్టీ వర్తిస్తుంది

నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.
నిరాకరణ :
ఈ వెబ్ సైట్ లో అందించబడ్డ సమాచారం, ఉత్పత్తులు మరియు సర్వీసులు ఎలాంటి వారెంటీ లేదా ప్రాతినిధ్యం, లేకుండా మాత్రమే ''లభ్యమవుతాయనే' కండిషన్ తో అందించబడతాయి. Khatabook బ్లాగులు అన్నీ ఆర్థిక సేవలు మరియు ఉత్పత్తుల పై వినియోగదారులకు అవగాహన కలిపించడానికి మాత్రమే వ్రాయబడినవి. ఈ సర్వీసులు మీ అవసరాలన్నిటికి సరిపోతాయని, అంతరాయం లేకుండా పని చేస్తాయని, అన్ని సమయాల్లో సురక్షితమైనవని, రెగ్యులర్ గా పని చేస్తాయని, ఏమైనా సమస్యలు ఉంటే, సరిచేయబడతాయని Khatabook వారు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్న సమాచారం కేవలం సాధారణ ప్రయోజనాలకు మాత్రమే. ఏదైనా చట్టపరమైన, ఆర్థిక లేదా వ్యాపార పరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారంపై ఆధారపడేటట్టు అయితే ముందుగా ప్రొఫెషనల్ ని సంప్రదించండి. ఈ సమాచారాన్ని మీ లాభానికి వాడుకొనేటప్పుడు, పూర్తి రిస్క్ కు మీరే బాధ్యులు. వెబ్ సైట్ లో ఉన్న ఏదైనా తప్పుడు, లేదా అసంపూర్ణ సమాచారానికి Khatabook బాధ్యత వహించదు. ఈ వెబ్ సైట్ లో ఉన్న సమాచారం అప్ డేట్ చేయబడి, ఖచ్చితమైనది అని ధృవీకరించడానికి మేము ప్రయత్నాలు చేసినప్పటికీ, వెబ్ సైట్ కు సంబంధించి సంపూర్ణత, విశ్వసనీయత, ఖచ్చితత్త్వం, అనుకూలత లేదా లభ్యత లేదా ఏదైనా ప్రయోజనం కొరకు వెబ్ సైట్ లో ఉన్న సమాచారం, ప్రొడక్ట్, సర్వీసులు లేదా సంబంధిత గ్రాఫిక్స్ పై Khatabook ఎలాంటి గ్యారెంటీ ఇవ్వదు. ఏదైనా సాంకేతిక సమస్యలు లేదా ఇతరత్రా సమస్యలు లేదా అందుకు మించి దేనివల్లనైన ఈ వెబ్ సైట్ ని పనిచేయకపోయినా, లేదా యాక్సెస్ పోయినా, అందువల్ల ఎవరికైనా ఏదైనా నష్టం లేదా డ్యామేజీ కలిగినా, దానికి Khatabook బాధ్యత వహించదు.